Bigg Boss 10 Telugu: నక్కతోక తొక్కిన వర్షిణి.. అమన్ నుంచి కెప్టెన్సీ పవర్.. షాకింగ్ ఓటింగ్.. తిరుగులేని త్రిగుణ్!
Bigg Boss 10 Telugu: ట్విస్టులతో సాగుతున్న బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో మరో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా వర్షిణి సౌందరరాజన్ బిగ్ బాస్ హౌస్ లో నాలుగో వారం కెప్టెన్ అయిందని తెలిసింది. ఆమె మ్యాజిక్ కీను వాడిందని సమాచారం. మరోవైపు ఓటింగ్ కూడా షాకింగ్ గా ఉందని అంటున్నారు.
Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ తెలుగు 10 సీజన్లో మరో భారీ ట్విస్ట్. ఈ సీజన్ కు అంతకుముందున్న సీజన్లలా కాకుండా డిఫరెంట్ గా ప్లాన్ చేశామని మేకర్స్ ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. ఎంత ఊహించినా కూడా దానికి మించి గేమ్ ఉంటుందనే పబ్లిసిటీ చేస్తున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ 10 తెలుగు షో చూస్తే అదే నిజమనిపిస్తోంది.

కెప్టెన్ వర్షిణి
బిగ్ బాస్ 10 తెలుగు నాలుగో సీజన్ కెప్టెన్ గా వర్షిణి బాధ్యతలు తీసుకుంది. అసలు కెప్టెన్సీ కంటెండర్ లాస్ట్ టాస్క్ లో అమన్ గెలిచాడు. నిజానికి అమన్ కెప్టెన్ కావాలి. ఆ టాస్క్ గెలిచిన తర్వాత అమన్ గట్టిగట్టిగా విజయనాదం కూడా చేశాడు. కానీ అప్పుడే బిగ్ బాస్ ఓ దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చాడు.
మ్యాజిక్ కీ
బిగ్ బాస్ 10 తెలుగు నాలుగో వారం కెప్టెన్సీ టాస్క్ కంప్లీట్ కాగానే హౌస్ లోకి బిగ్ బాస్ ఓ మ్యాజిక్ కీ పంపించాడు. అది వర్షిణికి చెందిన పవర్ కు సంబంధించిన మ్యాజిక్ కీ. ఆ కీతో వర్షిణి తన పవర్ ను అన్ లాక్ చేసింది. గెలిచిన వాళ్ల విక్టరీని దక్కించుకోవడమే ఆ పవర్. ఆ పవర్ ను వాడుకున్న వర్షిణి.. అమన్ విక్టరీని తీసుకొని ఇంటి కెప్టెన్ అయింది.
బిగ్ బాస్ ఓటింగ్
మరోవైపు బిగ్ బాస్ 10 తెలుగు అనషిఫియల్ ట్రెండ్స్ ప్రకారం ఓటింగ్ లోనూ భలే ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయని చెప్పొచ్చు. డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లు మారుతూనే ఉన్నారు. ఈ నాలుగో వారం నామినేషన్లలో మొత్తం తొమ్మిది మంది ఉన్నారు. త్రిగుణ్, రోహిత్, ముఖేష్, శాలిని, చరణ్, సృష్టి, నరేష్, దేబ్జానీ, అమన్ నామినేషన్లలో ఉన్నారు.
ఈ తొమ్మిది మంది కంటెస్టెంట్ల నుంచి ఈ వారం ఒకరు ఎలిమినేట్ కావాల్సిందే. ఫస్ట్ సృష్టి డేంజర్ జోన్లోకి వెళ్లింది. ఆ తర్వాత మారిన ఓటింగ్ ట్రెండ్ తో దేబ్జానీ ఎలిమినేషన్ కు దగ్గరైంది. ఇప్పుడేమో అమన్ లాస్ట్ పొజిషన్ కు పడిపోయాడు. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఉత్కంఠ రేపుతోంది.
టాప్ లో త్రిగుణ్
ఓటింగ్ లో టాప్ లో మాత్రం త్రిగుణ్ కు తిరుగులేదు. అతను మిగతా కంటెస్టెంట్లకు అందనంత ఎత్తులో నంబర్ వన్ గా కొనసాగుతున్నాడు. మిగతా కంటెస్టెంట్ల ఓటింగ్ శాతం కనీసం 15 కూడా దాటడం లేదు. కానీ త్రిగుణ్ ఓటింగ్ మాత్రం 50కి దగ్గరగా ఉండటం మామూలు విషయం కాదు. రోహిత్, అమన్, అపూర్వ కలిసి త్రిగుణ్ ను టార్గెట్ చేశారు. దీంతో త్రిగుణ్ కు ఓటింగ్ అమాంతం పెరిగిందని చెప్పొచ్చు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


