బాలీవుడ్ నటీమణులు కాజోల్, ట్వింకిల్ ఖన్నా కలిసి హోస్ట్ చేస్తున్న ప్రముఖ సెలబ్రిటీ టాక్ షో 'టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్' లేటెస్ట్ ఎపిసోడ్‌కు నటులు విక్కీ కౌశల్, కృతి సనన్ వచ్చారు. ఈ సందర్భంగా వివాదాస్పద, ఆసక్తికరమైన అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా వివాహ బంధానికి కూడా గడువు తేదీ ఉండాలి, దానిని మళ్లీ రెనివల్ చేసుకునే అవకాశం ఇవ్వాలని కాజోల్ అభిప్రాయపడటం చర్చనీయాంశమైంది.
పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్ ఉండాలి: కాజోల్ సంచలన వ్యాఖ్యలు

కాజోల్, ట్వింకిల్ హోస్ట్ చేస్తున్న ఈ టూమచ్ షోలో భాగంగా 'దిస్ ఆర్ దట్' (This or That) అనే సెగ్మెంట్‌లో ట్వింకిల్ ఖన్నా ఒక ప్రశ్న అడిగింది. "వివాహానికి గడువు తేదీ, రెనివల్ ఆప్షన్ ఉండాలా?" అని. దీనికి నో చెబుతూ కృతి సనన్, విక్కీ కౌశల్, ట్వింకిల్ ఖన్నా రెడ్ జోన్‌లో నిలబడ్డారు. కాజోల్ మాత్రం ఈ ఆలోచనకు మద్దతు ఇచ్చి గ్రీన్ జోన్‌లోకి వెళ్లింది. ట్వింకిల్ వెంటనే స్పందిస్తూ.. "అది పెళ్లి, వాషింగ్ మెషీన్ కాదు కదా!" అని చమత్కరించింది.
కాజోల్ దానికి గట్టిగా బదులిస్తూ.. “నేను కచ్చితంగా అలా అనుకుంటున్నాను. సరైన సమయంలో సరైన వ్యక్తిని పెళ్లి చేసుకుంటారనే గ్యారెంటీ ఏముంది? అందుకే రెనివల్ ఆప్షన్ ఉంటే అర్ధవంతంగా ఉంటుంది. ఒకవేళ గడువు తేదీ ఉంటే ఎవరూ ఎక్కువ కాలం బాధపడాల్సిన అవసరం ఉండదు” అని వివరించింది. ఈ విషయంలో తనతో కలవమని ఆమె ట్వింకిల్‌ను కూడా ఒప్పించే ప్రయత్నం చేసింది.
డబ్బుతో ఆనందం కొనుగోలుపై చర్చ
ఇక ఇదే సెగ్మెంట్ లో ట్వింకిల్ మరో ప్రశ్న అడుగుతూ.. "డబ్బుతో ఆనందాన్ని కొనుగోలు చేయవచ్చా" అని చెప్పింది. ఈసారి ట్వింకిల్, విక్కీ అంగీకరించి గ్రీన్ జోన్‌లో నిలబడగా, కాజోల్ వ్యతిరేకించింది. దీనికి కాజోల్ వివరణ ఇస్తూ.. “మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నప్పటికీ, అది కొన్నిసార్లు అడ్డంకిగా కూడా మారవచ్చు. నిజమైన సంతోషాన్ని అర్థం చేసుకోకుండా అది మిమ్మల్ని మొద్దుబారేలా చేస్తుంది” అని అనడం విశేషం. కొద్దిసేపు ఆలోచించిన తర్వాత కృతి సనన్ డబ్బు కొంతవరకు ఆనందాన్ని కొనుగోలు చేయగలదని అంగీకరించింది.
'మా ఇద్దరికీ ఒకే ఎక్స్ ఉన్నాడు'
గేమ్‌లో చివరి దశలో ట్వింకిల్ ఖన్నా ఒక కీలకమైన కామెంట్ చేసింది. "బెస్ట్ ఫ్రెండ్స్ ఒకరి ఎక్స్‌లతో మరొకరు డేటింగ్ చేయకూడదు" అని చెబుతూనే.. సరదాగా కాజోల్ చుట్టూ చేయి వేసి పట్టుకుంది. “మా ఇద్దరికీ ఒకే ఎక్స్ ఉన్నాడు. కానీ మేము చెప్పలేము” అని ట్వింకిల్ ఆటపట్టించింది.
{{/usCountry}}గేమ్‌లో చివరి దశలో ట్వింకిల్ ఖన్నా ఒక కీలకమైన కామెంట్ చేసింది. "బెస్ట్ ఫ్రెండ్స్ ఒకరి ఎక్స్‌లతో మరొకరు డేటింగ్ చేయకూడదు" అని చెబుతూనే.. సరదాగా కాజోల్ చుట్టూ చేయి వేసి పట్టుకుంది. “మా ఇద్దరికీ ఒకే ఎక్స్ ఉన్నాడు. కానీ మేము చెప్పలేము” అని ట్వింకిల్ ఆటపట్టించింది.
{{/usCountry}}దీనికి కాజోల్ వెంటనే నవ్వి ఏ రహస్యాలు బయటపెట్టకుండా ఉండటానికి "నోరు మూయ్" అని సరదాగా మందలించింది. ఈ ఇద్దరు తారలు తమ వ్యక్తిగత జీవితాల గురించి చేసిన ఈ పరోక్ష వ్యాఖ్యలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి.
'టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్' ఈ ఏడాది విడుదలైన అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన సెలబ్రిటీ టాక్ షోలలో ఒకటి. కాజోల్, ట్వింకిల్ ఖన్నా హోస్ట్ చేస్తున్న ఈ షోలో సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ వంటి సీనియర్ తారలతో పాటు వరుణ్ ధావన్, అలియా భట్, అనన్యా పాండే వంటి యువ తారలు కూడా పాల్గొన్నారు. ఈ షో ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్ విడుదలవుతుంది.