వాళ్లందరూ యాంటీ నేషనల్స్.. కావాలనే ఆ హీరోను టార్గెట్ చేస్తున్నారు: బోర్డర్ 2 మూవీ ప్రొడ్యూసర్ ఘాటు కామెంట్స్

బోర్డర్ 2 మూవీ ప్రొడ్యూసర్ నిధి దత్తా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తమ సినిమాలోని ఘర్ కబ్ ఆవోగే పాటలో వరుణ్ ధావన్ ఎక్స్‌ప్రెషన్స్ చూసి అతన్ని ట్రోల్ చేస్తున్న వారిని యాంటీ నేషనల్స్ గా అభివర్ణించడం గమనార్హం.

Published on: Jan 8, 2026, 20:46:56 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

'బోర్డర్ 2' (Border 2) సినిమాలోని 'ఘర్ కబ్ ఆవోగే' పాట రిలీజ్ అయినప్పటి నుంచి హీరో వరుణ్ ధావన్ సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. పాటలో వరుణ్ హావభావాలు బాగోలేవంటూ మీమ్స్ వస్తున్నాయి. అయితే ఇదంతా కావాలని, డబ్బు తీసుకొని చేస్తున్న తప్పుడు ప్రచారం అని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన నిర్మాత నిధి దత్తా ట్రోలర్లపై మండిపడింది. దేశం కోసం ప్రాణాలిచ్చిన వీరుడి పాత్రను పోషిస్తున్న నటుడిపై ఇలాంటి కుట్రలు చేసేవాళ్లు 'దేశద్రోహులు' (యాంటీ నేషనల్స్) అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

వాళ్లందరూ యాంటీ నేషనల్స్.. కావాలనే ఆ హీరోను టార్గెట్ చేస్తున్నారు: బోర్డర్ 2 మూవీ ప్రొడ్యూసర్ ఘాటు కామెంట్స్
వాళ్లందరూ యాంటీ నేషనల్స్.. కావాలనే ఆ హీరోను టార్గెట్ చేస్తున్నారు: బోర్డర్ 2 మూవీ ప్రొడ్యూసర్ ఘాటు కామెంట్స్

వరుణ్ ధావన్ ట్రోలింగ్.. ప్రొడ్యూసర్ రియాక్షన్

సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్ నటిస్తున్న బోర్డర్ 2 ఓ భారీ మల్టీస్టారర్. ఈ సినిమాపై నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని మేకర్స్ సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాలో కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్లు డబ్బులు తీసుకుని మరీ వరుణ్ ధావన్‌ను టార్గెట్ చేస్తున్నారని, బాడీ షేమింగ్ చేస్తున్నారని ఒక 'ఎక్స్' యూజర్ పోస్ట్ చేశారు. దీనిపై నిర్మాత నిధి దత్తా తీవ్రంగా స్పందించింది.

"ఈ దేశపు పరమ వీర చక్ర (పీవీసీ) గ్రహీత పాత్రను పోషిస్తున్న ఒక నటుడిని దెబ్బతీయడానికి డబ్బులు ఖర్చు చేస్తున్న ఆ 'దేశద్రోహులకు' (యాంటీ నేషనల్స్) కంగ్రాట్స్. ఇది మీ సినిమా ఇండియా.. ఇలాంటి వాళ్లను ప్రజలే తరిమికొట్టాలి" అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.

కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్లకు మెసేజ్‌లు చేసి మరీ వరుణ్ ఎక్స్‌ప్రెషన్స్‌ను విమర్శించమని ఆర్డర్లు ఇచ్చినట్లుగా ఉన్న కొన్ని స్క్రీన్ షాట్లు కూడా రెడిట్ (Reddit)లో వైరల్ అవుతున్నాయి.

వరుణ్ ధావన్ 'కూల్' రిప్లై

ఇంత జరుగుతున్నా వరుణ్ ధావన్ మాత్రం చాలా కూల్‌గా స్పందించాడు. "భయ్యా.. నీ యాక్టింగ్ మీద జనాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు కదా.. ఏమంటావ్?" అని ఒక నెటిజన్ అడగగా.. "ఆ ప్రశ్నలే ఈ పాటను సూపర్ హిట్ చేశాయి. దేవుడి దయ వల్ల ఇప్పుడు అందరూ ఈ పాటను ఎంజాయ్ చేస్తున్నారు" అని పాజిటివ్‌గా సమాధానం ఇచ్చాడు వరుణ్.

'బోర్డర్ 2' విశేషాలు

బోర్డర్ 2 మూవీలో సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహాన్ శెట్టి నటించారు. 1971 ఇండియా-పాకిస్థాన్ యుద్ధం ఆధారంగా తెరకెక్కిన ఎపిక్ వార్ డ్రామా ఇది. 1997లో వచ్చిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ 'బోర్డర్'కు ఇది సీక్వెల్. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 23న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే బోర్డర్ మూవీలో సందేశే ఆతే హై సాంగ్ కు కొనసాగింపుగా బోర్డర్ 2 నుంచి ఘర్ కబ్ ఆవోగే అనే సాంగ్ రిలీజ్ కాగా.. అది బాగా హిట్ అయింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More