Bigg Boss Buzz: బిగ్ బాస్ బజ్.. దక్షి పరువు తీసేసిన శివాజీ.. అసలు కనపడలేదని ట్రోల్.. శాలిని ఎలుక పిల్ల
Bigg Boss Buzz: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ నుంచి ఎలిమినేట్ అయిన దక్షి పరువు తీసేశాడు శివాజీ. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్ బాస్ బజ్ లో కంటెస్టెంట్లను శివాజీ ఇంటర్వ్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. గత వారం ఎలిమినేషన్ లేకపోవడంతో బజ్ ఇంటర్వ్యూ లేకుండా పోయింది. ఇప్పుడేమో దక్షిని ఆటాడుకున్నాడు.
Bigg Boss Buzz: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ సీజన్ ఏడో వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఇప్పటికే హౌస్ నుంచి దక్షి వెళ్లిపోయింది. వైల్డ్ కార్డు ఎంట్రీగా అడుగుపెట్టిన దక్షి జర్నీ రెండు వారాల్లోనే ముగిసింది. ఈ ఆర్జీవీ హీరోయిన్ ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది.

బిగ్ బాస్ 10 ఎలిమినేషన్
బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ఏడో వారంలో దక్షి ఎలిమినేట్ అయింది. హౌస్ లో ఆమె పెద్దగా కనిపించలేదు. ఎవరితోనూ ఎక్కువగా కదల్లేదు. అసలు హౌస్ లో ఉన్నట్లే తెలియలేదు. టాస్క్ ల్లోనూ ప్రదర్శన అంతంతమాత్రమే. అందుకే జనాలు కూడా దక్షికి ఓట్లు వేయలేదు. దీంతో ఆమె ఇంటికి వెళ్లలేక తప్పలేదు.
బిగ్ బాస్ బజ్
బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను బిగ్ బాస్ బజ్ లో శివాజీ ఇంటర్వ్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా దక్షిని శివాజీ ఇంటర్వ్యూ చేశాడు. ఇంటర్వ్యూ చేయడం కంటే కూడా ఎక్కువగా ట్రోల్ చేశాడని చెప్పొచ్చు. అసలు దక్షి బిగ్ బాస్ ఎందుకు వచ్చిందో కూడా అర్థం కానట్లు శివాజీ మాట్లాడాడు.
దక్షి పరువు తీసేసిన శివాజీ
బిగ్ బాస్ బజ్ లోకి దక్షి ఎంట్రీ ఇవ్వడంతోనే శివాజీ పరువు తీసేశాడు. దక్షి అనే అమ్మాయి వస్తుందని అన్నారు, ఈమె ఎవరో వచ్చిందని శివాజీ అన్నాడు. తనే దక్షిని ని దక్షి చెప్పింది. ఇప్పుడు బాగానే కనిపిస్తున్నావ్, మరి హౌస్ లో ఎందుకు కనిపించలేదని దక్షి పరువు శివాజీ తీసేశాడు.
కెమెరాలు తనను చూపించలేదేమోనని దక్షి కవర్ చేసుకునేందుకు ట్రై చేసింది. ఏమైనా చేస్తే కదా కెమెరాలు చూపించడానికి అని శివాజీ మళ్లీ ట్రోల్ చేశాడు.
నరేష్ తో గేమ్
వైల్డ్ కార్డు ఎంట్రీగా హౌస్ లోకి వెళ్లిన దక్షి మ్యాజిక్ పవర్ కోసం నరేష్ తో గేమ్ ఆడింది. కానీ ఈ గేమ్ లో ఓడిపోయింది. అదే విషయాన్ని బిగ్ బాస్ బజ్ లో శివాజీ గుర్తు చేశాడు. నరేష్ అంటే చిన్నగా ఉంటాడు, ఈజీగా గెలిచేద్దామనుకున్నావా? అని దక్షిని అడిగాడు. కానీ రివర్స్ అయిందని అన్నాడు.
శాలిని ఎలుక
శాలినితో గొడవ గురించి కూడా శివాజీ, దక్షి మాట్లాడుకున్నారు. శాలినితో గొడవ గురించి శివాజీ అడిగితే.. శాలిని ఓ చిన్న ఎలుకు పిల్ల అని, తనతో ఏం గొడవ పెట్టుకుంటామని దక్షి వెటకారంగా మాట్లాడింది. ఇంకా ఈ ఇంటర్వ్యూలో ఇతర హౌస్ మేట్స్ గురించి కూడా దక్షి కామెంట్లు చేసింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


