Govinda: భార్యను కాకుండా పక్కవాళ్లను చూస్తే అలాగే జరుగుతుంది.. బుల్లెట్ దిగుతుంది: భర్త గోవిందాపై సునీత షాకింగ్ కామెంట్

Govinda: బాలీవుడ్ సీనియర్ హీరో గోవింద వ్యక్తిగత జీవితం మరోసారి చర్చనీయాంశమైంది. తన భర్త వివాహేతర సంబంధాలు, గతంలో జరిగిన షూటింగ్ ఇన్సిడెంట్ గురించి సునీత ఆహుజా చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Published on: May 3, 2026, 14:55:57 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Govinda: బాలీవుడ్ కామెడీ షో 'లాఫ్టర్ చెఫ్స్ 3' వేదికగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. చాలా కాలంగా విడివిడిగా ఉంటున్న గోవింద కుటుంబం, కృష్ణ అభిషేక్ కుటుంబం మధ్య మళ్లీ సఖ్యత కుదిరినట్లు కనిపిస్తోంది. ఈ షోలో గోవింద భార్య సునీత ఆహుజా తన మేనల్లుడు కృష్ణ అభిషేక్, కోడలు కాశ్మీరా షాలను కలిసి ఎమోషనల్ అయ్యారు.

Govinda: భార్యను కాకుండా పక్కవాళ్లను చూస్తే అలాగే జరుగుతుంది.. బుల్లెట్ దిగుతుంది: భర్త గోవిందాపై సునీత షాకింగ్ కామెంట్
Govinda: భార్యను కాకుండా పక్కవాళ్లను చూస్తే అలాగే జరుగుతుంది.. బుల్లెట్ దిగుతుంది: భర్త గోవిందాపై సునీత షాకింగ్ కామెంట్

అయితే ఇదే సమయంలో తన భర్త గోవిందపై ఆమె వేసిన సెటైర్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి. గోవింద హిట్‌ సాంగ్‌ 'అఖియోం సే గోలీ మారే' (కళ్లతో తూటాలు పేల్చడం)ని ఉదహరిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.

"మూడో వ్యక్తి వస్తే బుల్లెట్ దిగుతుంది"

2024 అక్టోబర్‌లో బాలీవుడ్ నటుడు గోవింద తన లైసెన్స్‌డ్ రివాల్వర్‌ను సర్దుతుండగా ప్రమాదవశాత్తూ కాలికి బుల్లెట్ తగిలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సునీత తాజాగా స్పందిస్తూ.. "కాశ్మీరా, నీకో విషయం చెప్పాలి. భార్యను గౌరవించేవాడే నిజమైన హీరో. కళ్లతో తూటాలు పేల్చే హీరోల జీవితాల్లోకి ఎక్కడైనా మూడో వ్యక్తి (థర్డ్ పార్టీ) ప్రవేశిస్తే.. వారు చివరకు తమ సొంత మోకాళ్లపైనే బుల్లెట్ దింపుకుంటారు" అంటూ నవ్వుతూనే పరోక్షంగా గోవింద ఎఫైర్లపై విమర్శలు గుప్పించారు.

"నేను కాల్పులు జరపకపోయినా అది ఎలా జరిగిందో నాకైతే తెలియదు" అని చమత్కరిస్తూనే, ఆయన ప్రవర్తన వల్లే ఇలా జరిగిందనే అర్థం వచ్చేలా మాట్లాడారు.

గోవింద-సునీత రిలేషన్షిప్ ఇలా..

గోవింద కెరీర్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు అంటే 1987 మార్చిలో సునీతతో ఆయన వివాహం అత్యంత రహస్యంగా జరిగింది. అప్పట్లో ఇమేజ్ దెబ్బతింటుందనే భయంతో దాదాపు నాలుగేళ్ల పాటు తన పెళ్లి విషయాన్ని ఆయన బయటపెట్టలేదు. వీరికి టీనా, యశ్వర్థన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

1990వ దశకంలో 'కూలీ నంబర్ 1', 'రాజా బాబు', 'బడే మియాన్ ఛోటే మియాన్' వంటి సినిమాలతో టాప్ హీరోగా వెలిగిన గోవింద.. గత కొంతకాలంగా సినిమాల కంటే వ్యక్తిగత గొడవల వల్లే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆయనకు పలువురు హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని సునీత గతంలోనూ పలుమార్లు హింట్స్ ఇచ్చారు.

కృష్ణ అభిషేక్‌తో మళ్లీ చిగురించిన బంధం

గోవింద మేనల్లుడు కృష్ణ అభిషేక్ కుటుంబానికి, సునీతకు మధ్య గత కొన్నేళ్లుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు ఉండేవి. అయితే ఈ షో ద్వారా వారు మళ్లీ దగ్గరయ్యారు. సునీత వ్యాఖ్యలకు స్పందిస్తూ.. "నేను ఎవరి పక్షాన ఉండాలో అర్థం కావడం లేదు" అని కృష్ణ సరదాగా వ్యాఖ్యానించారు.

తన అత్తమ్మను చూస్తే ఇండస్ట్రీలోని పెద్ద సూపర్ స్టార్లే వణికిపోతారని కృష్ణ అనగా.. "వణికిపోతూనే వారు మాయమైపోతుంటారు" అని సునీత తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి సునీత చేసిన ఈ తాజా వ్యాఖ్యలు గోవింద అభిమానుల్లో, నెటిజన్లలో పెద్ద చర్చకే దారితీశాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. గోవింద భార్య సునీత ఆయనపై ఎందుకు విమర్శలు చేశారు?

గోవిందకు ఉన్న వివాహేతర సంబంధాల గురించి, గతంలో ఆయన కాలికి జరిగిన తుపాకీ గాయం ఘటనను ఉద్దేశించి సునీత వ్యంగ్యంగా స్పందించారు. భార్యను గౌరవించని వారు ఇబ్బందుల్లో పడతారని ఆమె పరోక్షంగా పేర్కొన్నారు.

2. 2024లో గోవిందకు తుపాకీ గాయం ఎలా అయింది?

ముంబైలోని తన నివాసంలో కోల్‌కతా వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, లైసెన్స్‌డ్ రివాల్వర్‌ను కప్‌బోర్డ్‌లో పెట్టే క్రమంలో అది చేజారి కింద పడింది. ఆ సమయంలో తూటా మిస్ ఫైర్ అయి ఆయన కాలికి తగిలింది.

3. సునీత, గోవింద ఎప్పుడు వివాహం చేసుకున్నారు?

వీరు 1987 మార్చిలో రహస్యంగా వివాహం చేసుకున్నారు. గోవింద స్టార్ హీరోగా మారాక, వారి కుమార్తె పుట్టిన తర్వాతే ఈ విషయాన్ని ప్రపంచానికి వెల్లడించారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More