మా దేశంలో బోర్డర్ 2 రిలీజ్ ఎప్పుడు? పాకిస్థాన్ ఫ్యాన్ ప్ర‌శ్న‌.. స్టార్ హీరో స‌మాధాన‌మిదే!

వరుణ్ ధావన్, సన్నీ డియోల్ నటించిన సీక్వెల్ బోర్డర్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది 1971 ఇండో-పాక్ వార్ చుట్టూ సాగుతుంది. ఈ మూవీ తమ దేశంలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని పాకిస్థాన్ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు స్టార్ హీరో వరుణ్ సమాధానం వైరల్ గా మారింది.

Published on: Jan 7, 2026, 09:53:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వరుణ్ ధావన్, సన్నీ డియోల్, దిల్జిత్ దోసాంజ్, అహాన్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ బోర్డర్ 2. 1997లో వచ్చిన బ్లాక్ బస్టర్ బోర్డర్ సినిమాకు ఇది సీక్వెల్. 1971 ఇండో-పాక్ యుద్ధం కథ చుట్టూ ఈ బోర్డర్ 2 సాగుతుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ పై పాకిస్థాన్ ఫ్యాన్ ఓ ప్రశ్న అడిగాడు. దీనిపై స్టార్ హీరో వరుణ్ ధావన్ రిప్లే వైరల్ గా మారింది.

సన్నీ డియోల్, వరుణ్ ధావన్ (PTI)
సన్నీ డియోల్, వరుణ్ ధావన్ (PTI)

బోర్డర్ 2 రిలీజ్ ఎప్పుడు?

బోర్డర్ 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా జనవరి 23న రిలీజ్ కానుంది. అయితే పాకిస్థాన్ లో రిలీజ్ గురించి ఆ దేశానికి చెందిన ఓ యూజర్ అడిగాడు. వరుణ్ మంగళవారం (జనవరి 6) తన ఎక్స్ హ్యాండిల్ (గతంలో ట్విట్టర్) అభిమానులతో ముచ్చటించాడు. పాకిస్థాన్ అభిమాని ప్రశ్నపై వరుణ్ ధావన్ స్పందించాడు. అభిమానుల ఇంటరాక్షన్ సందర్భంగా, అలీ హైదర్ మీరానీ అనే ఎక్స్ వినియోగదారు తన బయోలో తాను పాకిస్తాన్ లోని సింధ్ కు చెందినవాడినని పేర్కొన్నాడు.

పాకిస్థాన్ లో ఎప్పుడు?

సన్నీ డియోల్ పట్ల తన ప్రేమను వ్యక్తం చేశాడు పాకిస్థాన్ ఫ్యాన్ అలీ హైదర్. ‘‘భాయ్ ఆప్కీ బోర్డర్ 2 పాకిస్తాన్ మే కబ్ రిలీజ్ హోగి ఔర్ మెయిన్ తారా సింగ్ కా బహుత్ బడా ఫ్యాన్ హూన్, ఉన్కో మేరా సలామ్ కెహ్నా (సోదరా, బోర్డర్ 2 పాకిస్తాన్ లో ఎప్పుడు విడుదల అవుతుంది? నేను తారా సింగ్ (సన్నీ డియోల్)కు పెద్ద అభిమానిని, దయచేసి ఆయనకు నా శుభాకాంక్షలు తెలియజేయండి’’ అని అడిగాడు అలీ.

వరుణ్ సమాధానం

"బోర్డర్ 2 సినిమా 1971 యుద్ధం, దాని చుట్టూ ఉన్న కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం. సన్నీ సర్ కే పాకిస్తాన్ మే భీ ఫ్యాన్ హై (సన్నీ సర్ కు పాకిస్తాన్ లో కూడా అభిమానులు ఉన్నారు)" అని వరుణ్ ధావన్ బదులిచ్చాడు. ఇండియన్ హిందీ సినిమాలకు పాకిస్థాన్ లోనూ ఫ్యాన్స్ ఉన్నారనే సంగతి తెలిసిందే.

బోర్డర్ 2 గురించి

2026లో రిలీజ్ కానున్న అతిపెద్ద సీక్వెల్ మూవీస్ లో ఒకటిగా బోర్డర్ 2ను చూస్తున్నారు. 1997లో బోర్డర్ రిలీజైంది. ఈ చిత్రంలో మోనా సింగ్, సోనమ్ బజ్వా, మేధా రాణా, అన్యా సింగ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో సన్నీ డియోల్ లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ కలేర్ పాత్రలో కనిపించనున్నారు. వరుణ్ ధావన్ మేజర్ హోషియార్ సింగ్ దహియా పాత్రలో నటించారు. 'బోర్డర్ 2' జనవరి 23న థియేటర్లలోకి రానుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More