Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ 10లో బిగ్ ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్.. శాలిని కోసం సీక్రెట్ రూమ్.. ఏడ్చిన రోహిత్!

Bigg Boss 10 Telugu: ట్విస్టులతో సాగుతున్న బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ లో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని వార్తలు రాగా.. ఇప్పుడేమో నో ఎలిమినేషన్ అని తెలిసింది. శాలినిని సీక్రెట్ రూమ్ కు పంపించారని సమాచారం. రోహిత్ కు ఆమె ప్రపోజ్ చేసిందని అంటున్నారు.

Published on: Oct 18, 2026, 05:52:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రోజుకో మలుపు తిరుగుతూ బుల్లితెర ప్రేక్షకులకు అసలైన వినోదాన్ని పంచుతోంది. ఉత్కంఠభరితమైన టాస్కులు, కంటెస్టెంట్ల మధ్య గొడవలతో సాగుతున్న ఈ షోలో.. తాజాగా ఈ వారం ఊహించని మెగా ట్విస్ట్ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ 10లో బిగ్ ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్.. శాలిని కోసం సీక్రెట్ రూమ్.. ఏడ్చిన రోహిత్! (youtube/starmaa)
బిగ్ బాస్ 10లో బిగ్ ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్.. శాలిని కోసం సీక్రెట్ రూమ్.. ఏడ్చిన రోహిత్! (youtube/starmaa)

బిగ్ బాస్ 10లో నో ఎలిమినేషన్!

ఈ వారం బిగ్ బాస్ తెలుగు 10 హౌస్ నుంచి ఇద్దరు కంటెస్టెంట్లు బయటకు వెళ్ళిపోతారని, డబుల్ ఎలిమినేషన్ ఉండబోతోందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వచ్చాయి. కానీ, మేకర్స్ ప్రేక్షకులకు బిగ్ షాక్ ఇచ్చారని తెలిసింది. ఈ వారం నో ఎలిమినేషన్ అని సమాచారం. వైల్డ్ కార్డ్ ఎంట్రీల హడావుడి ముగిసిన తరుణంలో ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.

సీక్రెట్ రూమ్‌లోకి శాలిని

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో ఆరో వారం వీకెండ్ ఎపిసోడ్ లో హైడ్రామా సాగిందని టాక్. ఓటింగ్‌లో అత్యంత తక్కువ ఓట్లతో డేంజర్ జోన్‌లో నిలిచిన శాలిని ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున స్టేజ్ పై ప్రకటించారట. అంతటితో ఆగకుండా ఆమె జర్నీ వీడియోను కూడా ప్లే చేశారని టాక్.

అయితే శాలినిని యటకు పంపకుండా, బిగ్ బాస్ హౌస్ లోని అత్యంత రహస్యమైన సీక్రెట్ రూమ్ (Secret Room) లోకి పంపించినట్లు సమాచారం. రాబోయే ఒకటి రెండు రోజుల్లో ఆమె తిరిగి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. నామినేషన్ల ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత శాలిని ఎంట్రీ ఉంటుందని అంటున్నారు.

రోహిత్‌కు లవ్ ప్రపోజల్?

ఈ వారం వీకెండ్ ఎపిసోడ్‌లో మరో హైలైట్ సీన్ కూడా జరిగిందని సమాచారం. హౌస్ నుంచి ఎలిమినేట్ అయి వెళ్తున్న సమయంలో శాలిని.. కంటెస్టెంట్ రోహిత్ కు స్టేజ్ పైనే ఓపెన్ గా ప్రపోజ్ చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హౌస్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి వీరిద్దరి మధ్య నడుస్తున్న లవ్ ట్రాక్, బాండింగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

శాలిని ఎలిమినేట్ అని నాగార్జున ప్రకటించడంతో రోహిత్ ఏడ్చాడని తెలిసింది. ఇక శాలిని ఏవీలో మొత్తం రోహిత్ ఉన్నాడని సమాచారం. ఈ నేపథ్యంలో శాలిని సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లడంతో హౌస్‌లో రోహిత్ గేమ్ ప్లాన్ ఎలా మారబోతోంది? శాలిని రీ-ఎంట్రీ ఇచ్చాక హౌస్‌మేట్స్ రియాక్షన్ ఎలా ఉండనుంది? అనేది తెలియాలంటే రాబోయే ఎపిసోడ్స్ చూడాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More