బాలీవుడ్ గాయకుడు, సంగీత దర్శకుడు సచిన్ సాంగ్వి (సచిన్-జిగర్ ద్వయంలో ఒకరు) ఒక మహిళను లైంగికంగా వేధించిన ఆరోపణలపై అరెస్ట్ అయ్యాడు. ఒక మ్యూజిక్ ఆల్బమ్‌లో అవకాశం ఇస్తానని, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మోసం చేశాడని పోలీసులు శుక్రవారం(అక్టోబర్ 24) తెలిపారు. నిజానికి గురువారమే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
సచిన్‌పై ఉన్న ఆరోపణలు ఇవీ..

బాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లలో సచిన్ సాంగ్వి ఒకడు. సచిన్, జిగర్ ద్వయం ఎన్నో హిట్ సాంగ్స్ అందించారు. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం, అరెస్ట్ కావడం సంచలనం సృష్టిస్తోంది. అసలు అతనిపై వచ్చిన ఫిర్యాదులో ఏముంది? అతని లాయర్ ఆ ఆరోపణలకు ఎలా స్పందించారు అనే వివరాలు ఇక్కడ ఉన్నాయి.
ఫిర్యాదు చేసింది ఓ 20 ఏళ్ల అమ్మాయి. గతేడాది ఫిబ్రవరిలో సచిన్ ఆమెను సంప్రదించాడని పీటీఐ రిపోర్టు తెలిపింది. సచిన్ ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సందేశం పంపాడు. సచిన్ ఆమెను సంప్రదించి, తన రాబోయే మ్యూజిక్ ఆల్బమ్‌లో ఛాన్స్ ఇస్తానని హామీ ఇచ్చాడు. ఆ తర్వాత ఇద్దరూ ఫోన్ నంబర్లు మార్చుకున్నారని ఒక పోలీసు అధికారి తెలిపారు.
అంతేకాదు సచిన్ ఆమెను తన మ్యూజిక్ స్టూడియోకు పిలిపించి, అక్కడ పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు. సచిన్ ఆమెను చాలాసార్లు లైంగికంగా వేధించాడని కూడా ఆరోపణలు ఉన్నాయి.
సచిన్ లాయర్ స్పందన
ఈ కేసులో సంగీత దర్శకుడు సచిన్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న లాయర్ ఆదిత్య మిథే.. ఫిర్యాదుదారు చేసిన ఆరోపణలను ఖండించారు. ప్రెస్‌తో మాట్లాడుతూ మిథే ఇలా అన్నారు.. "నా క్లయింట్‌పై ఎఫ్‌ఐఆర్ లో ఉన్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి, అవాస్తవమైనవి. ఈ కేసులో ఎటువంటి నిజాలు లేవు" అని అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ.. "పోలీసులు నా క్లయింట్‌ను నిర్బంధించడం చట్టవిరుద్ధం. అందుకే అతన్ని వెంటనే బెయిల్‌పై విడుదల చేశారు. మేము అన్ని ఆరోపణలను పూర్తిగా, నిస్సందేహంగా డిఫెండ్ చేసుకోవాలని అనుకుంటున్నాము" అని తెలిపారు.
{{/usCountry}}ఆయన ఇంకా మాట్లాడుతూ.. "పోలీసులు నా క్లయింట్‌ను నిర్బంధించడం చట్టవిరుద్ధం. అందుకే అతన్ని వెంటనే బెయిల్‌పై విడుదల చేశారు. మేము అన్ని ఆరోపణలను పూర్తిగా, నిస్సందేహంగా డిఫెండ్ చేసుకోవాలని అనుకుంటున్నాము" అని తెలిపారు.
{{/usCountry}}ఈ విషయంపై సచిన్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అతని అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా.. @soulfulsachin పేరుతో ఉంది. అది ప్రస్తుతం డీయాక్టివేట్ చేశారు. జిగర్ కూడా ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
సచిన్, జిగర్ కలిసి ఈ మధ్యే వచ్చిన థామా మూవీకి మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో నటించారు. సచిన్-జిగర్ కంపోజ్ చేసిన స్త్రీ 2 మూవీలోని ఆజ్ కీ రాత్ సాంగ్ గతేడాది పెద్ద సంచలనం సృష్టించింది.