Bigg Boss Telugu 10: రాబోతున్న వైల్డ్ కార్డు తుపాను.. బిగ్ బాస్ 10లోకి కొత్త కంటెస్టెంట్లు.. వీళ్లు కన్ఫామ్!
Bigg Boss Telugu 10: ఇప్పటికే గొడవలు, తిట్లతో బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో రచ్చ రచ్చ జరుగుతోంది. ఇప్పుడీ రచ్చను మరింత పెంచేందుకు, ఎంటర్ టైన్మెంట్ డోస్ డబుల్ చేసేందుకు వైల్డ్ కార్డు ఎంట్రీలు రాబోతున్నాయి. వైల్డ్ కార్డు 2.0 పేరుతో అయిదారుగురు సెలబ్రిటీలు హౌస్ లోకి రాబోతున్నారని టాక్.
Bigg Boss Telugu 10: బుల్లితెరపై క్రేజీ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రస్తుతం ఐదో వారం నామినేషన్ల ప్రక్రియతో ఎంతో రసవత్తరంగా సాగుతోంది. అయితే, హౌస్‌లోని సమీకరణాలను పూర్తిగా మార్చేసేందుకు మేకర్స్ సరికొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీలను రంగంలోకి దించుతున్నారు. తాజా సమాచారం ప్రకారం అయిదారుగురు సెలబ్రిటీలు వైల్డ్ కార్డుతో వస్తారని టాక్.

బిగ్ బాస్ 10 తెలుగు వైల్డ్ కార్డు
బిగ్ బాస్ రియాలిటీ షోలో వైల్డ్ కార్డు ఎంట్రీలు కామనే. ఆటలో జోష్ తగ్గిపోతుందని ఆడియన్స్ ఫీల్ అవుతున్న టైమ్ లో వైల్డ్ కార్డులను మేకర్స్ రంగంలోకి దించుతారు. అయితే బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీలు రెండు సార్లు జరుగుతున్నాయి. ఇప్పటికే వైల్డ్ కార్డు ద్వారా అపూర్వ, మిథిలేష్ హౌస్ లోకి వచ్చారు. మిథిలేష్ ఏమో రూ.15 లక్షలు తీసుకొని వెళ్లిపోయాడు.
వీళ్లు కన్ఫామ్
బిగ్ బాస్ తెలుగు 10లో వైల్డ్ కార్డు 2.0లో భాగంగా అయిదారుగురు సెలబ్రిటీలు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారని టాక్. వీళ్లలో సీరియల్ హీరో శివ్ కుమార్, నవరసాలు ఆర్కే, నీతు నటరాజ్ మాస్టర్ పేర్లు కన్ఫామ్ అయ్యాయని తెలిసింది.
• శివ్ కుమార్: ప్రముఖ సీరియల్ నటుడు, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ లవర్ అయిన శివ్ కుమార్‌కు బుల్లితెరపై మంచి క్రేజ్ ఉంది. ఈ బిగ్ బాస్ సీజన్ ప్రారంభం నుంచి ప్రాబబుల్స్ లిస్ట్‌లో ఉన్న శివ్ కుమార్ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్‌లోకి రావడం కన్ఫామ్ అని తెలుస్తోంది. ఇప్పటికే అతను నిన్ను కోరి సీరియల్ నుంచి తప్పుకున్నాడు.
• రామకృష్ణ (నవరసాల రామకృష్ణ): ప్రీ-షో 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' ద్వారా పాపులర్ అయిన రామకృష్ణ, ఈ మిడ్-వీక్‌లో వైల్డ్ కార్డ్ రూపంలో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి రచ్చ లేపడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఒకసారి అతను మిథిలేష్, అపూర్వతో కలిసి హౌస్ లోకి వచ్చాడు. కానీ మిథిలేష్ తో టాస్క్ లో ఓడిపోయి వెళ్లిపోయాడు.
• నీతు నటరాజ్: ప్రొఫెషనల్ డాన్సర్, కొరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్ భార్య అయిన నీతు నటరాజ్ కూడా మిడ్-వీక్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నారు.
వీళ్లు వెయిటింగ్
ఇంకా ఈ సారి బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలుగా కావ్యశ్రీ, సీరత్ కపూర్, జబర్దస్త్ నూకరాజు, రాకింగ్ రాకేష్ లాంటి సెలబ్రిటీలు కూడా వస్తారని టాక్ వినిపిస్తోంది. వీళ్లలో నుంచి కావ్యశ్రీ ఎంట్రీ అయితే ఖాయమని అంటున్నారు. చెఫ్ మంత్ర కుకింగ్ షో నుంచి కావ్యశ్రీ మధ్యలోనే తప్పుకోవడమే ఇందుకు కారణం. మరి ఏ సెలబ్రిటీలో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తారో వేచి చూడాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


