ఓటీటీలోకి విక్రమ్ వారసుడి తమిళ మూవీ.. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో సూపర్ హిట్ సినిమా.. 8.3 ఐఎండీబీ.. తెలుగులోనూ

తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ తన కెరీర్ నిర్మించుకునే దిశగా సాగుతున్నాడు. తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకోవాలనే లక్ష్యంతో వెళ్తున్నాడు. ధ్రువ్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ బైసన్ ఓటీటీలోకి రాబోతుంది. 

Published on: Nov 17, 2025, 09:57:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తమిళ వెర్సటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ తనయుడు ధ్రువ్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘బైసన్’. ఈ మూవీతో తన కష్టానికి తగ్గ ప్రతిఫలం రాబట్టుకున్నాడు ధ్రువ్. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ చిత్రం కోసం ధ్రువ్ చాలా చెమటోడ్చాడు. తండ్రి బాటలో సాగుతూ హిట్లు అందుకోవాలని చూస్తున్న ధ్రువ్ కు బైసన్ మూవీ మంచి జోష్ ఇచ్చింది.

ఓటీటీలోకి ధ్రువ్ సినిమా (x/Netflix_INSouth)
ఓటీటీలోకి ధ్రువ్ సినిమా (x/Netflix_INSouth)

బైసన్ ఓటీటీ

ధ్రువ్ విక్రమ్ హీరోగా నటించిన లేటెస్ట్ తమిళ సూపర్ హిట్ మూవీ బైసన్ ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో బైసన్ మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమా నవంబర్ 21 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని నెట్‌ఫ్లిక్స్ సోమవారం (నవంబర్ 17) అఫీషియల్ గా ప్రకటించింది.

తెలుగులోనూ

బైసన్ మూవీ మొదట తమిళంలో థియేటర్లలో రిలీజైంది. ఆ తర్వాత తెలుగులోనూ డబ్ చేసి విడుదల చేశారు. ఇప్పుడు ఓటీటీలో తమిళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ రెండు భాషలే కాకుండా కన్నడ, మలయాళం, హిందీలోనూ బైసన్ ఓటీటీలో అందుబాటులో ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ ఇవాళ అనౌన్స్ చేసింది. ఈ సినిమాకు ఐఎండీబీలో 8.3 రేటింగ్ ఉంది.

నెల తర్వాత ఓటీటీలోకి

బైసన్ మూవీ దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు నెల రోజుల తర్వాత ఓటీటీలోకి రానుంది. నవంబర్ 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా థ్రిల్లర్ కు మారి సెల్వరాజ్ డైరెక్టర్. స్టోరీ కూడా ఆయనదే. ఇందులో ధ్రువ్ విక్రమ్ సరసన అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించింది. దీన్ని అప్లాజ్ ఎంటర్ టైన్మెంట్, నీలమ్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.

బైసన్ కథ

తరతరాలుగా సామాజిక అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. అంటరానితనం, వివక్ష అనేది జాతిని పీడిస్తోంది. ఇలాంటి కథనే కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో తీసుకుని గొప్పగా ఆవిష్కరించాడు దర్శకుడు మారి సెల్వరాజ్. 1990లో జరిగే కథనే బైసన్. చిన్నప్పటి నుంచి వనతి కిట్టన్ (ధ్రువ్ విక్రమ్)కు కబడ్డీ అంటే ఇష్టం. ఇంట్లోవాళ్లను ఒప్పించి కోర్టులో అడుగుపెడతాడు. అక్కడి నుంచి సొంత జట్టు, ఊరి జట్టు.. ఇలా అతని ప్రయాణం సాగుతుంది.

కానీ అడుగడుగునా కిట్టన్ కు అడ్డంకులు, వివక్ష ఎదురవుతూనే ఉంటుంది. వీటన్నింటినీ దాటి ఆసియా క్రీడల్లో పోటీపడే భారత కబడ్డీ జట్టుకు ఎంపికవుతాడు. కానీ మ్యాచ్ ఆడే అవకాశం మాత్రం రాదు. టోర్నీలో ఇండియా, పాక్ మ్యాచ్ రద్దవుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? కిట్టన్ ఇండియా టీమ్ కు ఆడాడా? అన్నది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More