OTT Bold: ఓటీటీలోకి వచ్చేస్తున్న బోల్డ్ సిరీస్ సీజన్ 3.. ఈ సారి మరింత బోల్డ్ అంటూ పోస్టర్.. రెండు సీజన్లు సూపర్ హిట్
OTT Bold: ఓటీటీలో బోల్డ్ నెస్ ను మరో లెవల్ కు తీసుకెళ్లేందుకు, రొమాంటిక్ సీన్లతో అలరించేందుకు వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది. ఈ సారి మరింత బోల్డర్ అంటూ పోస్టర్ తోనే క్యూరియాసిటీ పెంచేస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూసేయండి.
OTT Bold: క్రేజీ స్టోరీ లైన్ తో, బోల్డ్ అండ్ రొమాంటిక్ సీన్లతో యూత్ ను ఎంటర్ టైన్ చేసే బోల్డ్ వెబ్ సిరీస్ మూడో సీజన్ రాబోతుంది. పాపులర్ వెబ్ సిరీస్ గా పేరు తెచ్చుకున్న ‘ష్’ నుంచి కొత్త సీజన్ త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్ అనౌన్స్ చేసింది.

ష్ సీజన్ 3
బోల్డ్ వెబ్ సిరీస్ ‘ష్’ నుంచి మూడో సీజన్ ఓటీటీలోకి రాబోతుంది. ఈ విషయాన్ని ఆహా తమిళ్ సోషల్ మీడియాలో అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ‘‘కొత్త కథలు, కొత్త క్యారెక్టర్లు. కలవడానికి సిద్ధమా? ష్ సీజన్ 3 త్వరలో రాబోతుంది. కేవలం ఆహా తమిళ్ లో మాత్రమే’’ అని ఆహా తమిళ్ పోస్టర్ పంచుకుంది. ఇందులో నాలుకతో టెంప్టింగ్ గా ఉన్న ఓ అమ్మాయి లిప్స్, మౌత్ చూపించారు.
రెండు సీజన్లు సూపర్ హిట్
బోల్డ్ వెబ్ సిరీస్ ‘ష్’ రెండు సీజన్లు సూపర్ హిట్ గా నిలిచాయి. తమిళంలో ఫస్ట్ రిలీజైన ఈ సీజన్లు ఆ తర్వాత ఆహా వీడియో ఓటీటీలో తెలుగులోనూ అందుబాటులోకి వచ్చాయి. ఈ సిరీస్ ఓ ఆంథాలజీ రొమాంటిక్ అండ్ బోల్డ్ నేపథ్యంలో సాగుతోంది. ఇందులో వేర్వేరు అమ్మాయిల ఫాంటసీలు, కలలు, రొమాంటిక్ లైఫ్ ను చూపించారు.
ఈ ఎపిసోడ్లు
ష్ వెబ్ సిరీస్ సీజన్ 1లో 4 ఎపిసోడ్లు ఉన్నాయి. సెక్స్ ఎడ్యుకేషన్, ఒక్కడు, మళ్లీ కలుద్దాం, రీలోడ్ అనే ఎపిసోడ్లు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేశాయి. ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కొక్కరి స్టోరీ చూపించారు. ఈ సీజన్ 1లో శ్రీరామ్, సోనియా అగర్వాల్, ఇనయా, ఐశ్వర్య దత్తా, క్రిష కురుప్, మైమ్ గోపీ తదితరులు నటించారు.
సీజన్ 2
సీజన్ 1తో పోలిస్తే మరింత బోల్డ్, రొమాంటిక్ గా సీజన్ 2ను తీసుకొచ్చారు. ఈ ష్ సీజన్ 2లో వెట్రి, ప్రేమ్ జీ, వేదిక, జినాల్ జోషి, ఐశ్వర్య దత్తా, ఆరోరా, మానుషి తదితరులు నటించారు. సీజన్ 2లో కూడా నాలుగు ఎపిసోడ్లున్నాయి. గిగోలో, దబిడి దిబిడి, లీక్డ్ వీడియో, తొలి స్వప్నం పేర్లతో ఈ ఎపిసోడ్లు తెలుగులోనూ అందుబాటులో ఉన్నాయి.
ఇప్పుడు బోల్డర్ అంటూ సీజన్ 3 రాబోతుందని మేకర్స్ ప్రకటించారు. మరి ఈ ఆంథాలజీ సిరీస్ లో ఈ సారి ఎలాంటి కథలు చూపించబోతున్నారో వేచి చూడాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


