Bigg Boss 10 Elimination: ఆ ఇద్దరు భామలకు షాక్.. బిగ్ బాస్ 10 నుంచి ఇవాళ ఒకరు ఎలిమినేట్.. సండే టాప్ కంటెస్టెంట్ అవుట్!

Bigg Boss 10 Elimination: బిగ్ బాస్ ఆడియన్స్ కోసం మరో బిగ్ ట్విస్ట్ వెయిట్ చేస్తోంది. ఫస్ట్ నుంచి ట్విస్టులతో సాగుతున్న బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో ఈ వారం డబుల్ ట్విస్ట్ ఉండబోతుందని టాక్. హౌస్ నుంచి ఇద్దరు భామలు ఎలిమినేట్ అవుతారని సమాచారం. ఆ ఇద్దరు ఎవరో చూసేయండి. 

Published on: Oct 24, 2026, 13:45:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Bigg Boss 10 Elimination: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రతి వారం సరికొత్త ట్విస్టులతో ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ఈ వారం మాత్రం ఊహించని విధంగా ఇద్దరు లేడీ కంటెస్టెంట్స్ ఒకేసారి హౌస్ వీడనున్నారనే వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. గ్లామర్ బ్యూటీస్ వర్షిణి సౌందరరాజన్, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ దక్షి గుత్తికొండ ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నట్లు బలమైన టాక్ వినిపిస్తోంది.

ఆ ఇద్దరు భామలకు షాక్.. బిగ్ బాస్ 10 నుంచి ఇవాళ ఒకరు ఎలిమినేట్.. సండే టాప్ కంటెస్టెంట్ అవుట్! (youtube/starmaa)
ఆ ఇద్దరు భామలకు షాక్.. బిగ్ బాస్ 10 నుంచి ఇవాళ ఒకరు ఎలిమినేట్.. సండే టాప్ కంటెస్టెంట్ అవుట్! (youtube/starmaa)

వర్షిణికి తిప్పలు తప్పవా?

బిగ్ బాస్ 10 తెలుగు హౌస్‌లో ఈ వారం వర్షిణికి చాలా గడ్డు కాలం నడుస్తోంది. గత కొన్ని రోజులుగా ఆమె ఆటతీరు ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోతోంది. టాస్కుల్లో పెద్దగా ప్రభావం చూపించకపోవడంతో పాటు, హౌస్‌లో ఆమె ప్రవర్తన కూడా కాస్త వివాదాస్పదంగా మారింది. దీంతో ప్రేక్షకుల నుంచి ఆమెపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఓటింగ్ లో లీస్ట్

బిగ్ బాస్ తెలుగు 10వ హౌస్ లోకి టాప్ కంటెస్టెంట్లలో ఒకరిగా వర్షిణి అడుగుపెట్టింది. ఆమె రెమ్యునరేషన్ కూడా ఎక్కువే. కానీ టాస్క్ ల్లో, హౌస్ లో ఆమె ఇంపాక్ట్ చూపించలేకపోయింది. ఏంతసేపు ముఖేష్ తోనే టైమ్ స్పెండ్ చేసిందనే ట్రోల్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం వర్షిణి ఓటింగ్ పడిపోయింది. ఆమె లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్ లో నిలవడంతో ఎలిమినేషన్ తప్పదని తెలిసింది.

ఇవాళే దక్షి ఎలిమినేషన్?

ఈ వారం డబుల్ ఎలిమినేషన్ గ్యారెంటీ అని ప్రచారం జరుగుతున్న తరుణంలో.. మరో షాకింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. శనివారం (అక్టోబర్ 24) ప్రసారమయ్యే ఎపిసోడ్‌లోనే దక్షి గుత్తికొండ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోతుందని సోషల్ మీడియాలో లీకులు చక్కర్లు కొడుతున్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన దక్షి పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోవడంతో ఓటింగ్‌లో వెనుకబడింది. ఫలితంగా హోస్ట్ నాగార్జున సమక్షంలో ఇవాళే ఆమె ఎలిమినేషన్ జరగనుందని తెలుస్తోంది.

మేకర్స్ ప్లాన్ ఏంటి?

బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి వర్షిణి తన గ్లామర్‌తో, పాపులారిటీతో షోకు మంచి హైప్ తెచ్చిపెట్టింది. కానీ బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలో కేవలం గ్లామర్ మాత్రమే సరిపోదు, ఆట కూడా ముఖ్యం. ఒక స్థాయి దాటిన తర్వాత కంటెస్టెంట్ల పర్ఫార్మెన్స్‌ను ప్రేక్షకులు కచ్చితంగా జడ్జ్ చేస్తారు. వర్షిణి విషయంలోనూ అదే జరిగింది.

ప్రస్తుత పరిస్థితుల ప్రకారం వర్షిణి, దక్షి ఇద్దరూ దాదాపు అవుట్ అయినట్లే. అయితే, చివరి నిమిషంలో బిగ్ బాస్ మేకర్స్ ఏదైనా కొత్త ట్విస్ట్ ప్లాన్ చేసి, ఒకరిని సేవ్ చేసి మరొకరిని బయటకు పంపితే తప్ప వర్షిణి ఎలిమినేషన్ ఆపడం కష్టం. ఒకవేళ ఈ వారం త్రుటిలో తప్పించుకుంటే, ఆమె ఈ షోలో ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి!

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More