Bigg Boss 10: బిగ్ బాస్ 10 తెలుగులోకి క్రేజీ సీరియల్ హీరోయిన్-వారానికి రూ.4 లక్షల రెమ్యూనరేషన్? ఆమె ఎంట్రీ వెనుక ప్లాన్!
Bigg Boss 10: బిగ్ బాస్ రియాలిటీ షో ఫ్యాన్స్ కు ఇది కిక్కిచ్చే న్యూస్. త్వరలో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లోకి ఓ క్రేజీ సీరియల్ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతుందని టాక్. ఆమె కోసం ఏకంగా వారానికి రూ.4 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారని సమాచారం.
Bigg Boss 10: తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10’ (Bigg Boss Telugu 10) ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 6, 2026 నుంచి కింగ్ నాగార్జున హోస్ట్‌గా ఈ ల్యాండ్‌మార్క్ సీజన్ గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్లపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

బిగ్ బాస్ లోకి సీరియల్ హీరోయిన్
బిగ్ బాస్ 10 సీజన్ లోకి ఓ సీరియల్ హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందనే టాక్ వైరల్ గా మారింది. ఆమె ఎవరో కాదు.. దేబ్జానీ మోదక్ (Debjani Modak). ‘ఎన్నెన్నో జన్మల బంధం’, ‘సత్యభామ’ సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన ఈ బెంగాలీ బ్యూటీ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టడం దాదాపు ఖరారైనట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
వారానికి రూ. 4 లక్షలు?
బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే సెలబ్రిటీల రెమ్యునరేషన్ ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది. ఈసారి సీజన్ 10 కోసం మేకర్స్ బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదని తెలుస్తోంది.
సీరియ్ హీరోయిన్ దేబ్జానీ మోదక్ క్రేజ్, గ్లామర్, సోషల్ మీడియా ఫాలోయింగ్‌ను దృష్టిలో ఉంచుకుని మేకర్స్ ఆమెకు వారానికి దాదాపు రూ.4 లక్షల వరకు పారితోషికం ఆఫర్ చేసినట్లు బలమైన టాక్ వినిపిస్తోంది. బుల్లితెర టాప్ స్టార్స్ రేంజ్‌లో ఈ అమౌంట్ ఉండటం విశేషం.
ఇదే ప్లాన్
సాధారణంగా బిగ్ బాస్ హౌస్‌లో సీరియల్ నటీమణులకు గృహిణులు, ఫ్యామిలీ ఆడియన్స్ నుండి విపరీతమైన సపోర్ట్ లభిస్తుంది. దేబ్జానీ ఎంట్రీ ద్వారా షోకు ప్రారంభం నుంచే మంచి రేటింగ్స్ రాబట్టవచ్చని మేకర్స్ భావిస్తున్నారని తెలిసింది.
భాష రాకపోయినా
దేబ్జానీ మోదక్ బెంగాలీ నటి అయినప్పటికీ, సౌత్ ఇండస్ట్రీలో ముఖ్యంగా టాలీవుడ్ బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రారంభంలో తెలుగు రాకపోయినా తన హావభావాలు, నటనతో ‘ఎన్నెన్నో జన్మల బంధం’, ‘సత్యభామ’ వంటి సూపర్ హిట్ సీరియల్స్ ద్వారా ప్రతి ఇంట్లో ఒక మెంబర్‌లా మారిపోయింది.
ఈమెకున్న సైలెంట్ ఫ్యాన్ బేస్ బిగ్ బాస్ ఓటింగ్‌లో కీలక పాత్ర పోషించనుంది. హౌస్‌లో ఇతర కంటెస్టెంట్లతో మైండ్ గేమ్స్ ఆడటంలో దేబ్జానీ ఎలా రాణిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
గ్రాండ్ లాంఛ్
సెప్టెంబర్ 6 బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ గ్రాండ్ లాంఛ్ కానుంది. ఇప్పటికే అగ్నిపరీక్షలో కామనర్ల పోటీ తుదిదశకు చేరుకుంది. ఈ బిగ్ బాస్ సరికొత్త సీజన్‌లో కింగ్ నాగార్జున తన మార్క్ హోస్టింగ్‌తో కంటెస్టెంట్లను ఎలా హ్యాండిల్ చేస్తారు, దేబ్జానీ లాంటి క్రేజీ సెలబ్రిటీల నుంచి ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ రాబడతారనేది చూడాలి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


