...
...
Next Story

ఒక్క హీరోయిన్ వైపు కూడా కన్నెత్తి చూడలేదు.. మా అమ్మ కూడా హీరోయినే.. ఆ నటికి థ్యాంక్స్: బాలీవుడ్ నటుడు సంచలన కామెంట్స్

బాలీవుడ్ సీనియర్ హీరో గోవిందా తన వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా వివాహేతర సంబంధం గురించి తన భార్య సునీత అహుజా చేసిన వ్యాఖ్యలపై మౌనం వీడాడు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ, ఇండస్ట్రీలో తన ప్రవర్తన, హీరోయిన్లతో తనకున్న గౌరవప్రదమైన సంబంధాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Published on: Feb 10, 2026, 16:37:11 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

బాలీవుడ్ స్టార్ హీరో గోవిందా (Govinda) తన దాంపత్య జీవితంలో గొడవలపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు. ఇటీవల అతని భార్య సునీత అహుజా చేసిన కొన్ని కామెంట్స్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. గోవిందాకు వివాహేతర సంబంధం ఉందనే కోణంలో వస్తున్న పుకార్లపై ఆయన ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సూటిగా స్పందించాడు.

"ముసలితనంలో ప్రేమనా?"

ఒక్క హీరోయిన్ వైపు కూడా కన్నెత్తి చూడలేదు.. మా అమ్మ కూడా హీరోయినే.. ఆ నటికి థ్యాంక్స్: బాలీవుడ్ నటుడు సంచలన కామెంట్స్ (HT_PRINT)
ఒక్క హీరోయిన్ వైపు కూడా కన్నెత్తి చూడలేదు.. మా అమ్మ కూడా హీరోయినే.. ఆ నటికి థ్యాంక్స్: బాలీవుడ్ నటుడు సంచలన కామెంట్స్ (HT_PRINT)

గోవిందా తనదైన శైలిలో స్పందిస్తూ.. "నాపై ఆరోపణలు రావడం ఇదేం కొత్త కాదు. ఎప్పుడూ ఏదో ఒక నింద వేస్తూనే ఉంటారు. ఇప్పుడు వస్తున్న ఆరోపణలు చూస్తుంటే.. ఇది చిన్ననాటి ప్రేమ అని అంటున్నారు. కానీ కొందరి ఆలోచన ప్రకారం చూస్తే.. ఇది ముసలితనంలో పుట్టిన ప్రేమ అనుకోవాలి" అంటూ పరోక్షంగా సెటైర్ వేశాడు. ప్రేమ విషయంలో తనకు ఎప్పుడూ కలిసి రాలేదని అతడు అనడం విశేషం.

"మిస్ యూనివర్స్‌తో పనిచేశా.. కానీ ఎప్పుడూ అలా.."

తన క్యారెక్టర్ గురించి వివరిస్తూ గోవిందా ఎమోషనల్ అయ్యాడు. "నేను నలుగురు సూపర్ స్టార్లతో, మిస్ యూనివర్స్ వంటి అందగత్తెలతో పనిచేశాను. కానీ ఎప్పుడూ వారిని తప్పుగా చూడలేదు. నేను ఏ హీరోయిన్‌ను ఇబ్బంది పెట్టానని కానీ, అసభ్యంగా మాట్లాడానని కానీ నా కెరీర్లో ఒక్కరు కూడా చెప్పలేరు. మా అమ్మ కూడా ఒక హీరోయిన్. అందుకే స్త్రీలను ఎలా గౌరవించాలో నాకు తెలుసు. ఇన్నాళ్ల నా కెరీర్లో నాకు సహకరించిన హీరోయిన్లు, దర్శకులకు ధన్యవాదాలు" అని అన్నాడు.

'కోమల్' మౌనానికి థ్యాంక్స్..

ఈ వివాదంలో వినిపిస్తున్న 'కోమల్' అనే పేరుపై గోవిందా స్పందించాడు. "ఆమె (సునీత) కోమల్ పేరు ఎత్తుతోంది. కానీ నేను కోమల్‌కు ధన్యవాదాలు చెబుతున్నాను. ఎందుకంటే ఆమె ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉంది. ఈ రోజుల్లో యువత అయితే చిన్న విషయానికి కూడా సోషల్ మీడియాలో రచ్చ చేసేవారు. ఆమె మౌనమే ఈ రోజు నన్ను కాపాడింది" అని గోవిందా పేర్కొన్నాడు.

కొత్తవారికి క్షమాపణలు..

చివరగా తన తల్లి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ.. "నలుగురు కుటుంబ సభ్యులే లోకం అనుకుంటే ఏదో ఒకరోజు మోసపోతావు. బయట ప్రపంచం నిన్ను ప్రేమిస్తోంది, వాళ్లేమీ పిచ్చోళ్లు కాదు కదా అని మా అమ్మ చెప్పేది" అని గోవిందా ముగించాడు. గోవిందా, సునీత 1987లో వివాహం చేసుకున్నారు. వీరికి టీనా, యశ్వర్ధన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks