Rakhi Sawant: ఆ విడాకులు ఒక డ్రామా.. నువ్వో అబద్ధాలకోరు.. ఆకాంక్షపై రెచ్చిపోయిన రాఖీ సావంత్.. ఏం జరిగిందంటే?

Rakhi Sawant: ప్రముఖ టెలివిజన్ నటి ఆకాంక్ష చమోలా రియాలిటీ షో 'లాక్ అప్ సీజన్ 2' వేదికగా తన భర్త, నటుడు గౌరవ్ ఖన్నాతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేసింది. అయితే ఈ సంచలన ప్రకటనపై రాఖీ సావంత్ పెట్టిన సింగిల్ వర్డ్ కామెంట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

Published on: Jun 29, 2026, 12:15:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Rakhi Sawant: నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో గ్రాండ్‌గా ప్రారంభమైన మోస్ట్ కాంట్రవర్షియల్ రియాలిటీ షో 'లాక్ అప్ సీజన్ 2' (Lock Upp Season 2) ప్రీమియర్ ఎపిసోడ్‌లోనే ఒక ఊహించని బాంబ్ పేలింది. ప్రముఖ సీరియల్ నటి ఆకాంక్ష చమోలా (Akanksha Chamola) ఈ షో వేదికగా తన భర్త, పాపులర్ టీవీ నటుడు గౌరవ్ ఖన్నా (Gaurav Khanna) నుంచి విడాకులు తీసుకోబోతున్నట్లు ఆమె అధికారికంగా అనౌన్స్ చేశారు.

ఆ విడాకులు ఒక డ్రామా.. నువ్వో అబద్ధాలకోరు.. ఆకాంక్షపై రెచ్చిపోయిన రాఖీ సావంత్
ఆ విడాకులు ఒక డ్రామా.. నువ్వో అబద్ధాలకోరు.. ఆకాంక్షపై రెచ్చిపోయిన రాఖీ సావంత్

నువ్వో అబద్ధాలకోరు

ఆకాంక్ష విడాకుల ప్రకటన సోషల్ మీడియాలో సంచలనంగా మారినప్పటికీ, బాలీవుడ్ వివాదాస్పద నటి, డ్రామా క్వీన్ రాఖీ సావంత్ (Rakhi Sawant) మాత్రం ఈ మాటలను అస్సలు నమ్మడం లేదు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్‌పై రాఖీ స్పందిస్తూ ఒక్క ముక్కలో గట్టి కౌంటర్ ఇచ్చింది.

ఆ రీల్ కింద రాఖీ సావంత్.. "ఝూతీ" (Zuthi - అబద్ధాలకోరు) అని కామెంట్ చేస్తూ ఒక లాఫింగ్ ఎమోజీని జతచేసింది. షో మైలేజ్, ప్రమోషన్ స్ట్రాటజీ కోసమే ఆకాంక్ష ఇలాంటి అబద్ధాలు చెప్తోందని రాఖీ పరోక్షంగా తేల్చిపడేసింది. దీంతో నెటిజన్లు కూడా రాఖీ కామెంట్‌కు మద్దతు ఇస్తూ, ఇదంతా కేవలం టిఆర్‌పి రేటింగ్‌ల కోసమే ఆడుతున్న డ్రామా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఆకాంక్ష ఎమోషనల్ కామెంట్స్

ఈ ఓటీటీ రియాలిటీ షో మొదటి ఎపిసోడ్‌లోనే ఆకాంక్ష తన వైవాహిక బంధం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. "నేను, గౌరవ్ విడాకులు తీసుకోబోతున్నాం. గత ఏడాది కాలంగా మేమిద్దరం విడివిడిగానే జీవిస్తున్నాం. కానీ ఈ విషయాన్ని ఇప్పటివరకు ఎక్కడా పబ్లిక్ చేయలేదు.

మా ఇద్దరి మధ్య సంబంధాలు మరీ అంత దారుణంగా ఏమీ లేవు, ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటాం. అయితే పార్ట్‌నర్స్‌గా మా ఇద్దరి ఆలోచనలు, భవిష్యత్తు వేరువేరుగా ఉన్నాయి. మా మధ్య కాంపాటబిలిటీ లేకపోవడం వల్లే ఈ బాధాకరమైన నిర్ణయం తీసుకున్నాం’’ అని ఆకాంక్ష చెప్పడం బాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారింది.

ప్రస్తుతం గౌరవ్ ఖన్నా ప్రముఖ స్టంట్ రియాలిటీ షో ‘ఖత్రోన్ కే ఖిలాడీ 15’ లో కంటెస్టెంట్‌గా పాల్గొంటున్నాడు. ఈ విడాకుల విషయంపై ఆయన నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.

రాఖీ సావంత్ కామెంట్
రాఖీ సావంత్ కామెంట్

2016లో వివాహం

ఒక ఆడిషన్ సమయంలో కలిసిన ఆకాంక్ష, గౌరవ్ ఖన్నాలు కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసి 2016లో వివాహ బంధంతో ఒకటయ్యారు. ఆకాంక్ష గతంలో 'సంతోషి మా', 'యే హై ఆషికీ', 'క్రైమ్ పెట్రోల్' వంటి పాపులర్ షోలలో నటించింది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఆమె సోషల్ మీడియాలో "అవసరాల కోసమే బంధాలు ఏర్పడితే హృదయాలే బలి అవుతాయి" అని హిందీలో పెట్టిన ఒక క్రిప్టిక్ పోస్ట్ అప్పట్లో తీవ్ర దుమారం రేపింది.

అయితే అప్పట్లో అది తన రాబోయే వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసమేనని క్లారిటీ ఇచ్చింది. కానీ ఇప్పుడు నేరుగా నెట్‌ఫ్లిక్స్ లాక్ అప్ షోలో విడాకుల ప్రకటన చేయడంతో ఈ వ్యవహారం టెలివిజన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More