Bigg Boss 10 Double Elimination: బిగ్ బాస్ 10 డబుల్ ఎలిమినేషన్-దక్షి అవుట్, శాలిని కూడా-ఈ ఇద్దరికీ షాకింగ్ రెమ్యునరేషన్!

Bigg Boss 10 Double Elimination: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఏడో వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని సమాచారం. వైల్డ్ కార్డు ద్వారా అడుగుపెట్టిన దక్షి కేవలం రెండు వారాలకే ఎలిమినేట్ కాగా.. సీక్రెట్ రూమ్ నుంచి రీ ఎంట్రీ ఇచ్చిన శాలిని కూడా ఈ వారం ఇంటికి వెళ్తుందని టాక్. వీళ్ల రెమ్యునరేషన్ వివరాలపై లుక్కేయండి.

Published on: Oct 25, 2026, 14:18:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Bigg Boss 10 Double Elimination: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రేక్షకులను అనూహ్య మలుపులతో అలరిస్తోంది. ఏడో వారం వీకెండ్ ఎపిసోడ్ కు వచ్చేసరికి ఓటింగ్ లో భారీ మార్పులు కనిపించాయి. కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షోలో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని లీక్ వీరులు ముందే పసిగట్టారు. అయితే, ఆ ఇద్దరు కంటెస్టెంట్లు దక్షి, శాలిని కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

బిగ్ బాస్ 10 డబుల్ ఎలిమినేషన్-దక్షి అవుట్, శాలిని కూడా-ఈ ఇద్దరికీ షాకింగ్ రెమ్యునరేషన్! (youtube/starmaa)
బిగ్ బాస్ 10 డబుల్ ఎలిమినేషన్-దక్షి అవుట్, శాలిని కూడా-ఈ ఇద్దరికీ షాకింగ్ రెమ్యునరేషన్! (youtube/starmaa)

వైల్డ్ కార్డు దక్షి.. రెండు వారాలకే ఔట్!

దక్షి బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ హౌస్ లోకి ప్రారంభంలో రాలేదు. ఆట రసవత్తరంగా సాగుతున్న సమయంలో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టింది. ఎన్నో అంచనాలతో వచ్చిన దక్షి కేవలం రెండు వారాలు మాత్రమే హౌస్ లో కొనసాగింది. ఇతర కంటెస్టెంట్లతో ఇమిడిపోవడంలో ఆమె పూర్తిగా విఫలమైంది.

గేమ్ పరంగా కూడా తన మార్క్ చూపించలేకపోయింది. ఫిజికల్ టాస్కుల్లో డల్ గా ఉండటం, స్ట్రాటజీలు వర్కౌట్ కాకపోవడంతో ప్రేక్షకుల్లో ఆమెకు పెద్దగా కనెక్ట్ అయ్యే అవకాశం దక్కలేదు. ఫలితంగా ఓటింగ్ లో వెనుకబడి వైల్డ్ కార్డు జర్నీ కాస్తా రెండు వారాలకే ముగిసిపోయింది. ఇప్పటికే ఆమె ఎలిమినేషన్ కు సంబంధించిన ప్రోమో కూడా వచ్చింది.

శాలిని-రోహిత్ లవ్ ట్రాక్

ఇక ఈ ఇవాళ (అక్టోబర్ 25) బిగ్ బాస్ నుంచి శాలిని కూడా ఎలిమినేట్ అయినట్లు తెలిసింది. శాలిని జర్నీ బిగ్ బాస్ 10లో ఒక రోలర్ కోస్టర్ లా సాగింది. ముందుగా ఆమె ఎవిక్ట్ అయినట్లు అనిపించినా, బిగ్ బాస్ ఆమెను సీక్రెట్ రూమ్ కు పంపించాడు. అక్కడి నుంచి హౌస్ మేట్స్ గేమ్ ను గమనించి మళ్లీ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే, రీ ఎంట్రీ తర్వాత శాలిని గేమ్ కంటే కూడా.. రోహిత్ తో ఆమె నడిపిన లవ్ ట్రాక్ నెట్టింట తీవ్ర స్థాయిలో వైరల్ అయింది.

వీరిద్దరి రొమాంటిక్ కెమిస్ట్రీకి యూత్ బాగానే కనెక్ట్ అయినప్పటికీ, శాలిని వ్యక్తిగత ఆటతీరు మాత్రం మసకబారింది. కేవలం లవ్ ట్రాక్ పైనే ఫోకస్ పెట్టి, టాస్కులను పక్కన పెట్టేసిందనే విమర్శలు వచ్చాయి. సీక్రెట్ రూమ్ నుంచి వచ్చినా తన సొంత ఆటను మెరుగుపరుచుకోకపోవడం వల్లే ఈ వారం ఆమెకు ఓట్లు ఆశించిన స్థాయిలో పడలేదు.

వామ్మో.. రెమ్యునరేషన్!

ఆటతీరు ఎలా ఉన్నా కూడా దక్షి, శాలిని తీసుకున్న రెమ్యునరేషన్ లెక్కలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి. వైల్డ్ కార్డు ఎంట్రీగా వచ్చి కేవలం రెండు వారాలు మాత్రమే ఉన్న దక్షికి.. వారానికి రూ.2.5 లక్షల చొప్పున మొత్తం రూ.5 లక్షలు ముట్టినట్లు సమాచారం.

ఇక ఏడు వారాల పాటు హౌస్ లో సందడి చేసి, సీక్రెట్ రూమ్ అనుభూతి కూడా పొందిన శాలినికి వారానికి రూ.75 వేల చొప్పున అగ్రిమెంట్ కుదిరిందట. అంటే ఏడు వారాలకు గాను ఆమెకు రూ. 5.25 లక్షల రెమ్యునరేషన్ దక్కినట్లు బుల్లితెర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More