Amitabh Bachchan: 83 ఏళ్ల వయసులోనూ 24 గంటలూ పని.. అసలు రెస్ట్ ఉండటం లేదంటున్న మెగాస్టార్

Amitabh Bachchan: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 83 ఏళ్ల వయసులోనూ 24 గంటల షిఫ్ట్ లతో బిజీగా గడుపుతున్న న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆయనే ఈ పోస్ట్ చేయడంతో సోసల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చే నడుస్తోంది.

Published on: Aug 10, 2026, 18:26:28 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Amitabh Bachchan: ఇండియన్ సినిమా దశాబ్దాల చరిత్రలో తిరుగులేని సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న బిగ్ బి అమితాబ్ బచ్చన్ (83) చేసిన తాజా పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వరుసగా 24 గంటల పాటు నాన్ స్టాప్ షూటింగ్స్ చేస్తూ నిద్రకు, ఆహారానికి దూరమవుతున్నట్లు ఆయన తన అధికారిక టంబ్లర్ (Tumblr) బ్లాగ్‌లో వెల్లడించారు.

Amitabh Bachchan: 83 ఏళ్ల వయసులోనూ 24 గంటలూ పని.. అసలు రెస్ట్ ఉండటం లేదంటున్న మెగాస్టార్
Amitabh Bachchan: 83 ఏళ్ల వయసులోనూ 24 గంటలూ పని.. అసలు రెస్ట్ ఉండటం లేదంటున్న మెగాస్టార్

రోజూ అభిమానులతో ముచ్చటించే అమితాబ్, గత కొన్ని రోజులుగా పోస్ట్‌లు సరిగ్గా పెట్టలేకపోతున్నందుకు విచారం వ్యక్తం చేశారు. ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్తూ ఆయన రాసిన సుదీర్ఘ లేఖ ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఉదయం 7 నుంచి మరుసటి రోజు ఉదయం 7 వరకు..

స్టేజ్ ఏదైనా, క్యారెక్టర్ ఏదైనా వంద శాతం డెడికేషన్‌తో పనిచేసే అమితాబ్ బచ్చన్ తన పని వేళల గురించి సంచలన విషయాలు పంచుకున్నారు. "గత కొన్ని రోజులుగా పని తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉదయం 7 గంటలకు షూటింగ్ ప్రారంభమైతే మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు నాన్ స్టాప్‌గా సాగుతోంది" అని చెప్పారు.

ఇచ్చిన కమిట్‌మెంట్స్ కాపాడుకోవడమే తనకు ముఖ్యమని, అందుకోసమే నిద్ర, ఆహారం పక్కనబెట్టి వర్క్ చేయాల్సి వస్తోందని బిగ్ బి పేర్కొన్నారు. బ్లాగ్ నంబరింగ్‌లో తప్పులు దొర్లినా, పోస్ట్‌లు ఆలస్యమైనా అభిమానులు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈరోజే కేబీసీ 18 గ్రాండ్ లాంచ్.. వర్క్ లేకపోతే ఆందోళన

ఇంతటి బిజీ షెడ్యూల్ మధ్యలోనే బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' (KBC) 18వ సీజన్ ప్రారంభం కాబోతోంది. సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్, సోనీ లివ్ (Sony LIV)లో ఈరోజే (ఆగస్టు 10) రాత్రి 9 గంటలకు కేబీసీ 18 గ్రాండ్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈసారి 'సోచ్నా పడేగా' అనే కొత్త థీమ్‌తో షో నడవనుంది.

తనకు ఒక్క రోజు వర్క్ లేకపోయినా తీవ్రమైన ఆందోళన కలుగుతుందని అమితాబ్ గతంలోనే చెప్పారు. "ఒక్క రోజు ఖాళీగా ఉన్నా నా రోజువారీ రొటీన్ మొత్తం దెబ్బతింటుంది. క్రమం తప్పకుండా పనిచేయడమే నన్ను నిలబెడుతోంది" అని బిగ్ బి తన వర్క్ హోలిక్ నైజాన్ని గుర్తుచేసుకున్నారు.

కల్కి సీక్వెల్ షూటింగ్‌లో బిజీగా అశ్వత్థామ

రీసెంట్‌గా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన గ్లోబల్ విజువల్ వండర్ 'కల్కి 2898 ఏడీ' సినిమాలో అశ్వత్థామగా అమితాబ్ చేసిన యాక్షన్ పెర్ఫార్మెన్స్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. 80 ఏళ్ల వయసు దాటినా కూడా యంగ్ హీరోలకు పోటీగా ఆయన చేసిన ఇంటెన్స్ ఫైట్స్, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను మైమరిపించాయి.

ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామా సీక్వెల్ 'కల్కి 2' షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. కేబీసీ షో షూటింగ్‌తో పాటు కల్కి సీక్వెల్ కోసం కూడా అమితాబ్ సుదీర్ఘ సమయం కేటాయిస్తుండటంతో ఈ రేంజ్ హెవీ వర్క్ షెడ్యూల్ నడుస్తోంది. 83 ఏళ్ల వయసులో కూడా ఆయన చూపుతున్న ఈ వర్క్ ఎథిక్స్ చూసి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం షాక్ అవుతోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More