...
...
Next Story

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10-వర్షిణికి త్రిగుణ్ వెన్నుపోటు? కన్నీళ్లు పెట్టుకున్న బ్యూటీ.. నామినేషన్స్ లో వీళ్లు!

Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్ తెలుగు సీజన్ 10 ఎనిమిదో వారం నామినేషన్లు రసవత్తరంగా సాగాయి. ముఖ్యంగా బయట మంచి స్నేహితులైన త్రిగుణ్, వర్షిణి మధ్య జరిగిన నామినేషన్ ప్రక్రియ హౌస్‌లో తీవ్ర భావోద్వేగాలకు దారి తీసింది. తనను ఎందుకు నామినేట్ చేశాడో తెలుసుకుని వర్షిణి కన్నీరుమున్నీరైంది.

Published on: Oct 27, 2026, 12:43:42 IST
Advertisement

Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్ తెలుగు సీజన్ 10 ఎనిమిదో వారం నామినేషన్ల ప్రక్రియ వాడివేడిగా జరిగింది. ఈ నామినేషన్లలో కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. చిన్న చిన్న గొడవలు కాస్తా పెద్ద వాదనలకు దారి తీశాయి. ఈ నామినేషన్లతో హౌస్ లో ఎమోషనల్ వాతావరణం నెలకొంది.

వర్షిణిని నామినేట్ చేసిన త్రిగుణ్

బిగ్ బాస్ 10-వర్షిణికి త్రిగుణ్ వెన్నుపోటు? కన్నీళ్లు పెట్టుకున్న బ్యూటీ.. నామినేషన్స్ లో వీళ్లు! (youtube/starmaa)
బిగ్ బాస్ 10-వర్షిణికి త్రిగుణ్ వెన్నుపోటు? కన్నీళ్లు పెట్టుకున్న బ్యూటీ.. నామినేషన్స్ లో వీళ్లు! (youtube/starmaa)

బిగ్ బాస్ హౌస్‌లో ఎవరూ ఊహించని విధంగా వర్షిణిని త్రిగుణ్ నామినేట్ చేసి పెద్ద షాక్ ఇచ్చాడు. గత వారం జరిగిన గేమ్‌లో వర్షిణి తనను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయిందనే కారణాన్ని, ఆమె చేసిన పొరపాటును ఎత్తి చూపుతూ త్రిగుణ్ ఆమెను నామినేట్ చేశాడు. గత వారం గేమ్‌లో త్రిగుణ్ వ్యవహరించిన తీరుకు గాను బిగ్‌ బాస్ అతడికి బేడీలు వేసి శిక్ష విధించిన విషయం తెలిసిందే.

గేమ్ పై ఫోకస్

లాస్ట్ వీకెండ్ పరిణామాల తర్వాత గేమ్‌పై మరింత ఫోకస్ పెట్టిన త్రిగుణ్.. ఎవరినీ ఉపేక్షించకుండా, మొహమాటం లేకుండా తన పాయింట్లను కుండబద్దలు కొడుతున్నాడు. ఈ క్రమంలోనే ఏకంగా వర్షిణిని నామినేట్ చేశాడు. ఇది గేమ్ అంటూ తన ఉద్దేశాన్ని క్లియర్ గా చెప్పాడు.

ఏడ్చేసిన వర్షిణి

త్రిగుణ్ నామినేట్ చేయడాన్ని ఊహించని వర్షిణి ఒక్కసారిగా ఎమోషనల్ అయింది. దీన్ని ఆమె చాలా పర్సనల్‌గా తీసుకుంది. తోటి కంటెస్టెంట్ల ముందే కన్నీళ్లు పెట్టుకుని విలపించింది. వర్షిణి ఏడుపు చూసి హౌస్‌లో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. ఆమె ఏడుస్తుంటే చూడలేక త్రిగుణ్ తన తలను పక్కకు తిప్పుకున్నాడు. త్రిగుణ్ తనలో తనే బాధను దిగమింగుకోవడం ప్రేక్షకులను సైతం కదిలించింది.

బయట స్నేహితులు.. లోపల ప్రత్యర్థులు

బిగ్‌ బాస్ ఇంట్లో ఎవరి గేమ్ వారు ఆడాల్సిందేనని, రిలేషన్స్ వేరు గేమ్ వేరు అని వర్షిణి ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఎనిమిదో వారం నామినేషన్లలో ఉన్నది వీళ్లే

ఈ వారం నామినేషన్ల ప్రక్రియ అత్యంత ఉత్కంఠగా సాగింది. కంటెస్టెంట్లు డేంజర్ జోన్‌లోకి వచ్చారు. తాజా సమాచారం ప్రకారం ఎనిమిదో వారం నామినేట్ అయిన వారి జాబితాలో రోహిత్, రామకృష్ణ, వర్షిణి, ఝాన్సీ, రాంప్రసాద్, సుధీర్ ఉన్నారు. మరి వీళ్లలో ఓటింగ్ పరంగా ఎవరు వెనుకబడి ఈ వారం ఎలిమినేట్ అవుతారో వేచి చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks