Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10లో మళ్లీ మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఈ సారి ఆ కంటెస్టెంట్ ఔట్.. హౌస్ లో గ్రూప్ గేమ్!

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు ఆడియన్స్ కోసం మరో ట్విస్ట్ రెడీ అయిందని తెలిసింది. ఈ 10వ సీజన్ ఫస్ట్ వీక్ లోనే మిడ్ వీక్ ఎలిమినేషన్ తో మేకర్స్ షాకిచ్చారు. ఇప్పుడు ఏడో వారంలోనూ మరోసారి మిడ్ వీక్ ఎలిమినేషన్ కచ్చితంగా జరుగుతుందని టాక్. మరి ఈ సారి ఎవరు బయటకు వెళ్తారు? అనేది చూద్దాం. 

Published on: Oct 22, 2026, 12:48:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గానే సాగుతోంది. శాలిని సీక్రెట్ రూమ్ నుంచి రావడం, గోట్ (G.O.A.T) అవతారం అంటూ బిగ్ బాస్ హడావుడి చేయడం ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. అయితే ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందనే టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

బిగ్ బాస్ తెలుగు 10లో మళ్లీ మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఈ సారి ఆ కంటెస్టెంట్ ఔట్.. హౌస్ లో గ్రూప్ గేమ్! (youtube/starmaa)
బిగ్ బాస్ తెలుగు 10లో మళ్లీ మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఈ సారి ఆ కంటెస్టెంట్ ఔట్.. హౌస్ లో గ్రూప్ గేమ్! (youtube/starmaa)

బిగ్ బాస్ ఎలిమినేషన్

ఆటలో సవాలు కాదు ఆటే సవాలు అంటూ బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ స్టార్ట్ అయింది. అందుకు తగ్గట్లే ఫస్ట్ వీక్ లోనే మిడ్ వీక్ ఎలిమినేషన్ తో ఇద్దరు కంటెస్టెంట్లు బయటకు వెళ్లారు. మళ్లీ వాళ్లలో ఒకరు రీ ఎంట్రీ కూడా ఇచ్చారు. ఇప్పుడు బిగ్ బాస్ లో ఏడో వారంలోనూ మిడ్ వీక్ ఎలిమినేషన్ పక్కాగా ఉందని సమాచారం.

ఏడో వారం

ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ సగం అయిపోవడానికి వస్తోంది. ప్రస్తుతం సీజన్ లో ఏడో వారం సాగుతోంది. హౌస్ లోనేమో కంటెస్టెంట్లు ఫుల్ గా ఉన్నారు. వీళ్లలో నుంచి హౌస్ మేట్స్ ను తగ్గించాల్సిందే. అందుకే మేకర్స్ ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ తో ఒకరిని, డబుల్ ఎలిమినేషన్ తో మరొకరిని ఇంటికి పంపిస్తారని తెలిసింది.

డేంజర్లో వీళ్లిద్దరు

ప్రస్తుతం అనఫిషియల్ ఓటింగ్ ట్రెండ్ చూస్తే నీతు నటరాజ్, దక్షి డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్లకు ఓట్లు ఎక్కువగా పడటం లేదు. ఈ నేపథ్యంలో ఈ వారం హౌస్ లో నుంచి వీళ్లిద్దరూ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని టాక్. మిడ్ వీక్ లో ఒకరిని, వీకెండ్ ఎపిసోడ్లో మరొకరిని ఎలిమినేట్ చేస్తారని అంటున్నారు.

రోహిత్ వర్సెస్ త్రిగుణ్

బిగ్ బాస్ హౌస్ లోనే కాదు ఓటింగ్ లోనూ రోహిత్ వర్సెస్ త్రిగుణ్ వార్ సాగుతోంది. ఓటింగ్ లో టాప్ స్పాట్ కూడా వీళ్లిద్దరూ పోటీపడుతున్నారు. ప్రస్తుతానికి త్రిగుణ్ ను వెనక్కి నెట్టి రోహిత్ టాప్ ప్లేసుకు చేరుకున్నాడని తెలిసింది. ఆ తర్వాత అమన్, ఆర్కే, శ్వేతా నాయుడు, ఝాన్సీ, సుధీర్ వరుసగా ఉన్నారని సమాచారం.

గ్రూప్ గేమ్

మరోవైపు బిగ్ బాస్ 10 తెలుగు హౌస్ లో గ్రూప్ గేమ్ అనేది ఇప్పుడ డిస్కషన్ పాయింట్ గా మారింది. అమన్, రోహిత్, శాలిని కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నారనే ట్రోల్స్ వస్తున్నాయి. బరువులు మోసే టాస్క్ లో అమన్ కు ఫేవర్ చేయడం కోసం అతనితో డిస్కషన్ చేసి మరీ ఇతర కంటెస్టెంట్లకు రోహిత్, శాలిని బరువులు వేశారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More