Bigg Boss Buzzz: బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ హోరాహోరీగా సాగుతోంది. అప్పుడే రెండు వారాలు అయిపోయాయి. హౌస్ నుంచి చైత్ర రాయ్, కృష్ణుడు వెళ్లిపోయారు. అయితే ఈ బజ్ అలాగే కంటిన్యూ చేస్తూ బిగ్ బాస్ బజ్ లో ఎలిమినేట్ అయిన హోస్ట్ లతో ఆడుకునేందుకు శివాజీ వచ్చేశాడు.
బిగ్ బాస్ బజ్

బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో బజ్ ఇంటర్వ్యూ నిర్వహించడం కామనే. అయితే గత సీజన్ నుంచి శివాజీ తన పవర్ ఫుల్ హోస్టింగ్ తో, ముక్కు సూటితనంతో బజ్ కే ఊపు తెచ్చాడు. ఈ సీజన్ కూడా అతనే హోస్ట్ చేస్తున్నాడు.
మహావతారం
బిగ్ బాస్ 10 సీజన్ దశావతారం కాన్సెప్ట్ తో సాగుతోంది. ఒక్కో సీజన్ ఒక్కో థీమ్ తో కంటెస్టెంట్లను బిగ్ బాస్ ఆడిస్తున్నాడు. అలాగే బజ్ కూడా మామూలుగా ఉండదని శివాజీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు. మహావతారం అంటూ పవర్ ఫుల్ డైలాగ్ తో బజ్ స్టార్ట్ చేశాడు. రెండో వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కృష్ణుడిని తన బజ్ ఇంటర్వ్యూలో ఓ ఆట ఆడుకున్నాడు శివాజీ.
వినాయక చవితి ముందు వచ్చి
బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ రెండో వారంలో ఎలిమినేట్ అయిన కృష్ణుడి బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ వైరల్ గా మారింది. అసలు హౌస్ లో యాక్టివ్ గా లేకపోయిన కృష్ణుడి తీరును శివాజీ ఎండగట్టాడు. కృష్ణుడిలా సైలెంట్ గా ఉంటూ కౌంటర్లు వేశాడు. అసలు ఏం మాట్లాడాలో తెలియడం లేదన్నాడు.
‘‘వినాయక చవితికి ముందు వచ్చాడు. నిమజ్జనం కూడా కాకముందే వెళ్లిపోతున్నాడు’’ అని కృష్ణుడి గురించి వెటకారంగా చెప్పాడు శివాజీ. ఆ తర్వాత ఫటాఫట్ డైరెక్ట్ ప్రశ్నలు అడిగాడు.
సుధీర్ లవ్ ట్రాక్
{{/usCountry}}‘‘వినాయక చవితికి ముందు వచ్చాడు. నిమజ్జనం కూడా కాకముందే వెళ్లిపోతున్నాడు’’ అని కృష్ణుడి గురించి వెటకారంగా చెప్పాడు శివాజీ. ఆ తర్వాత ఫటాఫట్ డైరెక్ట్ ప్రశ్నలు అడిగాడు.
సుధీర్ లవ్ ట్రాక్
{{/usCountry}}ఇక బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో మాత్రం శివాజీ అడిగిన ప్రశ్నలకు కృష్ణుడు బాగానే సమాధానాలు చెప్పాడు. ఈ క్రమంలోనే సుధీర్ రెడ్డి గురించి సంచలన విషయం వెల్లడించాడు. సుధీర్ ఈ బిగ్ బాస్ హౌస్ లో లవ్ ట్రాక్ నడపాలని చూస్తున్నాడని కృష్ణుడు అన్నాడు.
ఇప్పటికే హౌస్ లో సుధీర్, వర్షిణి చాలా క్లోజ్ గా ఉంటున్నారు. హౌస్ మేట్స్ కూడా వర్షిణి ఏం చెప్తే సుధీర్ అది చేస్తున్నాడని వీకెండ్ ఎపిసోడ్లో కూడా చెప్పారు. మరి కృష్ణుడు ఇండైరెక్ట్ గా సుధీర్, వర్షిణి లవ్ ట్రాక్ గురించే చెప్పాడనే టాక్ వినిపిస్తోంది.