...
...
Next Story

Govinda: ఇంత చీప్‌గా మాట్లాడతావా.. చాలా బూతులు తిడుతున్నావ్.. పిల్లలూ అవే నేర్చుకుంటారు..: భార్యపై నటుడి ఫైర్

Govinda: బాలీవుడ్ నటుడు గోవింద తన భార్య సునీతపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఈ మధ్య చాలా ఎక్కువ బూతులు తిడుతున్నావని, జనం వాటిని చూసి నిన్నూ అలాగే తిడతారని అనడం గమనార్హం. గోవింద ఎఫైర్ పై ఈ మధ్య సునీత ఛాన్స్ దొరికినప్పుడల్లా దారుణంగా మాట్లాడుతున్న విషయం తెలిసిందే.

Published on: Aug 16, 2026, 09:11:47 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Govinda: బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ గోవింద, ఆయన భార్య సునీత అహుజా మధ్య నడుస్తున్న ఫ్యామిలీ డ్రామా ఇప్పుడు రోడ్డున పడింది. తనను పబ్లిక్‌గా అవమానిస్తూ, మీడియా ముందే అసభ్యకరమైన బూతులు వాడుతోందంటూ భార్య సునీతపై గోవింద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ప్రవర్తన వల్ల సమాజంలో తన గౌరవం పోతోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

"కెమెరా ముందే బూతులు వాడుతోంది".. సునీతపై గోవిందా ఫైర్

Govinda: ఇంత చీప్‌గా మాట్లాడతావా.. చాలా బూతులు తిడుతున్నావ్.. పిల్లలూ అవే నేర్చుకుంటారు..: భార్యపై నటుడి ఫైర్
Govinda: ఇంత చీప్‌గా మాట్లాడతావా.. చాలా బూతులు తిడుతున్నావ్.. పిల్లలూ అవే నేర్చుకుంటారు..: భార్యపై నటుడి ఫైర్

సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియోలో గోవింద తన భార్య తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. "సునీతాజీ.. ఈమధ్య మీరు కెమెరాల ముందు కూడా బూతులు ఎక్కువగా మాట్లాడేస్తున్నారు. మిమ్మల్ని చూసి కొందరు ఇన్ స్పైర్ అయితే, మీ అసలు రూపం బయటపడుతుంది" అని గోవిందా హెచ్చరించారు.

యువత మిమ్మల్ని ఫాలో అవుతుంటే, ఇలా ప్రవర్తించడం అస్సలు సరికాదని మండిపడ్డారు. "ఒకవేళ జనాలు మిమ్మల్ని కూడా అదే రేంజ్‌లో తిడితే పరిస్థితి ఏంటి? మన కుటుంబం అంతా సిగ్గుపడాల్సి వస్తుంది. తల్లులు, చెల్లెళ్ల గౌరవాన్ని ఇలా చౌకబారుగా మార్చేయకండి" అని గట్టిగానే క్లాస్ పీకారు.

'షుగర్ డాడీ' అని కామెంట్స్.. అసలు రచ్చ ఎక్కడ స్టార్ట్ అయింది?

నటి కోమల్ రాణి స్వర్ణకర్‌తో కలిసి గోవిందా ఒక కొత్త సినిమా అనౌన్స్ చేయడంపై సునీత ఇటీవల షాకింగ్ కామెంట్స్ చేశారు. "తన కూతురు వయసున్న అమ్మాయితో తిరగడానికి సిగ్గుండాలి.. ఆయనకి మతి స్థిమితం పోయింది. ఒక షుగర్ డాడీలా ప్రవర్తిస్తున్నారు" అంటూ సునీత మీడియా ముందు ఎద్దేవా చేశారు.

తనను రకరకాల రియాలిటీ షోలు, కుకింగ్ షోలు, 'లాక్ అప్' లాంటి ప్రోగ్రామ్స్‌కి తన స్వార్థం కోసం వాడుకుందని సునీతపై గోవింద ఆరోపణలు చేశారు. ఇప్పుడు తాను కొత్తగా సినిమాలు స్టార్ట్ చేస్తుంటే, ఆ ప్రాజెక్టులను సగంలోనే ఆపేసేలా తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తోందని ఆవేదన చెందారు.

"నేను ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. పేద కుటుంబాల నుంచి ఇండస్ట్రీకి వచ్చేవాళ్లను ఇలా రోడ్డు మీదకు లాగి అవమానించకండి. దేవుడు నీకు డబ్బు, పవర్, గౌరవం ఇచ్చాడు కదా అని ఇతరులను నీచంగా చూడకూడదు" అంటూ గోవిందా ఎమోషనల్ అయ్యారు.

90s సుప్రీమ్ హీరో.. ఇప్పుడు పర్సనల్ లైఫ్ రచ్చ!

1990ల కాలంలో 'కూలీ నెంబర్ 1', 'హీరో నెంబర్ 1', 'దుల్హే రాజా', 'బడే మియా చోటే మియా' లాంటి బ్లాక్‌బస్టర్లతో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను ఏలిన గోవిందా.. డ్యాన్స్, కామెడీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. అలాంటి స్టార్ హీరో గత కొన్నేళ్లుగా సరైన హిట్లు లేక మళ్లీ కంబ్యాక్ ఇచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

గతంలో మేనల్లుడు కృష్ణ అభిషేక్ ఫ్యామిలీతో నడిచిన వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు భార్య సునీతతోనే బహిరంగంగా ఈ స్థాయిలో రచ్చ జరగడం గోవిందా అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఈ వివాదాల నడుమ ఆయన రీఎంట్రీ ప్రాజెక్టులు ఏమవుతాయో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe