Biggest Flop Movie: ప్రపంచవ్యాప్తంగా సినిమా సరిహద్దులు చెరిగిపోతున్న తరుణంలో, భారీ నిర్మాణ విలువలతో గ్లోబల్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవాలని సౌదీ అరేబియా చేసిన ప్రయత్నం ఊహించని రీతిలో విఫలమైంది. 'డెజర్ట్ వారియర్' (Desert Warrior) చిత్రం బాక్సాఫీస్ చరిత్రలోనే అత్యంత భారీ నష్టాలను మూటగట్టుకున్న సినిమాగా రికార్డు సృష్టించింది.
డెజర్ట్ వారియర్ మూవీ విశేషాలు

ఇటీవల భారతీయ సినిమా రంగం 'వారణాసి', 'రామాయణ' వంటి భారీ బడ్జెట్ చిత్రాలతో ప్రపంచ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుంది. అటు చైనా 'నీ జా 2'తో బిలియన్ డాలర్ల మార్క్ అందుకుంది. ఈ పోటీలో నిలవాలని, తన సొంత చిత్ర పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని సౌదీ అరేబియా MBC గ్రూప్ ద్వారా 'డెజర్ట్ వారియర్' అనే చారిత్రక వార్ మూవీని నిర్మించింది.
7వ శతాబ్దపు అరేబియా నేపథ్యంలో సాగే ఈ కథ.. చక్రవర్తి కిస్రాకు వ్యతిరేకంగా యువరాణి హింద్ సాగించిన పోరాటం చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాకు దర్శకుడు రూపెర్ట్ వ్యాట్ (రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఫేమ్). ఇక మార్వెల్ కొత్త కెప్టెన్ అమెరికా ఆంథోనీ మాకీ, ఆస్కార్ విజేత బెన్ కింగ్స్లీ, ఐషా హార్ట్, షార్ల్టో కోప్లీ లాంటి స్టార్లు నటించారు.
భారీ బడ్జెట్.. బాక్సాఫీస్ నిల్
కొవిడ్ కారణంగా ఆలస్యం, భారీ సెట్లు, అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల జీతాలతో బడ్జెట్ ఏకంగా 150 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.1400 కోట్లు) చేరుకుంది. ఏప్రిల్ 2026లో అంతర్జాతీయంగా విడుదలైన ఈ సినిమా.. కనీస ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది.
ఈ చిత్రం తన మొత్తం బడ్జెట్లో కేవలం 0.4% మాత్రమే వసూలు చేయగలిగింది. అంటే ఏకంగా 99.6% పెట్టుబడి నష్టపోయింది. సినిమా చరిత్రలో ఏ ఫీచర్ ఫిల్మ్‌కు కూడా ఇంతటి భారీ నష్ట శాతం లేదు.
సినిమా ఎందుకు బోల్తా పడిందంటే?
{{/usCountry}}ఈ చిత్రం తన మొత్తం బడ్జెట్లో కేవలం 0.4% మాత్రమే వసూలు చేయగలిగింది. అంటే ఏకంగా 99.6% పెట్టుబడి నష్టపోయింది. సినిమా చరిత్రలో ఏ ఫీచర్ ఫిల్మ్‌కు కూడా ఇంతటి భారీ నష్ట శాతం లేదు.
సినిమా ఎందుకు బోల్తా పడిందంటే?
{{/usCountry}}'డెజర్ట్ వారియర్' ఇంత దారుణంగా విఫలం కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అమెరికా వంటి దేశాల్లో ఈ సినిమా గురించి కనీస ప్రచారం లేదు. ప్రధాన నటుడు ఆంథోనీ మాకీ కూడా ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.
ఇక సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత దాదాపు రెండున్నరేళ్లు పోస్ట్ ప్రొడక్షన్ లోనే ఉండటంతో, మొదట్లో ఉన్న బజ్ పూర్తిగా తగ్గిపోయింది.
విడుదల తర్వాత కూడా విమర్శకుల నుంచి సానుకూల స్పందన రాలేదు. రోటెన్ టొమాటోస్‌లో కేవలం 28% అప్రూవల్ రేటింగ్ మాత్రమే లభించింది.
సొంత దేశమైన సౌదీ అరేబియాలో కూడా ఈ సినిమా మొదటి వీకెండ్ లో 8వ స్థానానికి పరిమితమైందంటే ప్రేక్షకులు దీనిని ఎంతగా తిరస్కరించారో అర్థం చేసుకోవచ్చు.
భారీ బడ్జెట్, హాలీవుడ్ స్టార్స్ ఉన్నంత మాత్రాన సినిమా విజయం సాధించదని 'డెజర్ట్ వారియర్' మరోసారి నిరూపించింది. సరైన ప్లానింగ్, ప్రమోషన్ లేకపోతే రూ.1400 కోట్లు కూడా బూడిదలో పోసిన పన్నీరేనని ఈ చిత్రం ఒక గుణపాఠంగా మిగిలిపోయింది.