...
...
Next Story

కుల, మత భేదాలు ఇక్కడ లేవు.. 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా.. మీ పనే మీరేంటో చెబుతుంది: రెహమాన్ కామెంట్స్‌పై రాణీ ముఖర్జీ

బాలీవుడ్‌లో మతపరమైన భేదాలు, వివక్ష ఉండవచ్చని సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలతో నటి రాణి ముఖర్జీ ఏకీభవించలేదు. బాలీవుడ్ చాలా సెక్యులర్ ప్రదేశమని, ఇక్కడ ప్రతిభకే పట్టం కడతారని ఆమె స్పష్టం చేసింది.

Published on: Jan 30, 2026, 13:51:33 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఇటీవల బాలీవుడ్ మ్యూజిక్ ఇండస్ట్రీలో మారుతున్న పరిస్థితులు, పవర్ పాలిటిక్స్ గురించి చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. క్రియేటివిటీ లేని వ్యక్తుల చేతిలోకి అధికారం వెళ్లిందని, ఇది "మతపరమైన విషయం" కూడా కావచ్చని అతడు అభిప్రాయపడ్డాడు. అయితే ప్రముఖ నటి రాణి ముఖర్జీ ఈ వ్యాఖ్యలను తప్పుబట్టింది.

రాణి ముఖర్జీ ఏమన్నారంటే..

కుల, మత భేదాలు ఇక్కడ లేవు.. 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా.. మీ పనే మీరేంటో చెబుతుంది: రెహమాన్ కామెంట్స్‌పై రాణీ ముఖర్జీ
కుల, మత భేదాలు ఇక్కడ లేవు.. 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా.. మీ పనే మీరేంటో చెబుతుంది: రెహమాన్ కామెంట్స్‌పై రాణీ ముఖర్జీ

డీడీ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ మాట్లాడుతూ.. ఏఆర్ రెహమాన్ కామెంట్స్ ను ఖండించింది. "బాలీవుడ్ చాలా సెక్యులర్ ప్రదేశం అని నేను బలంగా నమ్ముతాను. ఇక్కడ కులం లేదా మతం ఆధారంగా ఎలాంటి వివక్ష ఉండదు. ఈ పరిశ్రమలో నా 30 ఏళ్ల ప్రయాణంలో నేను ఎప్పుడూ ఇలాంటివి చూడలేదు. నేను ఈ ఇండస్ట్రీని ప్రేమిస్తున్నాను. అది నన్ను ఈ స్థాయికి చేర్చింది. నా గుండె లోతుల్లో నుంచి చెబుతున్నాను.. ఇక్కడ కేవలం ప్రతిభ మాత్రమే ముఖ్యం" అని స్పష్టం చేసింది.

మీ పనితనం మీ గురించి మాట్లాడుతుందని, ప్రేక్షకులు ఎవరిని ఆదరిస్తే వారే ఇక్కడ నిలబడతారని రాణీ ముఖర్జీ తేల్చి చెప్పింది. ఇండస్ట్రీలో బెంగాలీ, పంజాబీ, మలయాళీ వంటి లాబీలు ఉన్నాయా అని అడిగినప్పుడు.. తాను వాటికి దూరంగా ఉంటానని, తన దృష్టి అంతా సినిమాలు, తన బిడ్డ, కుటుంబంపైనే ఉంటుందని రాణి సమాధానమిచ్చింది.

రెహమాన్ కామెంట్స్, క్షమాపణలు

బీబీసీ ఏషియన్ నెట్‌వర్క్‌తో మాట్లాడుతూ ఏఆర్ రెహమాన్.. "గత ఎనిమిదేళ్లుగా ఇండస్ట్రీలో పవర్ డైనమిక్స్ మారాయి. క్రియేటివిటీ లేని వారి చేతిలో పవర్ ఉంది. ఇది మతపరమైన విషయం కూడా కావచ్చు" అని అనడమే కాకుండా.. 'చావా' సినిమాపైనా విమర్శలు చేశాడు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో.. రెహమాన్ స్పందిస్తూ.. "ఇండియా నాకు స్ఫూర్తి. ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండి" అని ఒక వీడియో ద్వారా వివరణ ఇచ్చాడు.

మర్దానీ 3 మూవీ విశేషాలు

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe