Bigg Boss: బిగ్ బాస్ చరిత్రలోనే బిగ్గెస్ట్ షాక్-మహిళపై బూతు పురాణం-కంటెస్టెంట్‌కు రెడ్ కార్డ్-బర్త్‌డే రోజే ఎలిమినేట్!

Bigg Boss: బిగ్ బాస్ హౌస్ లో షాకింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. బిగ్ బాస్ చరిత్రలోనే బిగ్గెస్ట్ షాక్ ఇస్తూ ఓ కంటెస్టెంట్ ను రెడ్ కార్డుతో డైరెక్ట్ ఎలిమినేట్ చేశారు. ఓ మహిళా కంటెస్టెంట్ పట్ల అతను అత్యంత నీచంగా ప్రవర్తిస్తూ బూతులు మాట్లాడటమే ఇందుకు కారణం. పూర్తి వివరాలు ఇక్కడ చూసేయండి. 

Published on: Oct 12, 2026, 11:32:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Bigg Boss: టెలివిజన్ హిస్టరీలోనే మోస్ట్ పాపులర్ రియాలిటీ షోగా దూసుకుపోతున్న బిగ్ బాస్ కన్నడ సీజన్ 13 లో ఊహించని సంచలనం చోటుచేసుకుంది. హౌస్‌లో తోటి మహిళా కంటెస్టెంట్స్‌ను టార్గెట్ చేస్తూ బూతులు, అసభ్య పదజాలంతో రెచ్చిపోయిన ఒక మేల్ కంటెస్టెంట్‌పై బిగ్ బాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనికి ఏకంగా ‘రెడ్ కార్డ్’ చూపించి హౌస్ నుంచి పంపించేశారు.

బిగ్ బాస్ చరిత్రలోనే బిగ్గెస్ట్ షాక్-మహిళపై బూతు పురాణం-కంటెస్టెంట్‌కు రెడ్ కార్డ్-బర్త్‌డే రోజే ఎలిమినేట్! (jiohotstar)
బిగ్ బాస్ చరిత్రలోనే బిగ్గెస్ట్ షాక్-మహిళపై బూతు పురాణం-కంటెస్టెంట్‌కు రెడ్ కార్డ్-బర్త్‌డే రోజే ఎలిమినేట్! (jiohotstar)

రెచ్చిపోయిన మోడరన్ మహాకవి

బిగ్ బాస్ కన్నడ 13వ సీజన్‌లో కామన్ మేన్ కేటగిరీలో అడుగుపెట్టిన 'మోడరన్ మహాకవి' మంజునాథ్ (మంజ) మొదటి నుంచీ వివాదాస్పద కంటెస్టెంట్‌గానే మారాడు. అయితే, ఇటీవల జరిగిన టాస్క్‌ల సమయంలో అతను హద్దులు మీరుతూ ప్రవర్తించాడు.

ముఖ్యంగా మహిళా కంటెస్టెంట్ క్యారెక్టర్‌ను కించపరిచేలా తీవ్రమైన బూతులు, అసభ్య పదజాలం ఉపయోగించడంతో తోటి హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా తీవ్రంగా ఆగ్రహించారు.

ఏం జరిగిందంటే?

బిగ్ బాస్ 13 కన్నడ సీజన్ లో తోటి కంటెస్టెంట్లు అయిన యష్, సౌందర్యపై మంజ అసభ్యకరమైన మాటలతో రెచ్చిపోయాడు. ఈ ఎపిసోడ్ ప్రసారం చేసేటప్పుడు ఈ మాటలను బీప్ చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మంజపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. అతణ్ని ఎలిమినేట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేశారు.

కిచ్చా సుదీప్ సీరియస్ వార్నింగ్

ఈ బూతు పురాణంపై వీకెండ్ 'పంచాయితీ' ఎపిసోడ్‌లో హోస్ట్ కిచ్చా సుదీప్ గట్టిగానే క్లాస్ పీకారు. టీవీలో ఒక మహిళా కంటెస్టెంట్ క్యారెక్టర్‌ను పాడుచేసే హక్కు ఎవరిచ్చారంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికే పలుమార్లు బిగ్ బాస్ ఇచ్చిన హెచ్చరికలను మంజ లైట్ తీసుకోవడంపై హోస్ట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

కన్ఫెషన్ రూమ్‌లో కన్నీళ్లు

ఈ వివాదం ముదరడంతో మంజను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిపించిన బిగ్ బాస్, అతను హౌస్‌లో వాడిన అసభ్యకరమైన మాటల ఆడియో క్లిప్పింగ్స్‌ను వినిపించారు. ఆ మాటలు విన్న మంజ తీవ్ర ఎమోషనల్ అయ్యాడు. అదే సమయంలో అతని తల్లితో మాట్లాడించగా.. ఆమె కూడా అతని ప్రవర్తనను తప్పుపట్టడంతో మంజ కన్నీరుమున్నీరయ్యాడు.

బర్త్‌డే రోజే ఎలిమినేషన్

మంజ క్షమాపణలు కోరినప్పటికీ, బిగ్ బాస్ రూల్స్ ప్రకారం మహిళలపై అసభ్య పదజాలం వాడినందుకు తీవ్ర చర్యగా రెడ్ కార్డ్ ఎలిమినేషన్ ప్రకటించారు. అక్టోబర్ 11న అతని పుట్టినరోజు నాడే ఈ షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది.

ఐదు వారాల పాటు కంటెస్టెంట్‌గా కొనసాగిన మంజ.. కేవలం తన నోటి దురుసుతనం, ప్రవర్తన వల్లే ఇలా అర్థాంతరంగా షో నుండి బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఈ షాకింగ్ ఎపిసోడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More