Sivaji OTT: పనీపాట లేని సోమరిపోతులకే ఓటీటీ.. ఆ వెబ్ సిరీస్ థియేటర్లలో రిలీజై ఉంటే 100 కోట్లు వచ్చేవి: శివాజీ కామెంట్స్

Sivaji OTT: నటుడు శివాజీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఓటీటీ అనేది పనీపాట లేని సోమరిపోతుల కోసం అని అనడం గమనార్హం. అసలైన సినిమా అనుభవం థియేటర్లలోనే వస్తుందని ఎపిక్ మూవీ ప్రమోషన్లలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Sep 4, 2026, 19:48:04 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Sivaji OTT: టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ మరోసారి ఓ పెద్ద చర్చకే తెరలేపారు. తాజాగా ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించిన ఎపిక్ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఆయన చేసిన కామెంట్స్ ఓటీటీ అభిమానులను షాక్ కు గురి చేస్తున్నాయి. ఓటీటీ అనేది కేవలం పనీపాటా లేని సోమరిపోతులకే అని ఆయన అనడం గమనార్హం. ఓటీటీల్లో సినిమాలు చూసేవాళ్లను ఉద్దేశించి శివాజీ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Sivaji OTT: పనీపాట లేని సోమరిపోతులకే ఓటీటీ.. ఆ వెబ్ సిరీస్ థియేటర్లలో రిలీజై ఉంటే 100 కోట్లు వచ్చేవి: శివాజీ కామెంట్స్
Sivaji OTT: పనీపాట లేని సోమరిపోతులకే ఓటీటీ.. ఆ వెబ్ సిరీస్ థియేటర్లలో రిలీజై ఉంటే 100 కోట్లు వచ్చేవి: శివాజీ కామెంట్స్

ఓటీటీ చూసేవాళ్లంతా సోమరిపోతులేనా?

సమయం ఎక్కువ ఉండి, ఖాళీగా ఇంట్లో పడుకోవడానికి ఇష్టపడేవాళ్లే ఓటీటీ వేదికలపై ఆధారపడుతున్నారని శివాజీ వ్యాఖ్యానించారు. థియేటర్‌కు వచ్చి సినిమా చూసే అనుభూతి వేరని, దానికి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ఏమాత్రం సాటిరావని ఆయన స్పష్టం చేశారు.

ఇంట్లో కూర్చుని ఫోన్లలో, టీవీల్లో సినిమాలు చూడటం వల్ల నిజమైన సినిమా మ్యాజిక్ దెబ్బతింటోందని శివాజీ అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఓటీటీ లవర్స్ నుంచి గట్టి కౌంటర్లు వస్తున్నాయి.

థియేటర్‌లో వస్తే 100 కోట్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వచ్చేది

తన కంబ్యాక్ ప్రాజెక్ట్ '90s - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' (90's: A Middle Class Biopic) వెబ్ సిరీస్ గురించి కూడా శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సిరీస్‌ను నేరుగా ఓటీటీలో కాకుండా థియేటర్లలో రిలీజ్ చేసి ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈజీగా రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మిడిల్ క్లాస్ ఎమోషన్స్‌తో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ డిజిటల్ స్పేస్‌లో భారీ రెస్పాన్స్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే దీన్ని బిగ్ స్క్రీన్‌పై విడుదల చేయకపోవడం పెద్ద మిస్టేక్ అని, థియేట్రికల్ పొటెన్షియల్ ఉన్న కంటెంట్‌ను ఓటీటీకి పరిమితం చేశారనే భావనను ఆయన వ్యక్తపరిచారు.

నిజానికి ఇప్పుడా వెబ్ సిరీస్ కు కొనసాగింపుగానే ఈ ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ మూవీ వస్తోంది. ఆ సిరీస్ ను డైరెక్ట్ చేసిన ఆదిత్య హాసనే ఈ సినిమాను తెరకెక్కించారు. ఓటీటీలో నవ్వులు పూయించిన ఆ డైరెక్టర్.. థియేటర్లలో ఏం చేస్తాడో చూడాలి.

సోషల్ మీడియాలో మొదలైన పెద్ద చర్చ

శివాజీ కామెంట్స్‌పై సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య భిన్నమైన వాదనలు నడుస్తున్నాయి. థియేటర్ వాతావరణం సాటిలేనిదనే విషయంలో శివాజీ వ్యాఖ్యలతో కొందరు ఏకీభవిస్తుండగా, మెజారిటీ నెటిజన్లు మాత్రం ఆయన మాటలను తప్పుబడుతున్నారు.

మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలు, స్నాక్స్ రేట్లు, పార్కింగ్ ఛార్జీలు సామాన్యుడికి అందుబాటులో లేకపోవడం వల్లే ఫ్యామిలీస్ ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారని కామెంట్లు పెడుతున్నారు. వర్కింగ్ క్లాస్ ఆడియన్స్‌ను 'సోమరిపోతులు' అనడం సరికాదని, ఓటీటీ అనేది ఆధునిక కాలంలో సులభమైన ఎంటర్‌టైన్‌మెంట్ ఆప్షన్ అని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు.

ఆమధ్య హీరోయిన్ల బట్టల విషయంలోనూ పబ్లిగ్గా నోరు జారి పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొన్నారు శివాజీ. ఇప్పుడిక ఓటీటీల విషయంలోనూ అలాంటి ో చర్చకే తెరలేపారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More