Vijay Varma: అబ్బాయిలనూ వదిలిపెట్టరా? నన్ను అసభ్యంగా తాకాలని చూశాడు- షాక్: హైదరాబాద్‌లో క్యాస్టింగ్ కౌచ్ పై విజయ్ వర్మ
Vijay Varma: ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వినిపిస్తూనే ఉంటాయి. హీరోయిన్లను కమిట్మెంట్ అడిగారని, టచ్ చేశారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ షాకింగ్ గా ఓ అబ్బాయి పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించిన విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లో తనకు ఎదురైన వింత ఘటనను విజయ్ వర్మ వెల్లడించాడు.
Vijay Varma: బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ (Vijay Varma) సంచలన ఆరోపణలు చేశాడు. ‘గల్లీ బాయ్’, ‘దహాద్’, ‘డార్లింగ్స్’ వంటి విభిన్నమైన సినిమాలతో, వెబ్ సిరీస్‌లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అతను క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయటపెట్టాడు. హైదరాబాద్‌లో ఎదుర్కొన్న ఇబ్బంది గురించి మాట్లాడాడు.

హైదరాబాద్‌లో మోడలింగ్
ప్రఖార్ గుప్తాతో జరిగిన యూట్యూబ్ టాక్ షోలో విజయ్ వర్మ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలోకి రాకముందు హైదరాబాద్‌లో మోడలింగ్‌లో ప్రయత్నాలు చేసినట్లు చెప్పాడు.
"నేను హైదరాబాద్‌లో కెరీర్ ప్రారంభంలో మోడలింగ్ చేయడానికి ప్రయత్నించాను. ఆ సమయంలో ఒక మోడల్ కోఆర్డినేటర్ నా పట్ల చాలా విచిత్రంగా ప్రవర్తించాడు. నన్ను అనుచితంగా తాకడానికి ప్రయత్నించాడు. అప్పుడు షాక్ అయ్యా. వెంటనే నేను 'బ్రో, ఏంటిది? ఏం చేస్తున్నావ్ నువ్వు?' అని గట్టిగా నిలదీశా" అని విజయ్ వర్మ వెల్లడించాడు.
తీవ్రంగా బాధపడ్డా
"అనుభవం లేని సమయంలో అలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు ఎవరైనా త్వరగా నిరాశకు గురవుతారు. నేను కూడా తీవ్రంగా బాధపడ్డాను. కానీ, ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాను. నటన నా లక్ష్యమైనప్పుడు ఇటువంటి వాటిని నేరుగా ఎదుర్కొని తీరాలని నిశ్చయించుకున్నాను" అని విజయ్ తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ సంఘటనను గుర్తు చేసుకున్నాడు.
వరుసగా ఫెయిల్యూర్స్
మోడలింగ్ ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవం విజయ్‌ను నటన వైపు నడిపించింది. అయితే అక్కడ కూడా అతనికి వరుసగా ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయి. హైదరాబాద్‌లోని 'సూత్రధార్ స్కూల్ ఆఫ్ యాక్టింగ్'కు వెళ్లినప్పుడు, వారు విజయ్ కు శిక్షణ ఇచ్చేందుకు నిరాకరించాట. "నటనకు ఎంతో అంకితభావం, పట్టుదల కావాలి. రెండు రోజులు వచ్చి వెళ్లిపోయే ఆట కాదిది" అని వెనక్కి పంపారని విజయ్ తెలిపాడు.
అక్కడా రిజెక్ట్
ఆ తర్వాత పూణేలోని ప్రతిష్టాత్మక ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII)లో సీటు కోసం విజయ్ దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ఫస్ట్ అటెంప్ట్ లో రిజెక్ట్ అయ్యాడు. కానీ పట్టువదలకుండా రెండో ప్రయత్నంలో సీటు సాధించాడు. అక్కడ రాజ్‌కుమార్ రావు, జైదీప్ అహ్లావత్ వంటి నటులతో కలిసి శిక్షణ పొందాడు.
మట్కా కింగ్ 2 నుంచి ఫ్యామిలీ బిజినెస్ వరకు
వరుస పరాజయాలను అధిగమించి అగ్ర నటుడిగా ఎదిగిన విజయ్ వర్మ చేతిలో ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.
- మట్కా కింగ్: ప్రైమ్ వీడియోలో ఇటీవల స్ట్రీమింగ్ అయి విశేష ఆదరణ పొందిన మట్కా కింగ్ సిరీస్ 1960ల నాటి ముంబై జూదం నేపథ్యంలో సాగుతుంది. కృత్తికా కామ్రా, సాయి తమన్హాకర్‌లతో కలిసి విజయ్ నటించిన ఈ సిరీస్ సూపర్ హిట్ కావడంతో మేకర్స్ అధికారికంగా రెండో సీజన్‌ను (Season 2) ప్రకటించారు.
- గుస్తాఖ్ ఇష్క్: వినూ పూరి దర్శకత్వంలో, మనీష్ మల్హోత్రా నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రంలో నసీరుద్దీన్ షా, ఫాతిమా సనా షేక్, షారీబ్ హష్మీలతో కలిసి విజయ్ కీలక పాత్ర పోషించారు.
- ఫ్యామిలీ బిజినెస్: నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తున్న ఈ హై-స్టేక్స్ కార్పొరేట్ డ్రామాలో అనిల్ కపూర్‌తో కలిసి విజయ్ వర్మ నటిస్తున్నాడు. దర్శకుడు హన్సల్ మెహతా, రచయిత నిరేన్ భట్ కాంబినేషన్‌లో ఈ సిరీస్ రూపొందుతోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


