Mirzapur the Movie trailer: హిందీ డిజిటల్ స్పేస్‌ను ఏలిన ఓటీటీ బాప్ 'మీర్జాపూర్' ఇప్పుడు బిగ్ స్క్రీన్‌పై రక్తం చిందించడానికి సిద్ధమైంది. అమెజన్ ప్రైమ్ వీడియోలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ క్రైమ్ ఫ్రాంచైజ్ 'మీర్జాపూర్: ద మూవీ' (Mirzapur: The Movie) ట్రైలర్ ఆగస్టు 11న గ్రాండ్‌గా రిలీజై సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు కాంబినేషన్‌లో వస్తున్న ఈ ట్రైలర్ ఆడియన్స్‌కు మైండ్ బ్లాకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తోంది.
ట్రైలర్ కట్.. రక్తం, రివెంజ్, మాస్ 'భౌకాల్'!

మీర్జాపూర్ ను ఓటీటీ వర్షన్‌లో చూసిన గ్యాంగ్‌స్టర్ వార్‌ను ఇప్పుడు వెండితెరపై నెక్స్ట్ లెవెల్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు డైరెక్టర్ గుర్మీత్ సింగ్. ట్రైలర్ స్టార్టింగ్ నుంచే మీర్జాపూర్ గద్దె కోసం కాలీన్ భయ్యా (పంకజ్ త్రిపాఠి), గుడ్డూ భయ్యా (అలీ ఫజల్) మధ్య జరిగే భయంకరమైన పవర్ స్ట్రగుల్ స్పష్టంగా కనిపిస్తోంది. తుపాకుల మోతలు, నరకడాలు, రక్తపాతం మధ్య పిచ్చెక్కించే యాక్షన్ సీన్లు ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి.
ఓటీటీ సీజన్ 1 నుంచి మొదలైన కథకు కొనసాగింపుగా ఉంటూనే.. ఎవరూ ఊహించని కొత్త పాయింట్‌తో ఈ సినిమాను డిజైన్ చేశారు. ముఖ్యంగా ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఏంటంటే మున్నా భయ్యాగా దివ్యేందు మళ్లీ స్క్రీన్‌పై దర్శనమివ్వడం. అతడి మార్క్ మేనరిజమ్స్, డెడ్లీ డైలాగ్స్ మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి.
పంకజ్ త్రిపాఠి ఎగ్జైట్‌మెంట్.. డబ్బింగ్ పిక్చర్ ఇదే
కాలీన్ భయ్యా క్యారెక్టర్‌లో జీవించిన పంకజ్ త్రిపాఠి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు. "నేను రీసెంట్‌గా డబ్బింగ్ వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని విజువల్స్ చూశాను. నాకే ఒళ్ళు గగుర్పొడిచింది. నేను ఈ సినిమాలో పార్ట్ కాబట్టి అలా అనిపించిందా అని మేకర్స్‌ను అడిగితే.. పది నెలలుగా ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్న వాళ్లు కూడా అదే జోష్‌తో ఉన్నారు" అని ఆయన కామెంట్ చేశారు.
కాలీన్ భయ్యా గాంభీర్యం, గుడ్డూ భయ్యా మాస్ యాక్షన్, మున్నా భయ్యా వైల్డ్ బిహేవియర్ కలసి వెండితెరపై విధ్వంసం సృష్టించబోతున్నాయని ట్రైలర్ విజువల్స్ స్పష్టం చేస్తున్నాయి. పునీత్ కృష్ణ రాసిన స్క్రీన్‌ప్లే, అల్ట్రా వయొలెంట్ సీన్స్ బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్‌ను డబుల్ చేయనున్నాయి.
కొత్త పాత్రల ఎంట్రీ
{{/usCountry}}కాలీన్ భయ్యా గాంభీర్యం, గుడ్డూ భయ్యా మాస్ యాక్షన్, మున్నా భయ్యా వైల్డ్ బిహేవియర్ కలసి వెండితెరపై విధ్వంసం సృష్టించబోతున్నాయని ట్రైలర్ విజువల్స్ స్పష్టం చేస్తున్నాయి. పునీత్ కృష్ణ రాసిన స్క్రీన్‌ప్లే, అల్ట్రా వయొలెంట్ సీన్స్ బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్‌ను డబుల్ చేయనున్నాయి.
కొత్త పాత్రల ఎంట్రీ
{{/usCountry}}ఈ మోస్ట్ అవైటెడ్ క్రైమ్ యాక్షన్ డ్రామాను ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రితీష్ సిధ్వానీ, ఫర్హాన్ అఖ్తర్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అమెజాన్ ఎమ్జీఎమ్ స్టూడియోస్ భాగస్వామ్యంతో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో రసికా దుగల్, శ్వేతా త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, హర్షితా గౌర్, శ్రియా పిల్గాంకర్, రాజేష్ తైలంగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వెబ్ సిరీస్ లో విక్రాంత్ మాస్సే నటించగా.. మూవీకి మాత్రం అభిషేక్ త్రిపాఠి వచ్చారు.
2018లో చిన్న ఓటీటీ సిరీస్‌గా ప్రారంభమై, ఇండియాలోనే బిగ్గెస్ట్ క్రైమ్ ఫ్రాంచైజ్‌గా ఎదిగిన మీర్జాపూర్ ఇప్పుడు పాన్-ఇండియా రేంజ్‌లో థియేటర్లలోకి వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 4న హిందీతో పాటు తెలుగులోనూ ఈ సినిమా బిగ్ స్క్రీన్స్ పై రచ్చ చేయడానికి సిద్ధంగా ఉంది.
ఓటీటీ టూ సిల్వర్ స్క్రీన్.. హిస్టరీ రీక్రియేట్ అవుతుందా?
2018లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎలాంటి హడావుడి లేకుండా వచ్చిన మీర్జాపూర్ సీజన్ 1, ఇండియాలోనే ఒక మైలురాయిగా నిలిచింది. ఓటీటీ హిస్టరీలోనే మోస్ట్ పాపులర్ క్రైమ్ డ్రామాగా నిలిచిన ఈ ఫ్రాంచైజ్, ఇప్పుడు థియేటర్ల బాట పట్టడం ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక కొత్త ప్రయోగానికి నాంది పలికింది.
థియేట్రికల్ వెర్షన్ కోసం విజువల్ గ్రాండ్‌నెస్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (బీజీఎం) ఇంకా పవర్‌ఫుల్‌గా ప్లాన్ చేశారు మేకర్స్. టీజర్‌తోనే ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేసిన టీమ్, ఇప్పుడు ట్రైలర్‌తో బాక్సాఫీస్ వద్ద 'భౌకాల్' ఖాయమని నిరూపిస్తోంది. సెప్టెంబర్ 4 కోసం ఇండియన్ వైడ్ మూవీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.