Vijay Trisha: విజయ్, త్రిష పెళ్లి చేసుకోవాలి..నేను మెహందీకి వెళ్లాలి..బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ రాఖీ సావంత్ సంచలన కామెంట్లు
Vijay Trisha: కోలీవుడ్ స్టార్స్ దళపతి విజయ్, త్రిషల మధ్య అఫైర్ ఉందంటూ వస్తున్న పుకార్లపై బాలీవుడ్ నటి రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని, తాను మెహందీ వేడుకకు వెళ్తానని ఆమె అనడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Vijay Trisha: తమిళ సినీ రంగంలో దళపతి విజయ్, త్రిషల ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీకి ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి వ్యక్తిగత జీవితాల గురించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. తాజాగా ఈ పుకార్లపై బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ రాఖీ సావంత్ తనదైన శైలిలో స్పందించి, కొత్త చర్చకు తెరలేపింది.

విజయ్, త్రిష పెళ్లి
తాజాగా ఫిల్మీమంత్రతో మాట్లాడిన రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. "విజయ్, త్రిష త్వరగా పెళ్లి చేసుకోవాలని నేను కోరుకుంటున్నా. వారి మెహందీ వేడుకకు నేను తప్పకుండా హాజరవుతా" అని రాఖీ తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు రాఖీ వ్యాఖ్యలపై భిన్నంగా స్పందిస్తున్నారు.
విజయ్ విజయంపై ప్రశంసలు
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ సాధించిన విజయాన్ని రాఖీ సావంత్ ప్రశంసించింది. తమిళనాడు రాజకీయాల్లో ఇంత పెద్ద సంఖ్యలో సీట్లు గెలుచుకున్న మొదటి క్రైస్తవ వ్యక్తి విజయ్ అని ఆమె పేర్కొంది. వ్యక్తిగతంగా తనకు విజయ్ అంటే చాలా ఇష్టమని, ఆయనతో కలిసి ఒక స్పెషల్ సాంగ్ చేయాలనేది తన చిరకాల కోరికని వెల్లడించింది.
పార్టీలో చేరతా
ఇప్పుడు ఎలాగో విజయ్ తో కలిసి డ్యాన్స్ చేసే అవకాశం లేదని రాఖీ సావంత్ ఫీల్ అయింది. అయితే ఆ లోటు పూడ్చుకోవడానికి విజయ్ స్థాపించిన టీవీకే పార్టీలో చేరాలనుకుంటున్నట్లు ఆమె తన మనసులోని మాటను బయటపెట్టింది.
ఆ సినిమాలతో
విజయ్, త్రిషల జోడీకి 2004లో వచ్చిన 'గిల్లి' సినిమాతో భారీ క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత 'తిరుపాచ్చి' (2005), 'ఆది' (2006), 'కురువి' (2008) వంటి సినిమాలతో ఈ కాంబినేషన్ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంది. అయితే 'కురువి' సినిమా సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందంటూ ప్రచారం మొదలైంది. అప్పటికే విజయ్‌కు సంగీత సోర్నలింగంతో వివాహం జరిగినప్పటికీ, అభిమానులు మాత్రం ఈ జంటను చూసి మురిసిపోయేవారు.
15 ఏళ్ల గ్యాప్
త్రిషతో రిలేషన్ షిప్ పుకార్లు విజయ్ వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపడంతో, ఆయన త్రిషతో కలిసి నటించడం ఆపేశాడు. సుమారు 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 2023లో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'లియో' సినిమా కోసం ఈ హిట్ జోడీ మళ్ళీ వెండితెరపై మెరిసింది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు మళ్ళీ ఊపందుకున్నాయి. ఇప్పుడు రాఖీ సావంత్ చేసిన వ్యాఖ్యలు ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్లయింది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: విజయ్, త్రిష కలిసి నటించిన గత సినిమాలు ఏవి?
జవాబు: వీరిద్దరూ గిల్లి, తిరుపాచ్చి, ఆది, కురువి, ఇటీవల వచ్చిన లియో వంటి విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించారు.
ప్రశ్న: రాఖీ సావంత్ దళపతి విజయ్ గురించి ఏం చెప్పింది?
జవాబు: విజయ్ రాజకీయ విజయాన్ని అభినందించిన రాఖీ, ఆయన పార్టీలో చేరాలని ఉందని, అలాగే త్రిషతో ఆయన పెళ్లి చూడాలని ఉందని పేర్కొంది.
ప్రశ్న: విజయ్, త్రిష మధ్య ఎన్ని ఏళ్ల పాటు గ్యాప్ వచ్చింది?
జ: కురువి (2008) తర్వాత మళ్ళీ లియో (2023) వరకు అంటే దాదాపు 15 ఏళ్ల పాటు వీరిద్దరూ కలిసి ఏ సినిమాలోనూ నటించలేదు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


