...
...
Next Story

Kangana Ranaut: నీకు స్వీపర్ ఉద్యోగం కూడా రాదు.. నా రీల్స్ చూస్తూ ఏడవడం తప్ప నీకు ఏమీ రాదు: రాఖీ సావంత్‌పై కంగనా ఫైర్

Kangana Ranaut: కంగనా రనౌత్, రాఖీ సావంత్ మధ్య వివాదం ముదురుతోంది. గతంలో తనపై చేసిన కామెంట్స్ కు కంగనా గట్టి కౌంటర్ ఇచ్చింది. ఆమె చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్ అవుతోంది.

Published on: Sep 14, 2026, 19:25:28 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఇటీవల తనపై, మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డ్రామా క్వీన్ రాఖీ సావంత్‌కు కౌంటర్ ఇస్తూ సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జీవితంలో ఏమీ సాధించలేని వైఫల్యంతో ఉన్నవాళ్లే సక్సెస్‌ఫుల్ మహిళలను టార్గెట్ చేస్తారని కంగనా ఘాటుగా స్పందించారు.

“స్వీపర్ ఉద్యోగానికి కూడా టాలెంట్ కావాలి”: కంగనా

Kangana Ranaut: నీకు స్వీపర్ ఉద్యోగం కూడా రాదు.. నా రీల్స్ చూస్తూ ఏడవడం తప్ప నీకు ఏమీ రాదు: రాఖీ సావంత్‌పై కంగనా ఫైర్
Kangana Ranaut: నీకు స్వీపర్ ఉద్యోగం కూడా రాదు.. నా రీల్స్ చూస్తూ ఏడవడం తప్ప నీకు ఏమీ రాదు: రాఖీ సావంత్‌పై కంగనా ఫైర్

రాఖీ సావంత్ చేసిన వ్యాఖ్యలపై కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఘాటుగా స్పందించారు. "జీవితంలో ఏమీ సాధించలేకపోయిన అసూయాపరులు, వైఫల్యంతో ఉన్న వ్యక్తులు సక్సెస్‌లో ఉన్న మహిళల క్యారెక్టర్‌ను తక్కువ చేసి మాట్లాడటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వాళ్ల ఈగోని, ఈర్శ్యను సంతృప్తి పరచుకోవడానికే ఇలాంటి పనులు చేస్తారు" అని రాసుకొచ్చారు.

"విజయం సాధించడానికి నువ్వు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకో.. ఇక్కడ నీ అవసరం ఎవరికీ లేదు. నీలాంటి వాళ్లకు కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా ఇవ్వరు. ఎందుకంటే ఆ పని చేయడానికి కూడా కొంత టాలెంట్, క్వాలిటీ కావాలి. కాబట్టి కామ్ గా కూర్చుని నా రీల్స్ చూస్తూ ఏడవడం తప్ప నువ్వు ఏమీ చేయలేవు" అంటూ తీవ్రస్థాయిలో ఎద్దేవా చేశారు కంగనా.

'ఇండియాస్ గాట్ లేటెంట్' రగడ.. ప్రధాని మోదీ, స్మృతి ఇరానీపై రాఖీ వ్యాఖ్యలు

కంగనా రనౌత్ ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడానికి బలమైన కారణమే ఉంది. ఇటీవల ప్రాచుర్యం పొందిన యూట్యూబర్ సమయ్ రైనా నిర్వహించిన 'ఇండియాస్ గాట్ లేటెంట్' షోలో రాఖీ సావంత్ పాల్గొంది. ఈ షోలో బిజినెస్‌మ్యాన్ అష్నీర్ గ్రోవర్, కామెడీ ఆర్టిస్టులతో కలసి రాఖీ రచ్చ చేసింది.

కంగనా రనౌత్ ఇలా ఇండస్ట్రీలోని ప్రముఖులపై విరుచుకుపడటం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఢిల్లీలో జరిగిన సీజేపీ నిరసనలపై కంగనా మాట్లాడినప్పుడు రాఖీ సావంత్ ఒక వీడియో రిలీజ్ చేస్తూ కంగనాను "గట్టర్ మౌత్" అని సంబోధించింది. దీనిపై కూడా కంగనా గట్టిగానే సమాధానం ఇచ్చింది.

గతంలో తనను విమర్శించిన అశుతోష్ రాణా, సోనూ సూద్, తాప్సీ పన్నుల గురించి కంగనా ప్రస్తావిస్తూ.. "నా విజయంలో 1 శాతం కూడా సాధించని వాళ్ల అభిప్రాయాలు నాకు అనవసరం. ఫెయిల్ అయిన వ్యక్తులు, ఎవరూ పట్టించుకోని వాళ్లే నాపై ప్రతి రోజూ నిందలు వేస్తుంటారు. నా స్థాయికి చేరిన తర్వాతే నా గురించి మాట్లాడండి. లేకపోతే నోళ్లు మూసుకోండి" అని హెచ్చరించారు.

కంగనా పొలిటికల్ కెరీర్, రాబోయే ప్రాజెక్ట్స్

ఒక వైపు ఎంపీగా హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గ బాధ్యతలు చూసుకుంటూనే, మరోవైపు సినిమాల్లో కూడా కంగనా బిజీగా ఉంటున్నారు. ఇటీవల ఆమె నటించిన 'భారత్ భాగ్య విధాత' చిత్రం థియేటర్లలో సందడి చేసింది. అంతకుముందు 'ఎమర్జెన్సీ' సినిమాతో కూడా వచ్చినా అది ఆశించిన మేర సక్సెస్ కాలేదు.

మరోవైపు రాఖీ సావంత్ రోజూ ఇలాంటి కాంట్రవర్సీలతో వార్తల్లో నిలవడమే పనిగా పెట్టుకుందనే విమర్శలు ఉన్నాయి. ఏదేమైనా సక్సెస్ సాధించిన మహిళలపై బురదజల్లడాన్ని సహించేది లేదని కంగనా ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks