ఈ సినిమా రూ.500 కోట్లు వసూలు చేసిన తర్వాతే చూస్తాను.. నన్ను తప్పుగా అనుకోకండి: తన కొడుకు మూవీపై బాలీవుడ్ నటుడు కామెంట్స్

బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి తన కొడుకు అహాన్ శెట్టి నటించిన ‘బోర్డర్ 2’ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లు వసూలు చేస్తేనే తాను చూస్తానని, అప్పటివరకు ఒక్క ఫ్రేమ్ కూడా చూడనని ఆయన శపథం చేశారు.

Published on: Jan 29, 2026, 21:37:30 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఎప్పుడో 29 ఏళ్ల కిందట అంటే 1997లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ‘బోర్డర్’లో భైరన్ సింగ్ రాథోడ్ పాత్రలో మెప్పించాడు సునీల్ శెట్టి. ఇప్పుడు అదే సినిమా సీక్వెల్ ‘బోర్డర్ 2’లో తన కొడుకు అహాన్ శెట్టి నటించడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాడు. అయితే తన కొడుకు సినిమా అయినా సరే తాను ఇప్పుడే చూడనని అతడు ఓ కండిషన్ పెట్టుకున్నాడు. మిడ్-డేతో మాట్లాడుతూ తాను ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నానో వెల్లడించాడు.

ఈ సినిమా రూ.500 కోట్లు వసూలు చేసిన తర్వాతే చూస్తాను.. నన్ను తప్పుగా అనుకోకండి: తన కొడుకు మూవీపై బాలీవుడ్ నటుడు కామెంట్స్ (PTI)
ఈ సినిమా రూ.500 కోట్లు వసూలు చేసిన తర్వాతే చూస్తాను.. నన్ను తప్పుగా అనుకోకండి: తన కొడుకు మూవీపై బాలీవుడ్ నటుడు కామెంట్స్ (PTI)

రూ. 500 కోట్లు వస్తేనే..

గత వారం జరిగిన బోర్డర్ 2 సినిమా ప్రీమియర్ షోకి సునీల్ శెట్టి హాజరయ్యాడు. కానీ సినిమా చూడలేదు. దీని గురించి అతడు మాట్లాడుతూ.. "ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్ల వసూళ్లు సాధించే వరకు నేను చూడనని మొదటి రోజు నుంచే చెప్పాను. ఇది నా కొడుకు అహాన్ కోసం నేను మొక్కుకున్న మొక్కు. ఇప్పటివరకు నేను ఈ సినిమాలో ఒక్క ఫ్రేమ్ కూడా చూడలేదు. నన్ను తప్పుగా అనుకోవద్దు. ఇది అహంకారం కాదు. కేవలం సినిమాపై ఉన్న ఒక నమ్మకం మాత్రమే" అని వివరించాడు.

థియేటర్ బయటే కూర్చున్నా..

ప్రీమియర్ షో రోజున తన భార్య మానా శెట్టి, కూతురు అతియా శెట్టి, అల్లుడు కేఎల్ రాహుల్ అందరూ సినిమా చూశారని, కానీ తాను మాత్రం మూడున్నర గంటల పాటు థియేటర్ బయటే కూర్చున్నానని సునీల్ చెప్పాడు. బయట అందరినీ కలుస్తూ, వారి అభినందనలు స్వీకరిస్తూ సమయం గడిపానన్నాడు. తన భార్యకు సినిమా చాలా బాగా నచ్చిందని తెలిపాడు. 'ధురంధర్' తర్వాత మరో హిందీ సినిమా ఇంత బాగా ఆడుతుండటం సంతోషంగా ఉందన్నాడు.

వారితో కలిసి చూస్తా..

బోర్డర్ 2 సినిమా రూ.500 కోట్ల మార్కును దాటగానే తన కుమారుడు అహాన్, అతని స్నేహితులు, తన కుటుంబం, సన్నీ డియోల్, వరుణ్ ధావన్ అందరితో కలిసి సినిమా చూస్తానని సునీల్ శెట్టి చెప్పాడు. అహాన్ తీసుకున్న నిర్ణయాల పట్ల తనకు ఎప్పుడూ గర్వంగా ఉంటుందని పేర్కొన్నాడు.

అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించిన ‘బోర్డర్ 2’ జనవరి 23న విడుదలైంది. ఇందులో సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్, అహాన్ శెట్టి, మోనా సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆరు రోజుల్లోనే రూ.300 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. సునీల్ శెట్టి అంచనా వేస్తున్నట్లు రూ.500 కోట్ల మార్క్ దాటడం పెద్ద కష్టంగా అనిపించడం లేదు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More