Bandar: మా సినిమా మహిళలకు వ్యతిరేకం కాదు.. లైంగిక వేధింపుల ఆరోపణలపై నిజాలను చూపించాం.. బందర్ ప్రొడ్యూసర్ సంచలన కామెంట్లు

Bandar: అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో బాబీ డియోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘బందర్’ సినిమాపై వివాదం రేకెత్తింది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత నిఖిల్ ద్వివేది లైంగిక ఆరోపణలు, మహిళా హక్కులపై చేసిన సంచలన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Published on: May 30, 2026, 15:10:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bandar: సెలబ్రిటీల ఇమేజ్, సమాజంలో వారిపై ఉండే అంచనాలు, వివాదాల్లంటి సున్నితమైన అంశాల చుట్టూ తిరిగే కథతో తెరకెక్కుతున్న సరికొత్త చిత్రం ‘బందర్’. బాలీవుడ్ సంచలన దర్శకుడు అనురాగ్ కశ్యప్ రూపొందిస్తున్న ఈ సినిమాలో స్టార్ హీరో బాబీ డియోల్ లీడ్ రోల్‌లో నటిస్తున్నాడు. ఈ మూవీ ప్రొడ్యూసర్ నిఖిల్ ద్వివేది తాజాగా సంచలన కామెంట్లు చేవాడు.

బాబీ డియోల్ మూవీ వివాదంపై నిర్మాత కీలక వ్యాఖ్యలు
బాబీ డియోల్ మూవీ వివాదంపై నిర్మాత కీలక వ్యాఖ్యలు

సస్పెన్స్ థ్రిల్లర్ గా

ఒక స్టార్ సెలబ్రిటీ తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణల్లో చిక్కుకున్న తర్వాత అతని జీవితం ఎలా అతలాకుతలమైందనే కథతో బందర్ రెడీ అయింది. డిజిటల్ యుగంలో ఇటువంటి కేసులపై సమాజం, చట్టం ఎలా స్పందిస్తాయనే కోణంలో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సాగుతుంది.

సినిమా ప్రమోషన్లలో భాగంగా టైమ్స్ నౌ ఛానల్‌లోని 'ది న్యూస్‌ అవర్ ఎట్ 9' టాక్ షోలో పాల్గొన్న ప్రొడ్యూసర్ నిఖిల్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

మహిళలకు వ్యతిరేకం కాదు

ఈ ఇంటర్వ్యూలో నిర్మాత నిఖిల్ ద్వివేది మాట్లాడుతూ, ఈ కథ తన హృదయానికి ఎంతో దగ్గరైందని భావోద్వేగానికి లోనయ్యాడు. అదే సమయంలో ఈ సినిమా మహిళలకు వ్యతిరేకంగా సాగుతుందనే అనుమానాలను పూర్తిగా కొట్టిపారేశాడు.

"కథను సిద్ధం చేసేటప్పుడు, ఆ తర్వాత షూటింగ్ సమయంలో ఈ ప్రాజెక్ట్‌తో ప్రయాణించిన వ్యక్తులు నాకు ఎంతో ఆప్తులయ్యారు" అని నిఖిల్ ద్వివేది చెప్పాడు.

ట్విషా కేసు

ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ నడుస్తున్న ట్విషా శర్మ కేసును ప్రస్తావిస్తూ.. "మా సినిమా ఏ రకంగానూ మహిళలకు వ్యతిరేకం కాదు. ట్విషా శర్మ విషయంలో ఏం జరుగుతుందో మేం కూడా గమనిస్తున్నాం. అది నిజంగా దురదృష్టకరం. ఆ కేసుపై సమగ్ర విచారణ జరగాలి. అక్కడ ఏదైనా నేరం జరిగి ఉంటే, తప్పు చేసిన వారికి ఖచ్చితంగా శిక్ష పడాలి’’ అని నిఖిల్ వివరించాడు.

ఆ పాత్రలో బాబీ డియోల్

ఇటీవలే విడుదలైన బందర్ సినిమా ట్రైలర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచేసింది. ఇందులో బాబీ డియోల్ 'సమీర్ మెహ్రా' అనే ఒకప్పటి స్టార్ రాక్‌స్టార్ పాత్రలో కనిపిస్తున్నాడు. డేటింగ్ యాప్స్‌లో కాలం గడుపుతూ, ఎమోషన్స్ లేని తాత్కాలిక బంధాల వైపు మొగ్గు చూపుతుంటాడు.

అయితే సమీర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో కథ ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. తాను నిర్దోషినని, ఎవరో తనను ఇరికించడానికే ఈ కుట్ర పన్నారని సమీర్ వాదించినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.

అనురాగ్ కశ్యప్ మార్క్

బాబీ డియోల్, అనురాగ్ కశ్యప్ కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ‘పాతాళ్ లోక్’, ‘కోహ్రా’, ‘ఉడ్తా పంజాబ్’ వంటి కల్ట్ హిట్ చిత్రాలకు అద్భుతమైన కథలను అందించిన సుదీప్ శర్మ, అభిషేక్ బెనర్జీల క్రేజీ రైటింగ్ టీమ్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే సమకూర్చారు.

ఈ సినిమాలో రాజ్ బి శెట్టి, సబా ఆజాద్, రిద్ధి సేన్, జితేంద్ర జోషి, ఇంద్రజిత్ సుకుమారన్, నాగేష్ భోంస్లే వంటి ప్రతిభావంతులైన నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాఫ్రాన్ మ్యాజిక్‌వర్క్స్ బ్యానర్‌పై నిర్మించిన ‘బందర్’ చిత్రాన్ని జూన్ 5, 2026న థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేయడానికి నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

1. ‘బందర్’ సినిమా ప్రధాన ఇతివృత్తం ఏమిటి?

దర్శకుడు అనురాగ్ కశ్యప్ తెరకెక్కిస్తున్న బందర్.. సెలబ్రిటీల లైఫ్ స్టైల్, తీవ్రమైన లైంగిక ఆరోపణల వల్ల వారి ఇమేజ్ ఎలా దెబ్బతింటుంది, డిజిటల్ కాలంలో న్యాయం, ప్రజా అభిప్రాయాలు ఎలా మారుతుంటాయనే అంశాల చుట్టూ తిరిగే ఒక సస్పెన్స్ డార్క్ థ్రిల్లర్.

2. ఈ సినిమాలో బాబీ డియోల్ ఏ పాత్రలో నటిస్తున్నాడు?

బాబీ డియోల్ ఇందులో 'సమీర్ మెహ్రా' అనే ఒకప్పటి పాపులర్ రాక్‌స్టార్ పాత్రను పోషిస్తున్నాడు. తన క్రేజ్ తగ్గుతున్న సమయంలో లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కుని జైలు పాలయ్యే ఒక సెలబ్రిటీగా ఆయన కనిపిస్తాడు.

3. ‘బందర్’ సినిమా ఎప్పుడు విడుదలవుతోంది?

సాఫ్రాన్ మ్యాజిక్‌వర్క్స్ నిర్మించిన ఈ క్రేజీ థ్రిల్లర్ సినిమా జూన్ 5, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More