ఇండియన్ సినిమా చరిత్రలో ఐకానిక్ వార్ మూవీగా నిలిచిన 'బోర్డర్' (1997) చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న 'బోర్డర్ 2' (Border 2) టీజర్ విడుదలైంది. విజయ్ దివస్ (డిసెంబర్ 16) సందర్భంగా విడుదలైన ఈ టీజర్‌లో సన్నీ డియోల్ మరోసారి తన పవర్ ప్యాక్డ్ డైలాగ్స్‌తో అదరగొట్టడం చూడొచ్చు. వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్, అహాన్ శెట్టిలతో కూడిన ఈ టీజర్ 1971 యుద్ధ వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది.
బోర్డర్ 2 టీజర్ ఇలా..

దేశభక్తి చిత్రాల అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'బోర్డర్ 2' టీజర్ మంగళవారం (డిసెంబర్ 16) ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో విడుదలైంది. 1971 ఇండో-పాక్ యుద్ధంలో భారత విజయాన్ని గుర్తుచేసుకునే 'విజయ్ దివస్' రోజున మేకర్స్ ఈ టీజర్‌ను వదలడం విశేషం.
బోర్డర్ 2 టీజర్ మొదలవ్వడమే 1971 యుద్ధ దృశ్యాలతో మొదలవుతుంది. సన్నీ డియోల్ వాయిస్ ఓవర్‌తో.. పాకిస్థాన్ సైన్యం ఇండియాలోకి చొరబడటానికి సాహసిస్తే ఏం జరుగుతుందో హెచ్చరిస్తాడు.
తన సైనికులతో సన్నీ చెప్పే డైలాగ్ హైలైట్.. "ఎంత గట్టిగా అరవాలంటే.. ఆ శబ్దం లాహోర్ వరకు వినిపించాలి" అని చెప్పే సీన్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. కేవలం నేల మీదే కాకుండా.. ఆకాశంలో, సముద్రం మీద జరిగే యుద్ధ సన్నివేశాలను కూడా టీజర్‌లో చూపించారు.
టీజర్ చివరలో వచ్చే టైటిల్ కార్డ్ వెనుక.. మొదటి పార్ట్‌లోని ఐకానిక్ సాంగ్ 'హిందుస్థాన్ మేరీ జాన్' ట్యూన్ వినిపించడం ప్రేక్షకులను ఎమోషనల్ చేస్తోంది.
బోర్డర్ 2 మూవీ గురించి..
జే.పీ. దత్తా సమర్పణలో అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ బోర్డర్ 2 చిత్రంలో ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్, సునీల్ శెట్టి కుమారుడు అహాన్ శెట్టి లీడ్ రోల్స్ లో నటించారు. ఇక వీళ్లతోపాటు సోనమ్ బజ్వా, మోనా సింగ్, మేధా రాణా తదితరులు నటిస్తున్నారు.
రిపబ్లిక్ డే వీకెండ్ సందర్భంగా జనవరి 23, 2026న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. 1997లో వచ్చిన 'బోర్డర్' ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ సీక్వెల్ కూడా అదే స్థాయి అంచనాలతో వస్తోంది.
{{/usCountry}}రిపబ్లిక్ డే వీకెండ్ సందర్భంగా జనవరి 23, 2026న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. 1997లో వచ్చిన 'బోర్డర్' ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ సీక్వెల్ కూడా అదే స్థాయి అంచనాలతో వస్తోంది.
{{/usCountry}}