Bigg Boss Promo: మారిపోయిన ఉప్మా, పెసరట్టు.. అదిరిపోయిన ప్రోమో.. నలుగురు స్టార్ హీరోలు.. 4 భాషల్లో ఒకే రోజు బిగ్ బాస్

Bigg Boss Promo: సౌత్ ఇండియాలోని నాలుగు ప్రధాన భాషల (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం) బిగ్ బాస్ హోస్ట్‌లు ఒకే వేదికపై ప్రత్యక్షమయ్యారు. అక్కినేని నాగార్జున, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, మోహన్‌లాల్‌లతో కూడిన ప్రత్యేక ప్రోమోను జియో హాట్‌స్టార్ విడుదల చేసింది.

Published on: Aug 31, 2026, 14:18:09 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bigg Boss Promo: ఇండియన్ టెలివిజన్ పై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్ బాస్'. ముఖ్యంగా సౌత్ ఇండియన్ భాషల్లో ఈ షోకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ బేస్ వేరే స్థాయిలో ఉంటుంది. ఇప్పుడీ బిగ్ బాస్ సరికొత్త సీజన్లు ప్రారంభం కాబోతున్నాయి. దీంతో అభిమానులకు జియోహాట్‌స్టార్ (JioHotstar) ఊహించని మెగా సర్ ప్రైజ్ ఇచ్చింది. సౌత్ ఇండియాకు చెందిన నలుగురు అగ్ర కథానాయకులు, నాలుగు భాషల బిగ్ బాస్ హోస్ట్‌లు ఒకే వేదికపై మెరిసి ప్రేక్షకులలో పూస్‌బంప్స్ తెప్పించారు.

Bigg Boss Promo: మారిపోయిన ఉప్మా, పెసరట్టు.. అదిరిపోయిన ప్రోమో.. నలుగురు స్టార్ హీరోలు.. 4 భాషల్లో ఒకే రోజు బిగ్ బాస్
Bigg Boss Promo: మారిపోయిన ఉప్మా, పెసరట్టు.. అదిరిపోయిన ప్రోమో.. నలుగురు స్టార్ హీరోలు.. 4 భాషల్లో ఒకే రోజు బిగ్ బాస్

సెప్టెంబర్ 6 నుంచి స్ట్రీమింగ్

తెలుగు బిగ్ బాస్ హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున, తమిళ బిగ్ బాస్ కొత్త సారథి విజయ్ సేతుపతి, కన్నడ హోస్ట్ కిచ్చా సుదీప్, మలయాళ హోస్ట్ మోహన్‌లాల్ అందరూ కలిసి ఒకే ప్రేమ్‌లో కనిపించిన గ్లింప్స్ ప్రస్తుతం నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. నాలుగు భాషల బిగ్ బాస్ కొత్త సీజన్లు వచ్చే సెప్టెంబర్ 6 నుంచి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి.

“నలుగురు సూపర్‌స్టార్లు.. నాలుగు ఇళ్లు”.. అదిరిన ప్రోమో

"నలుగురు సూపర్‌స్టార్లు.. నాలుగు ఇళ్లు.. ఒకే ఒక అద్భుత ఘట్టం" అనే పవర్‌ఫుల్ క్యాప్షన్‌తో జియో హాట్‌స్టార్ ఈ ప్రోమోను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం బిగ్ బాస్ ఎడిషన్ల కౌంట్‌డౌన్ ప్రారంభమైందని ప్రకటిస్తూ.. ఈ నాలుగు సీజన్లు వచ్చే సెప్టెంబర్ 6 నుంచి ఒకేసారి గ్రాండ్‌గా ప్రారంభం కానున్నాయని స్పష్టం చేసింది.

ఈ ప్రోమో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. ఒక్కసారిగా సౌత్ ఇండియాలోని నలుగురు బడా స్టార్లను ఒకే చోట చూసిన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈసారి డిజిటల్, బుల్లితెర వీక్షకులకు వినోదం బాక్స్ ఆఫీస్ రేంజ్‌లో అందుబాటులోకి రానుందని స్పష్టమవుతోంది.

మారిపోయిన ఉప్మా, పెసరట్టు

బిగ్ బాస్ నాలుగు భాష ప్రీమియర్ డేట్ అనౌన్స్ చేస్తూ తీసుకొచ్చిన ప్రోమో కూడా అదిరిపోయింది. ఈ నలుగురు హోస్ట్ లు ఒకే హోటల్లోని ఒక్కో గదిలో ఉంటూ బ్రేక్‌ఫాస్ట్ ఆర్డర్ చేస్తారు. కానీ వీళ్ల ఆర్డర్లు తారుమారవుతాయి. నాగార్జున పెసరట్టు మోహన్‌లాల్ కు, కిచ్చా సుదీప్ వడ సాంబార్ విజయ్ కి, మోహన్‌లాల్ పుట్టు సుదీప్ కు తారుమారవుతాయి. అయితే వాటిని టేస్ట్ చేసిన ఆ స్టార్లు ఇవి కూడా బాగానే ఉన్నాయంటారు. ఆ తర్వాత నలుగురూ తమ తమ భాషల బిగ్ బాస్ కొత్త సీజన్ల ప్రీమియర్ తేదీని అనౌన్స్ చేశారు.

కొత్త మార్పులు.. వినోదంలో నెక్స్ట్ లెవెల్

గత కొన్ని ఏళ్లుగా ఆయా భాషల్లో బిగ్ బాస్ షోలు రికార్డు స్థాయి టీఆర్పీలను, ఓటీటీ వ్యూస్‌ను సొంతం చేసుకుంటున్నాయి. ఇప్పుడీ కొత్త సీజన్ కోసం తెలుగులో నాగార్జున తన మార్క్ హోస్టింగ్, ఎనర్జీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు.

అటు తమిళంలో కమల్ హాసన్ స్థానంలో వర్సటైల్ నటుడు విజయ్ సేతుపతి కొత్త హోస్ట్‌గా బాధ్యతలు స్వీకరించడం తమిళ బిగ్ బాస్‌పై భారీ అంచనాలను పెంచేసింది. ఇక కన్నడ, మలయాళం విషయానికి వస్తే.. కిచ్చా సుదీప్, మోహన్‌లాల్ తమ తమ స్టైల్స్ తో సరికొత్త ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు సిద్ధమయ్యారు.

ప్రేక్షకులలో ఉత్కంఠ.. కంటెస్టెంట్లు ఎవరు?

నాలుగు భాషల ప్రోమోలను విడివిడిగా కాకుండా ఇలా ఒకే వేదికపై ప్లాన్ చేయడం జియోహాట్‌స్టార్ చేసిన మాస్టర్ స్ట్రోక్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 6న షో ప్రారంభం కానుండడంతో.. ఈసారి హౌస్‌లోకి అడుగుపెట్టబోయే సెలబ్రిటీలు ఎవరు? ఎలాంటి కొత్త రూల్స్ ఉండబోతున్నాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బిగ్ బాస్ ప్రేమికులందరూ ఇప్పటికే తమ క్యాలెండర్లలో సెప్టెంబర్ 6వ తేదీని మార్క్ చేసుకుని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More