Govinda Wife: బాలీవుడ్ ఐకానిక్ కామెడీ కింగ్ గోవిందా, ఆయన భార్య సునీతా అహుజాల విడాకుల డ్రామాలో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల క్రితం ఫ్యామిలీ కోర్టులో వేసిన విడాకుల పిటిషన్‌ను సునీత ముంబై బాంద్రా ఫ్యామిలీ కోర్టులో సడన్‌గా వెనక్కి తీసుకోగా.. ఈ వివాదంలో డ్రామా క్వీన్ రాఖీ సావంత్ ఎంట్రీ ఇచ్చి సంచలన వ్యాఖ్యలు చేసింది. "రూ. 200 కోట్ల ఆస్తిని ముందు కాపాడుకో" అంటూ సునీతకు రాఖీ ఇచ్చిన ఫోన్ కాల్ సలహా వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.
రెండో పెళ్లి ప్లాన్.. అందుకే విడాకుల కేస్ విత్‌డ్రా

ముంబైలో ఫొటోగ్రాఫర్ల ముందే సునీతా అహుజాకు రాఖీ సావంత్ స్పీకర్ ఫోన్ కాల్ చేసింది. ఈ సంభాషణలో విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకోవడానికి గల కారణాన్ని సునీత ఓపెన్‌గా బయటపెట్టింది.
గోవిందా, ఆయన కొత్త సినిమా హీరోయిన్ కోమల్ రాణి స్వర్ణకార్‌ను పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారనే సమాచారం రావడం వల్లే తాను విడాకుల కేస్ విత్‌డ్రా చేసుకున్నట్లు సునీత ఆడియో కాల్‌లో స్పష్టం చేసింది. తాను విడాకులు ఇస్తే వాళ్లు పెళ్లి చేసుకుంటారని, అందుకే ఆ ఛాన్స్ ఇవ్వకుండా కేస్ ఉపసంహరించుకున్నానని చెప్పింది.
"రూ. 200 కోట్ల ఆస్తి నీ పేరున రాసేసుకో"
సునీత మాటలు వినగానే రాఖీ సావంత్ ఆమెకు ఒక ప్రాక్టికల్ మైండ్ బ్లోయింగ్ సలహా ఇచ్చింది. "నువ్వు పర్సనల్ గొడవలన్నీ పక్కన పెట్టి గోవిందాకు ఉన్న రూ. 200 కోట్ల ప్రాపర్టీస్‌పై ఫోకస్ చెయ్" అంటూ రాఖీ ఉచిత సలహా ఇచ్చింది.
"వేరే ఎవరో వచ్చి ఆ ఆస్తిని ఎగరేసుకొని వెళ్లక ముందే లీగల్‌గా అంతా నీ పేరు మీదికి, పిల్లల పేరు మీదికి మార్పించుకో. ప్లీజ్ నా మాట విను" అంటూ రాఖీ హెచ్చరించింది. ఇంట్లో ఉండే భార్య ఎప్పుడూ తప్పు చేయదని, తాను సునీత వైపే ఉంటానని రాఖీ బహిరంగంగా మీడియా ముందు ప్రకటించింది.
'షుగర్ డాడీ' కామెంట్స్.. గోవిందా సీరియస్ రియాక్షన్
ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో గోవిందా, యంగ్ నటి కోమల్ రాణి కలిసి కనిపించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై సునీత తీవ్రంగా స్పందిస్తూ గోవిందాని 'షుగర్ డాడీ' అని సంబోధించింది. తన కూతురు వయసు ఉన్న అమ్మాయితో డ్రెస్సింగ్ సెన్స్ లేకుండా తిరుగుతున్నాడని మండిపడింది.
{{/usCountry}}ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో గోవిందా, యంగ్ నటి కోమల్ రాణి కలిసి కనిపించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై సునీత తీవ్రంగా స్పందిస్తూ గోవిందాని 'షుగర్ డాడీ' అని సంబోధించింది. తన కూతురు వయసు ఉన్న అమ్మాయితో డ్రెస్సింగ్ సెన్స్ లేకుండా తిరుగుతున్నాడని మండిపడింది.
{{/usCountry}}ఈ వ్యాఖ్యలపై గోవిందా కూడా ఘాటుగానే స్పందించాడు. ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తాను 'రూపా' (Roopa) అనే సినిమాతో కమ్‌బ్యాక్ ఇస్తున్నానని, ఇలాంటి సమయంలో తన ఇమేజ్‌ను, బిజినెస్‌ను దెబ్బతీయవద్దని భార్యను వేడుకున్నాడు. పేద కుటుంబాల నుంచి వచ్చే కొత్త నటులను అవమానించవద్దని కోరాడు.
ఏడేళ్ల తర్వాత గోవిందా కమ్‌బ్యాక్ మూవీ
1990ల కాలంలో బాలీవుడ్‌ను తన డ్యాన్స్, కామెడీ టైమింగ్‌తో ఊపేసిన గోవిందా, చాలా కాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్నాడు. తన సొంత బ్యానర్‌లో 'రూపా' అనే లేడీ ఓరియంటెడ్ సినిమా ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు.
ఈ సినిమా ద్వారానే కోమల్ రాణి స్వర్ణకార్ కథానాయికగా పరిచయం కాబోతోంది. సినిమా సెట్స్‌పైకి వెళ్లే టైమ్‌లోనే ఈ రేంజ్ పర్సనల్ కాంట్రవర్సీలు, రూ. 200 కోట్ల ఆస్తుల వివాదం రచ్చకెక్కడంతో బాలీవుడ్ సినీ వర్గాలు షాక్ అవుతున్నాయి.