OTT Telugu: మెగాస్టార్ మెచ్చిన క్యూట్ లవ్ స్టోరీ.. ఇవాళ ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా.. హీరోగా యాంకర్ రవి

OTT Telugu: ఇవాళ ఓటీటీలోకి ఓ తెలుగు సినిమా వచ్చేసింది. సండే స్పెషల్ గా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి మెచ్చిన క్యూట్ లవ్ స్టోరీ ఇది. పూర్తి వివరాల కోసం చూసేయండి.

Published on: May 17, 2026, 10:29:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Telugu: సండే స్పెషల్ గా ఇవాళ ఓటీటీలోకి ఓ అదిరిపోయే మూవీ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి మెచ్చిన సినిమా ఇది. అదే.. ‘వాణి నా రాణి’ సినిమా. యాంకర్ రవి హీరోగా నటించిన ఈ క్యూట్ లవ్ స్టోరీ ఈ రోజు (మే 17) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేసింది.

ఓటీటీలోకి తెలుగు మూవీ (x/etvwin)
ఓటీటీలోకి తెలుగు మూవీ (x/etvwin)

వాణి నా రాణి ఓటీటీ

పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో ప్రతి సండే ఓ కొత్త సినిమా స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈటీవీ విన్ కథాసుధలో భాగంగా ఆదివారం చిన్న సినిమా విడుదల అవుతుంది. ఈ క్రమంలోనే ఈ రోజు వాణి నా రాణి మూవీ ఓటీటీలో అడుగుపెట్టింది. ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

మెగాస్టార్ మెచ్చిన మూవీ

వాణి నా రాణి మూవీపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఈ మూవీకి ఫిదా అయ్యారు. క్యూట్ లవ్ స్టోరీ అంటూ సినిమాను మెచ్చుకున్నారు. ఈ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సూపర్ వైజర్, ప్రొడ్యూసర్ గా దిగ్గజ దర్శకుడు రాఘవేంద్ర రావు వ్యవహరించడం విశేషం. వాణి నా రాణి చిత్రానికి సాయి తేజ డైరెక్టర్. ఈ మూవీలో యాంకర్ రవి, భావన లాస్య, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు.

వాణి నా రాణి స్టోరీ

వాణి నా రాణి మూవీ ఓ క్యూట్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. ప్రేమ అనేది త్యాగాన్ని కోరుకుంటుందని ఈ సినిమాతో చెప్పారు. శంకర్ (రవి) ఓ పాపులర్ రైటర్. ఓ నవల రాస్తాడు. అది విపరీతంగా సేల్ అవుతుంది. కానీ ఆ నవలకు ఎండింగ్ మాత్రం ఉండదు. ఎందుకంటే ఆ నవల తన సొంత లవ్ స్టోరీనే.

శంకర్, గౌరి (భావన) ప్రేమించుకుంటారు. కానీ పెళ్లికి ముందు శంకర్ ను గౌరి వదిలి వెళ్తుంది. దీంతో శంకర్ డిప్రెషన్ లోకి వెళ్లిపోతాడు. కానీ అసలు నిజం తెలిసి షాక్ అవుతాడు.

అదే ట్విస్ట్

గౌరీని రామ్ మోహన్ పెళ్లి చేసుకుంటాడు. రామ్ మోహన్ ఓ డాక్టర్. అతను శంకర్ జీవితంలోకి వస్తాడు. అప్పుడే శంకర్ గుండె బద్దలయ్యే ఓ నిజం తెలుస్తుంది. గౌరి తనను ఎందుకు పెళ్లి చేసుకోలేదో అర్థమవుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? గౌరీని శంకర్ తిరిగి కలిశాడా? అన్నది వాణి నా రాణి మూవీలో చూడాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More