Vijay Varma: స్టేజ్‌పైనే ఇన్‌ఫ్లుయెన్సర్‌కు గట్టిగా ఇచ్చి పారేసిన విజయ్ వర్మ.. తిట్టిందా పొగిడిందా తెలియక..
Vijay Varma: బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ స్క్రీన్ పై ఎంత క్రూరమైన పాత్రలు చేసినా.. బయట మాత్రం చాలా ఫన్నీగా ఉంటారు. తాజాగా ఓ అవార్డు వేడుకలో ఆయన తనదైన స్టైల్లో వేసిన పంచ్ లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Vijay Varma: ఐఎఫ్ఎఫ్‌ఎమ్ 2026 (IFFM 2026) అవార్డుల వేదికపై బాలీవుడ్ విలక్షణ యాక్టర్ విజయ్ వర్మ తన మార్క్ పంచ్‌లతో దుమ్మురేపారు. 'మట్కా కింగ్' వెబ్ సిరీస్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు అందుకున్న ఆయన.. స్టేజ్ పైనే హోస్ట్ డాలీ సింగ్‌కు ఇచ్చిపడేసిన రివర్స్ కౌంటర్ ఇప్పుడు నెట్టింట గట్టిగా వైరల్ అవుతోంది.

స్టేజ్ మీదే ఊహించని పంచ్.. అసలేం జరిగింది?
మెల్‌బోర్న్‌లో జరిగిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికపై విజయ్ వర్మను ఆహ్వానించిన పాపులర్ కంటెంట్ క్రియేటర్, యాంకర్ డాలీ సింగ్ ఆయన చేసిన నెగెటివ్ క్యారెక్టర్లను ప్రస్తావించింది. "ఆన్ స్క్రీన్‌పై మిమ్మల్ని చూస్తే ఏ క్షణంలో ఎవరిని చంపేస్తారో అని భయమేస్తుంది, మీరు నడిచే 'రెడ్ ఫ్లాగ్' లాంటివారు.. కానీ రియల్ లైఫ్‌లో స్వీట్ పర్సన్ అని చెప్తారు, ఇది ఎలా సాధ్యం?" అని ప్రశ్నించింది.
దీనికి విజయ్ వర్మ తనదైన శైలిలో ఫన్నీగా స్పందించారు. "ఇంట్లో ఒక పెద్ద ఎర్రటి క్లాత్ ముక్క తెచ్చి పెట్టుకుని మీకు ఎన్ని ఫ్లాగ్స్ కావాలంటే అన్ని కుట్టుకోండి" అని సమాధానమిచ్చారు. డాలీ వెంటనే దాన్ని "లేమ్ జోక్" అంటూ ఆ జోక్ ను పక్కన పెట్టేస్తానని అనడంతో విజయ్ అసలైన మైండ్ బ్లోయింగ్ కౌంటర్ ఇచ్చారు. "నువ్వు ఇచ్చిన దారుణమైన కాంప్లిమెంట్స్‌ను ఎలా పక్కన పెట్టేశానో.. అలానే నీ కామెంట్‌ను కూడా వదిలేస్తున్నా" అంటూ రివర్స్ పంచ్ వేశారు. దాంతో ఆడిటోరియంలో ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వేశారు.
సోషల్ మీడియాలో భిన్నమైన రెస్పాన్స్
ఈ సరదా సంభాషణ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవ్వడంతో నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. కొందరు దీన్ని కేవలం స్టేజ్ పైన జరిగిన సరదా సంభాషణ అని అంటుంటే, మరికొందరు డాలీ చేసిన కామెంట్ కాస్త ఇబ్బందికరంగా ఉందంటూ అభిప్రాయపడుతున్నారు.
అయితే ఆన్ స్క్రీన్‌పై విజయ్ వర్మ చేసే నెగెటివ్ రోల్స్ మైండ్‌లో పెట్టుకుని సరదాగానే డాలీ ఆ కామెంట్స్ చేసిందని, విజయ్ కూడా అంతే స్పోర్టివ్‌గా తనదైన టైమింగ్‌తో ఆన్ ద స్పాట్ కౌంటర్ ఇచ్చాడని ఎక్కువ మంది నెటిజన్లు సపోర్ట్ చేస్తున్నారు.
నెగెటివ్ రోల్స్‌కు కొత్త కేరాఫ్ అడ్రస్
విజయ్ వర్మ కెరీర్ పరిశీలిస్తే బాలీవుడ్‌లో నెగెటివ్, గ్రే షేడ్ క్యారెక్టర్లకు ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేశారు. ఆలియా భట్‌తో కలసి నటించిన 'డార్లింగ్స్' సినిమాలోని సైకో భర్త పాత్ర, సోనాక్షి సిన్హాతో చేసిన 'దహాడ్' సిరీస్‌లోని సీరియల్ కిల్లర్ క్యారెక్టర్ ఆయన్ని నటుడిగా నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. భయంకరమైన విలనిజం పండిస్తూనే, రియల్ లైఫ్‌లో చాలా కూల్‌గా ఉండటం విజయ్ వర్మ స్పెషాలిటీ.
ప్రామిసింగ్ రోల్స్ ఎంచుకుంటూ వర్సటైల్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ వర్మ.. విలన్‌గా చేసినా కూడా ఆడియన్స్ నుంచి ప్రశంసలు అందుకోవడం విశేషం. తెరపై ఆయన కనిపించగానే కథలో ఏదో సీరియస్ ట్విస్ట్ రాబోతుందనే ఫీలింగ్ ఆడియన్స్‌కి తెప్పించడంలో ఆయన సక్సెస్ అయ్యారు.
'మట్కా కింగ్' నుంచి 'గుస్తాఖ్ ఇష్క్' వరకు..
ఆ మధ్య ప్రైమ్ వీడియోలో విడుదలైన 'మట్కా కింగ్' వెబ్ సిరీస్‌లో ఒక సాధారణ కాటన్ ట్రేడర్ నుంచి మట్కా జూదం సామ్రాజ్యాన్ని శాసించే డాన్‌గా ఆయన చూపించిన నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అందుకే ఐఎఫ్ఎఫ్‌ఎమ్ 2026లో బెస్ట్ పెర్ఫార్మింగ్ యాక్టర్‌గా ఆయనను అవార్డు వరించింది.
మరోవైపు ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ప్రొడ్యూసర్‌గా మారిన 'గుస్తాఖ్ ఇష్క్' సినిమాలో నసీరుద్దీన్ షా, ఫాతిమా సనా షేక్‌లతో కలిసి నటించి మళ్లీ తన వైవిధ్యాన్ని చాటుకున్నారు. విభు పూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాతో విజయ్ వర్మ తన నటనతో మరోసారి ఆకట్టుకున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


