...
...
Next Story

సినిమాల్లో హింస మరీ ఎక్కువవుతోంది.. అదేమీ ఎంటర్టైన్మెంట్ కాదు.. ఇలాంటి చోట్ల పిల్లలను పెంచాలంటే కష్టం: నటి కామెంట్స్

ఇండియన్ సినిమాల్లో హింస మితిమీరుతుండటంపై నటి రాధికా ఆప్టే ఆందోళన వ్యక్తం చేసింది. అదో ఎంటర్టైన్మెంట్‌లా మారిపోయిందని, ఇలాంటి చోట్ల పిల్లలను పెంచడం కష్టమే అని ఆమె అనడం గమనార్హం.

Published on: Dec 11, 2025, 18:57:53 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఒకప్పుడు బోల్డ్ పాత్రలతో విమర్శకుల ప్రశంసలు పొందిన నటి రాధికా ఆప్టే. తెలుగులోనూ కొన్ని సినిమాల్లో నటించింది. అయితే తాజాగా ఆమె ఇండియన్ సినిమాల్లో చూపిస్తున్న ‘హింస’పై గళం విప్పింది. ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చి ప్రస్తుతం బ్రేక్ లో ఉన్న రాధిక.. ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాతో మాట్లాడుతూ సినిమాల్లో పెరుగుతున్న గోర్ (హింస) కల్చర్ పట్ల తన అసహనాన్ని వ్యక్తం చేసింది.

నేను చాలా డిస్టర్బ్ అయ్యాను..

సినిమాల్లో హింస మరీ ఎక్కువవుతోంది.. అదేమీ ఎంటర్టైన్మెంట్ కాదు.. ఇలాంటి చోట్ల పిల్లలను పెంచాలంటే కష్టం: నటి కామెంట్స్ (instagram/@radhikaofficial)
సినిమాల్లో హింస మరీ ఎక్కువవుతోంది.. అదేమీ ఎంటర్టైన్మెంట్ కాదు.. ఇలాంటి చోట్ల పిల్లలను పెంచాలంటే కష్టం: నటి కామెంట్స్ (instagram/@radhikaofficial)

ది వెడ్డింగ్ గెస్ట్‌తోపాటు పార్చ్‌డ్, లేటెస్ట్ గా సిస్టర్ మిడ్‌నైట్ లాంటి సినిమాల్లో బోల్డ్ పాత్రలతో అలరించిన నటి రాధికా ఆప్టే. అలాంటి నటి సినిమాల్లో హింసను తప్పబడుతోంది. ప్రస్తుతం వినోదం పేరుతో అమ్ముడవుతున్న హింసను చూస్తుంటే తనకు భయమేస్తోందని రాధిక అనడం గమనార్హం.

"నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పాలి. ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ ముసుగులో అమ్ముడవుతున్న హింస నన్ను తీవ్రంగా కలచివేస్తోంది. హింసే వినోదంగా మారిన ఈ ప్రపంచంలో నేను నా బిడ్డను పెంచాలనుకోవడం లేదు. దీన్ని నేను తట్టుకోలేకపోతున్నాను" అని రాధిక ఆవేదన వ్యక్తం చేసింది.

కథ చెప్పడానికి నరకడం చూపించాలా?

కథలో డెప్త్ కంటే.. తెరపై చూపించే రక్తపాతానికే మేకర్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని రాధిక విమర్శించింది. "నేను ఒక హంతకుడి కథ చెప్పాలనుకుంటే.. వాడు మనుషులను నరకడాన్ని, చేసే ఘోరమైన పనులను కళ్లకు కట్టినట్లు చూపించాల్సిన అవసరం లేదు. అది స్టోరీటెల్లింగ్ కాదు. కానీ ఇప్పుడు అదే అమ్ముడవుతోంది. దీని ప్రభావం సమాజంపై చాలా తీవ్రంగా ఉంటుంది. ఇదే నన్ను బాధిస్తోంది" అని ఆమె చెప్పింది. కరోనా తర్వాత ఈ ట్రెండ్ మరీ ఎక్కువైందని ఆమె అభిప్రాయపడింది.

రాధికా నెక్స్ట్ ప్రాజెక్ట్ రిలీజ్‌కు రెడీ

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe