విజయ్ అనే నేను.. టీవీకేకు లైన్ క్లీయర్.. ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్!
CM Vijay : తమిళనాడులో నెంబర్ పాలిటిక్స్‌కు తెరపడింది. టీవీకే విజయ్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కేందుకు లైన్ క్లియర్ అయింది.
తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) ప్రభుత్వ ఏర్పాటుకు విడుతలై చిరుతైగల్ కట్చి (VCK) బేషరతుగా మద్దతు ప్రకటించింది. ఈ పరిణామంతో విజయ్ ముఖ్యమంత్రి కావడానికి మార్గం సుగమమైంది. శనివారం జరిగిన కీలక చర్చల అనంతరం ఈ నిర్ణయం వెలువడింది.

విజయ్ ప్రమాణస్వీకారానికి డేట్ కూడా ఫిక్స్ అయింది. ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి గవర్నర్ రాజేంద్ర అర్లెకర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏప్రిల్ 10వ తేదీన ఉదయం 10 గంటలకు చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం చేస్తారు. మే 13వ తేదీలోగా బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ సూచించారు.
శనివారం వీసీకే పార్టీ మద్దతు ప్రకటించగా, వెంటనే మరో మిత్రపక్షమైన ఐయూఎంఎల్ (IUML) కూడా టీవీకేకు జై కొట్టింది. ఈ రెండు పార్టీల మద్దతుతో టీవీకే బలం 120కి చేరింది. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 118 సీట్ల కంటే రెండు సీట్లు అదనంగా విజయ్ ఖాతాలో చేరాయి.
టీవీకే నేత ఆధవ్ అర్జున మీడియాతో మాట్లాడుతూ.. వీసీకే తమకు మద్దతు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తమ పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ త్వరలోనే ముఖ్యమంత్రి కాబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వీసీకే శాసనసభాపక్ష నేత వన్ని అరసు ఇప్పటికే గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌కు మద్దతు లేఖను పంపారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, వీసీకే అధినేత తిరుమావళవన్‌కు టీవీకే కృతజ్ఞతలు తెలిపింది.
ప్రస్తుతానికి వీసీకే పార్టీ ప్రభుత్వంలో చేరకుండా కేవలం బయటి నుంచే మద్దతు ఇస్తుందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. విజయ్ రెండు నియోజకవర్గాల నుంచి గెలుపొందారు. నిబంధనల ప్రకారం ఆయన ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అప్పుడు టీవీకే బలం 107కి తగ్గినప్పటికీ, మిత్రపక్షాల (కాంగ్రెస్ - 5, సీపీఐ - 2, సీపీఎం - 2, వీసీకే - 2, ఐయూఎంఎల్ - 2) మద్దతుతో మొత్తం 120 మంది ఎమ్మెల్యేల అండ విజయ్ కు ఉంటుంది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభం కాబోతోంది. దళపతి విజయ్ తన తొలి ఎన్నికల్లోనే ప్రభంజనం సృష్టించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతుండటంతో ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


