...
...
Next Story

Bigg Boss 10: బిగ్ బాస్ 10 తెలుగు లవర్స్ గెట్ రెడీ.. మారిన షో టైమింగ్స్.. ఇక టీఆర్పీ రేటింగ్స్ బద్దలే.. చీఫ్ గెస్ట్?

Bigg Boss 10: బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ బ్రాండ్ న్యూ సీజన్ కు టైమ్ ఆసన్నమైంది. బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ ఇవాళ స్టార్ట్ కానుంది. ఈ సారి షో టైమింగ్స్ మారాయి. ఇక టీఆర్పీ రేటింగ్స్ బద్దలే అనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఇవాళ గ్రాండ్ లాంఛ్ కు చీఫ్ గెస్ట్ గా రాబోతున్న హీరోపై సస్పెన్స్ నెలకొంది.

Published on: Sep 6, 2026, 15:37:04 IST
Advertisement

Bigg Boss 10: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఊపేసే అతిపెద్ద రియాలిటీ షో 'బిగ్ బాస్' పదో సీజన్ (Bigg Boss Telugu Season 10) ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ల్యాండ్‌మార్క్ 10వ సీజన్ కావడంతో 'దశావతారం' అనే ప్రత్యేక కాన్సెప్ట్‌తో నిర్వాహకులు ఈ షోను అత్యంత వైభవంగా తీర్చిదిద్దారు. సెప్టెంబర్ 6 ఆదివారం సాయంత్రం 7 గంటలకు స్టార్ మా ఛానల్‌తో పాటు జియోహాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

ముఖ్య అతిథిగా కోలీవుడ్ స్టార్ హీరో

బిగ్ బాస్ 10 తెలుగు లవర్స్ గెట్ రెడీ.. మారిన షో టైమింగ్స్.. ఇక టీఆర్పీ రేటింగ్స్ బద్దలే.. చీఫ్ గెస్ట్? (x/starmaa)
బిగ్ బాస్ 10 తెలుగు లవర్స్ గెట్ రెడీ.. మారిన షో టైమింగ్స్.. ఇక టీఆర్పీ రేటింగ్స్ బద్దలే.. చీఫ్ గెస్ట్? (x/starmaa)

బిగ్ బాస్ ప్రతి సీజన్ లాంఛింగ్ ఎపిసోడ్‌కు ఒక స్టార్ హీరో గెస్ట్‌గా రావడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ కోసం మేకర్స్ ఒక క్రేజీ గెస్ట్‌ను తీసుకొస్తున్నట్లు టాక్. 'ఊపిరి' సినిమాలో నాగార్జునతో కలిసి నటించిన తమిళ స్టార్ హీరో కార్తి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. తన రాబోయే చిత్రం 'సర్దార్ 2' ప్రమోషన్స్‌లో భాగంగా బిగ్ బాస్ వేదికపైకి కార్తి ఎంట్రీ ఇవ్వనుండటం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచనుంది.

టైమింగ్స్ ఛేంజ్

గత కొన్ని సీజన్లుగా బిగ్ బాస్ షో ప్రతిరోజూ రాత్రి 10 గంటలకు ప్రసారం కావడం వల్ల ఉద్యోగులు, ఫ్యామిలీ ఆడియన్స్ రాత్రి ఆలస్యమై కొంత ఇబ్బంది పడ్డారు. అయితే ఈ 10వ సీజన్ కోసం నిర్వాహకులు ప్రసార సమయాల్లో కీలక మార్పులు చేశారు. ఇకపై సోమవారం నుంచి శుక్రవారం వరకు వీక్ డేస్ ఎపిసోడ్లు రాత్రి 9:30 గంటల ప్రైమ్ టైమ్‌లోనే ప్రసారం కానున్నాయి.

వీకెంట్ ఇలా

ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి మొత్తం 16 మంది కంటెస్టెంట్లు అడుగుపెట్టబోతున్నారు. ప్రత్యేకంగా నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’ ద్వారా ఎంపికైన ఆరుగురు కామనర్లతో పాటు 10 మంది సెలబ్రిటీ కంటెస్టెంట్లు ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. కంటెస్టెంట్ల జాబితాలో జబర్దస్త్ రామ్ ప్రసాద్, పొట్టి నరేష్, నూకరాజు, రాకింగ్ రాకేష్, పల్లవి గౌడ, ముఖేష్ గౌడ, తేజస్విని గౌడ, యాంకర్ వర్షిణి, నటుడు కృష్ణుడు, సింగర్ ఝాన్సీ తదితర ప్రముఖుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.

వినూత్నమైన కాన్సెప్ట్, కొత్త టైమింగ్స్, సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్‌తో వస్తున్న ఈ సీజన్ బుల్లితెరపై సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks