Bigg Boss 10 Telugu: నీది రాక్షసానందం-మాటలతో రెచ్చిపోయిన అపూర్వ-నవ్వుతూ త్రిగుణ్ కౌంటర్-ఓటింగ్ రివర్స్-హీరోయిన్ కు షాక్!
Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో కంటెస్టెంట్ల మధ్య ఫైట్ యమ టఫ్ గా సాగుతోంది. లేటెస్ట్ గా త్రిగుణ్ పై అపూర్వ ఫైర్ అయింది. రాక్షసానందం పొందుతున్నావంటూ రెచ్చిపోయింది. త్రిగుణ్ నవ్వుతూనే కౌంటర్ ఇచ్చాడు. మరోవైపు ఓటింగ్ రివర్స్ అయింది. సీరియల్ హీరోయిన్ డేంజర్లో పడింది.
Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ తెలుగు పదో సీజన్లో త్రిగుణ్ ఏదో ఒక విషయంలో ట్రెండింగ్ లోనే ఉంటున్నాడు. రోహిత్, అమన్, అపూర్వ కలిసి త్రిగుణ్ ను టార్గెట్ చేశారనే టాక్ వినిపిస్తోంది. ఇక లేటెస్ట్ గా త్రిగుణ్, అపూర్వ మధ్య గొడవ బిగ్ బాస్ హౌస్ ను షేక్ చేసిందనే కామెంట్లు వస్తున్నాయి.

త్రిగుణ్ వర్సెస్ అపూర్వ
బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ లో టాప్ కంటెస్టెంట్లలో హీరో త్రిగుణ్ ఒకరు. ఒక వైల్డ్ కార్డు ఎంట్రీగా వచ్చిన అపూర్వ హౌస్ లో అడుగుపెట్టినప్పటి నుంచి త్రిగుణ్ తో గొడవ పెట్టుకుంటూనే ఉంది. ఏదో ఒక విషయంలో వీళ్లిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా టాస్క్ లో భాగంగా మరోసారి త్రిగుణ్ వర్సెస్ అపూర్వ గొడవ జరిగింది.
రాక్షసానందం
ఇంట్లోనే లేడీస్ కంటెస్టెంట్లకు బిగ్ బాస్ ఓ టాస్క్ పెట్టాడు. సెయిల్ చేస్తూ కర్రలకు జెండాలు కట్టాలనేది టాస్క్. అయితే అందులో అపూర్వ పడిపోయింది. కాలు కింద పెట్టింది. దీంతో సంచాలకుడిగా ఉన్న త్రిగుణ్ ఆమెను డిస్ క్వాలిఫై చేశాడు. కాలు కింద పెట్టిందనే కారణంగా ఆట ఆడకుండా అడ్డుకున్నాడు.
త్రిగుణ్ తీసుకున్న నిర్ణయంతో అపూర్వ ఫైర్ అయింది. ఆటను ఆపమని చెప్పిన తర్వాతే కాలు కింద పెట్టానని, ఆటలో నుంచి ఎలా తీసేస్తావని త్రిగుణ్ ను ప్రశ్నించింది. కానీ త్రిగుణ్ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేడు. దీంతో పొటెన్షియల్ ఉన్న క్యాండిడేట్ ను తీసేస్తే వచ్చే పెయిన్ ఎలా ఉంటుందో చూసి రాక్షసానందం పొందుతున్నావని అపూర్వ రెచ్చిపోయింది. త్రిగుణ్ మాత్రం నవ్వుతూ తన నిర్ణయం ఫైనల్ అని కౌంటర్ ఇచ్చాడు.
బిగ్ బాస్ 10 నామినేషన్స్
బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ నాలుగో వారంలో నామినేషన్స్ లో మొత్తం 9 మంది కంటెస్టెంట్లున్నారు. త్రిగుణ్, రోహిత్, ముఖేష్, శాలిని, చరణ్, సృష్టి, నరేష్, అమన్, దేబ్జానీ నామినేషన్లలో ఉన్నారు. అయితే ప్రస్తుతం అనఫిషియల్ ఓటింగ్ ట్రెండ్ ప్రకారం అంతా రివర్స్ అయినట్లు కనిపిస్తోంది.
డేంజర్లో హీరోయిన్
నిన్నటివరకూ ఓటింగ్ ట్రెండ్స్ చూస్తే డేంజర్ జోన్లో సృష్టి ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. సీరియల్ హీరోయిన్ దేబ్జానీ లాస్ట్ ప్లేస్ కు పడిపోయింది. ఇప్పటివరకూ ఆమెకు 2.64 శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయేందుకు ఆమె డేంజర్ జోన్లో ఉంది. మరి వీకెండ్ ఎపిసోడ్లో ఎలిమినేషన్ ట్విస్ట్ ఏమైనా ఉంటుందేమో చూడాలి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


