Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10.. ఈ వారం మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. డబుల్ ఎలిమినేషన్ పక్కా.. ఆ ఇద్దరేనా?
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10 ఏడో వారం ఆటలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ చోటు చేసుకోబోతుందని టాక్. ఈ వారం పక్కాగా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అంటున్నారు. నామినేషన్లలో ఉన్న 12 మందిలో ఇద్దరు ఇంటికి వెళ్తారని సమాచారం. ఆ ఇద్దరు ఎవరో మరి చూసేయండి.
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ఏడో వారం నామినేషన్ ప్రక్రియ హోరీహోరీగా సాగింది. నామినేషన్ల ప్రక్రియలో ఇంటి సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదాలు నడిచాయి. ముఖ్యంగా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ నీతు, వర్షిణి.. త్రిగుణ్, సుధీర్.. ఝాన్సీ, ఆర్కే మధ్య జరిగిన మాటల ఫైట్ హౌస్‌లో సెగలు రేపింది. ఈ వారం ఏకంగా 12 మంది కంటెస్టెంట్లు నామినేషన్లలో నిలిచారు.

బిగ్ బాస్ నామినేషన్స్
బిగ్ బాస్ 10 తెలుగు ఏడో వారం నామినేషన్లలో ఏకంగా 12 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. రోహిత్, త్రిగుణ్, ఆర్కే, అమన్, ఝాన్సీ, వర్షిణి, సుధీర్, వంశీ, శివ కుమార్, దక్షి, శ్వేత, నీతు నామినేషన్లలో ఉన్నారు. వీళ్లలో ఇద్దరు హౌస్ నుంచి ఎలిమినేట్ కాబోతున్నారని సమాచారం.
పక్కాగా డబుల్ ఎలిమినేషన్?
బిగ్ బాస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ ఏడో వారం ఆటలో ఒకేసారి ఇద్దరిని ఇంటి నుంచి పంపించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. 'డబుల్ ఎలిమినేషన్' ట్విస్ట్‌తో హౌస్‌మేట్స్‌కు గట్టి షాక్ ఇవ్వాలని బిగ్ బాస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 12 మంది నామినేషన్లలో ఉన్నందున, ఓటింగ్ పరంగా వెనుకబడిన ఇద్దరు కంటెస్టెంట్లు ఒకే వారం ఎలిమినేట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
డేంజర్ జోన్లో నీతు, దక్షి!
ప్రస్తుతం నడుస్తున్న అన్అఫీషియల్ ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన నీతు, దక్షి ఇద్దరూ డేంజర్ జోన్లో ఉన్నట్లు గట్టిగా ప్రచారం సాగుతోంది. నీతు హౌస్‌లోకి వచ్చినప్పటి నుంచి చేస్తున్న ఎమోషనల్ డ్రామా, టాస్కుల్లో ప్రదర్శనపై ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదని టాక్. అటు దక్షి కూడా తక్కువ ఓట్లతో బాటమ్ ప్లేస్‌లో కొనసాగుతున్నట్లు సమాచారం.
ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి నీతు వెళ్లిపోవడం ఖాయమని తెలిసింది. గత వీకెండ్ లోనే నాగార్జున ఆమెకు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. రోహిత్ ఆట గురించి వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన విషయాలను హౌస్ లో అతనికి నీతు చెప్పింది. దీంతో అప్పుడే ఎలిమినేట్ చేస్తారనిపించింది. కానీ కంటిన్యూ చేశారు.
ఆ ఇద్దరు వీకెండ్లో వెళ్ళిపోతారా?
హోస్ట్ నాగార్జున శని, ఆదివారాల ఎపిసోడ్లలో ఈ డబుల్ ఎలిమినేషన్ గురించిన అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ గనుక నిజమైతే.. నీతు, దక్షి ఇద్దరూ ఒకేసారి బిగ్ బాస్ హౌస్‌కు గుడ్ బై చెప్పక తప్పదనే టాక్ ఉంది. అయితే బిగ్ బాస్ హౌస్‌లో చివరి నిమిషంలో ట్విస్ట్‌లు లేదా ఎలిమినేషన్ మార్పులు జరిగే ఛాన్స్ కూడా లేకపోలేదు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


