Bigg Boss Telugu 10: ఇవి బిగ్ బాస్ నామినేషన్సా లేదా సీరియలా? రెండు రోజులు ఏంటి భయ్యా.. షోపై నెటిజన్లు ఫైర్!

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ పై నెటిజన్లు చిరాకు పడుతున్నారు. ఆడియన్స్ కూడా ఇదే ఫీల్ అవుతున్నారు. అందుకు కారణంగా బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ ప్రక్రియను సాగదీయడమే. ఏకంగా రెండు రోజుల పాటు నామినేషన్లే సాగితే.. ఇక టాస్క్ లు ఎప్పుడు పెడతారని నెటిజన్లు అడుగుతున్నారు. 

Published on: Oct 13, 2026, 11:39:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ వైల్డ్ కార్డు ఎంట్రీలతో రసవత్తరంగా మారుతుందనుకుంటే మళ్లీ బోర్ కొట్టిస్తోంది. ముఖ్యంగా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఆడియన్స్ చూసే నామినేషన్ ప్రక్రియను అయితే చిరాకు తెప్పించేలా మార్చేశారనే విమర్శలు వస్తున్నాయి. ఈ నామినేషన్లను ఎందుకు సాగదీస్తున్నారనే ట్రోల్స్ వస్తున్నాయి.

ఇవి బిగ్ బాస్ నామినేషన్సా లేదా సీరియలా? రెండు రోజులు ఏంటి భయ్యా.. షోపై నెటిజన్లు ఫైర్! (youtube/starmaa)
ఇవి బిగ్ బాస్ నామినేషన్సా లేదా సీరియలా? రెండు రోజులు ఏంటి భయ్యా.. షోపై నెటిజన్లు ఫైర్! (youtube/starmaa)

బిగ్ బాస్ నామినేషన్స్

బిగ్ బాస్ హౌస్ లో ప్రతి మండే నామినేషన్స్ అనేది ఎప్పుడూ ఉండే ప్రక్రియనే. కానీ గత వారం నుంచి ఈ నామినేషన్ ప్రాసెస్ అనేది ఏకంగా రెండు రోజుల పాటు సాగుతోంది. ఒక్కవారం అంటే సరే అని ఊరుకోవచ్చు కానీ వరుసగా రెండో వారం కూడా ఇలాగే జరుగుతుండటంతో నెటిజన్లు చిరాకు పడుతున్నారు.

గొడవలే గొడవలు

హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు కంటెస్టెంట్లను ఇతర కంటెస్టెంట్లు నామినేట్ చేసుకుంటారు. అయితే బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో మాత్రం ఈ నామినేషన్లలో ల్యాగ్ ఎక్కువగా కనిపిస్తోంది. ఎవరు ఎవరిని నామినేట్ చేస్తున్నారో, వాళ్ల మధ్య డిస్కషన్ ఉంటే ఈ విషయం ఇంత సుదీర్ఘంగా ఉండదు.

కానీ ఈ సీజన్ నామినేషన్స్ లో ఎవరు నామినేట్ చేస్తున్నారు? ఎవిరిని నామినేట్ చేస్తున్నారు? మధ్యలో ఎవరు, ఎందుకు వస్తున్నారన్నది హాట్ టాపిక్ గా మారింది. దీంతో నామినేషన్స్ లో గొడవలే గొడవలు జరుగుతున్నాయి.

నామినేషన్స్ లో రచ్చ

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ఆరో వారం నామినేషన్స్ లోనూ రచ్చ కొనసాగుతోంది. వైల్డ్ కార్డు కంటెస్టెంట్లు అప్పటికే ఉన్న ఓజీ కంటెస్టెంట్లు ఇద్దరకీ టాస్క్ పెడుతున్నారు. ఇందులో గెలిచిన వాళ్లకు ఇద్దరిని నామినేట్ చేసే ఛాన్స్ ఇస్తున్నారు. అయితే ఆ కంటెస్టెంట్లు డిఫెండ్ చేసుకున్న దాన్ని బట్టి ఒకరినే నామినేట్ చేస్తున్నారు.

అయితే ఈ నామినేషన్స్ లో అమన్, త్రిగుణ్, రోహిత్, శాలిని రచ్చ రచ్చ చేస్తున్నారు. తమ నామినేష్ అయినా, కాకపోయినా మధ్యలో వచ్చి మాట్లాడుతున్నారు. మాటలు అనుకుంటున్నారు. 10 నిమిషాల్లో అయిపోయే ప్రాసెస్ ను గంట సాగేలా చేస్తున్నారు.

ఇలా అయితే కష్టమే

నామినేషన్ ప్రక్రియ ఇలాగే సాగితే చాలా కష్టమనే టాక్ వినిపిస్తోంది. ఆడియన్స్ కు ఈ సీజన్ పైనే ఇంట్రెస్ట్ తగ్గిపోయే ప్రమాదం ఉందనే కామెంట్లు వస్తున్నాయి. నామినేషన్స్ ను స్వీట్ అండ్ షార్ట్ గా కుదించేలా బిగ్ బాస్ నిర్ణయం తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మరి వచ్చే వారం దీనిపై బిగ్ బాస్ ఏమైనా నిర్ణయం తీసుకుంటాడేమో చూడాలి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More