Arjun Rampal: 8 ఏళ్లుగా సహజీవనంలో ఉంటూ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో, ధురంధర్ మూవీ విలన్ అర్జున్ రాంపాల్, తన లాంగ్‌టైమ్ గర్ల్‌ఫ్రెండ్ గాబ్రియెల్లా డెమెట్రియాడెస్ చివరకు పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఉత్తర గోవాలోని మపుసా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో వీరు శుక్రవారం (ఆగస్ట్ 21) సాయంత్రం చాలా సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.
గోవా యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రకారం పెళ్లి

53 ఏళ్ల అర్జున్ రాంపాల్, సౌత్ ఆఫ్రికన్ మోడల్ కమ్ డిజైనర్ గాబ్రియెల్లా (37) కొన్నాళ్లుగా పనజీ సమీపంలోని సుకోరో గ్రామంలో నివాసముంటున్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో చాలా సాధారణ దుస్తుల్లో, అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీరు మపుసా రిజిస్ట్రార్ ఆఫీస్‌కు చేరుకున్నారు.
గోవా రాష్ట్రంలో అమలులో ఉన్న యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC) చట్టం నిబంధనల ప్రకారం వీరు పెళ్లి చేసుకున్నట్లు సబ్ రిజిస్ట్రార్ సూరజ్ వెర్నేకర్ అధికారికంగా తెలిపారు. సాధారణంగా మొదటి సంతకం, రెండో సంతకం మధ్య 15 రోజుల సమయం ఉండాలి. కానీ వీరు లోకల్ కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి ప్రత్యేక మినహాయింపు అనుమతి తీసుకుని మొత్తం ప్రక్రియ ఒకేసారి పూర్తి చేశారు. రాబోయే 15 రోజుల్లో వీరికి అఫీషియల్ మ్యారేజ్ సర్టిఫికేట్ అందనుంది.
8 ఏళ్ల డేటింగ్.. ఇద్దరు పిల్లలు
2018 నుంచి అర్జున్ రాంపాల్, గాబ్రియెల్లా లవ్‌లో ఉన్నారు. ఐపీఎల్ మ్యాచ్‌ల టైమ్‌లో కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైన వీరు.. ఆ తర్వాత సహజీవనం ప్రారంభించారు.
2019లో వీరికి మొదటి కొడుకు అరిక్ (Arik) జన్మించగా, 2023 జులైలో రెండో కుమారుడు రణ్‌వీర్ (Ranvir) జన్మించాడు. పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కనడంపై గతంలో సోషల్ మీడియాలో విమర్శలు వచ్చినప్పటికీ.. "మా మనసులు కలిశాయి.. కాగితం మీద సంతకం ఉంటేనే పెళ్లి అయినట్లు కాదు" అని ఆ టైమ్‌లో ఈ జంట క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు చివరకు చట్టబద్ధంగా దంపతులుగా మారి అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు.
అర్జున్ రాంపాల్ పర్సనల్ లైఫ్, కెరీర్
అర్జున్ రాంపాల్‌కు ఇది రెండో పెళ్లి. 1998లో మాజీ మిస్ ఇండియా మెహర్ జెసియాను పెళ్లి చేసుకున్న అర్జున్.. 2019లో ఆమెతో లీగల్‌గా విడాకులు తీసుకున్నారు. మెహర్, అర్జున్ దంపతులకు మహికా, మైరా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విడాకుల తర్వాత కూడా కూతుళ్ల బాధ్యతలను అర్జున్ సమర్థవంతంగా చూసుకుంటున్నారు.
{{/usCountry}}అర్జున్ రాంపాల్‌కు ఇది రెండో పెళ్లి. 1998లో మాజీ మిస్ ఇండియా మెహర్ జెసియాను పెళ్లి చేసుకున్న అర్జున్.. 2019లో ఆమెతో లీగల్‌గా విడాకులు తీసుకున్నారు. మెహర్, అర్జున్ దంపతులకు మహికా, మైరా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విడాకుల తర్వాత కూడా కూతుళ్ల బాధ్యతలను అర్జున్ సమర్థవంతంగా చూసుకుంటున్నారు.
{{/usCountry}}బాలీవుడ్‌లో 'ఓం శాంతి ఓం', 'డాన్', 'రాక్‌ఆన్', 'రాజనీతి' లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో పాపులారిటీ తెచ్చుకున్న అర్జున్ రాంపాల్, టాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చారు. నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన 'భగవంత్ కేసరి' సినిమాలో మెయిన్ విలన్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. రీసెంట్‌గా విద్యుత్ జమ్వాల్‌తో కలిసి 'క్రాక్' అనే హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌లో కనిపించారు.