Bigg Boss Telugu 10: Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు ఆడియన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్న శనివారం ప్రోమో లేటుగా వచ్చేసింది. వారం మొత్తం హౌస్ లో ఏం జరిగిందో చూసిన ఆడియన్స్.. వీకెండ్ రాగానే నాగార్జున రియాక్షన్ కోసం వెయిట్ చేస్తుంటారు. అందుకు తగ్గట్లుగానే నాగార్జున ఫుల్ ఫైర్ అయ్యారు.
ఏం ఆడుతున్నారు?

బిగ్ బాస్ లాంటి బిగ్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ దక్కడం మామూలు విషయం కాదు. కానీ అలాంటి ఛాన్స్ ను కృష్ణుడు, సృష్టి వేస్ట్ చేసుకుంటున్నట్లు అనిపిస్తోంది. అవును.. ఈ బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ సెకండ్ వీక్ లో వాళ్ల ఆట చూస్తే అలానే అనిపించింది. నాగార్జున కూడా అసలు ఏమైనా ఆడారా? అంటూ కృష్ణుడు, సృష్టిపై ఫైర్ అయ్యారు.
వీడియోతో సహా
కృష్ణుడు, సృష్టిపై నాగార్జునకు మామూలుగా కోపం రాలేదు. వీడియో చూపించి మరీ ఈ ఇద్దరి కంటెస్టెంట్లపై విరుచుకుపడ్డారు. హౌస్ లో కృష్ణుడు, సృష్టి ఖాళీగా ఉన్న వీడియోను నాగార్జున చూపించారు. దీంతో ఒక్కసారిగా కృష్ణుడు, సృష్టి ముఖాలు మాడిపోయాయి. నాగార్జున రాగానే ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన సృష్టికి చివరకు మామూలు షాక్ తగల్లేదు.
ప్రేక్షుకుల్లాగే
బిగ్ బాస్ హౌస్ లో కృష్ణుడు, సృష్టి ప్రేక్షకుల్లాగే చూస్తూ ఉన్నారని నాగార్జున మండిపడ్డారు. అందుకే వీళ్లిద్దరినీ సెపరేటుగా దూరం కూర్చోబెట్టారు. ఆడియన్స్ లాగే ఈ వీకెండ్ ఎపిసోడ్ చూడాలని ఆదేశించారు. తప్పు చేస్తే పనిష్మెంట్ ఉంటుందని మరోసారి నాగ్ హెచ్చరించారు.
తోలుబొమ్మలా
ఇక హౌస్ లో ఎవరు తోలుబొమ్మ, ఆ తోలుబొమ్మను ఆడించే మాస్టర్ ఎవరు? అనేది చెప్పాలని నాగార్జున కంటెస్టెంట్లకు చెప్తారు. ఇందులో ఎక్కువమంది మాస్టర్ అంటే త్రిగుణ్ అని చెప్పినట్లు కనిపిస్తోంది. ఇక తోలుబొమ్మగానేమో టెంపర్ వంశీకి ఎక్కువ మంది ఓటు వేశారని తెలిసింది.
ఎలిమినేషన్
{{/usCountry}}ఇక హౌస్ లో ఎవరు తోలుబొమ్మ, ఆ తోలుబొమ్మను ఆడించే మాస్టర్ ఎవరు? అనేది చెప్పాలని నాగార్జున కంటెస్టెంట్లకు చెప్తారు. ఇందులో ఎక్కువమంది మాస్టర్ అంటే త్రిగుణ్ అని చెప్పినట్లు కనిపిస్తోంది. ఇక తోలుబొమ్మగానేమో టెంపర్ వంశీకి ఎక్కువ మంది ఓటు వేశారని తెలిసింది.
ఎలిమినేషన్
{{/usCountry}}ఈ వారం బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో వీకెండ్ ఎలిమినేషన్ కు సమయం దగ్గరపడుతోంది. ఆదివారం ఒకరు హౌస్ నుంచి వెళ్లిపోవాల్సిందే. ఆ వెళ్లేది కృష్ణుడు అని తెలిసింది. ఈ వారం బిగ్ బాస్ నుంచి కృష్ణుడు ఎలిమినేట్ అవుతారని టాక్.
ఆట పరంగా, మాట పరంగా సైలెంట్ గా ఉన్న సీనియర్ నటుడు కృష్ణుడికి జనాలు పెద్దగా ఓట్లు వేయలేదని తెలిసింది. అందుకే ఓటింగ్ పరంగా చూసుకుంటే లాస్ట్ ప్లేసులో ఉన్న కృష్ణుడు హౌస్ నుంచి ఎలిమినేట్ అవడం ఖాయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి.