Brahmamudi Serial: బ్రహ్మముడి సీరియల్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్..ఇక నుంచి సీరియల్ అరగంట కాదు 45 నిమిషాలు..ఎప్పుడంటే?

Brahmamudi Serial Timing: స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతున్న పాపులర్ సీరియల్ బ్రహ్మముడిని ఫాలో అయ్యే ఫ్యాన్స్ కు ఇది గుడ్ న్యూస్. ఇక నుంచి బ్రహ్మముడి సీరియల్ వచ్చేది కేవలం 30 నిమిషాలు మాత్రమే కాదు. 45 నిమిషాల పాటు ప్రతి ఒక్క ఎపిసోడ్ టీవీలో ప్రసారం కానుంది. 

Published on: Oct 11, 2026, 19:47:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Brahmamudi Serial Timing: బుల్లితెర ప్రేక్షకులను తనదైన కథనంతో కట్టిపడేస్తున్న పాపులర్ సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi) మరో సంచలన అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. స్టార్ మా ఛానల్‌లో టాప్ రేటింగ్‌తో దూసుకుపోతున్న ఈ సీరియల్, ఇప్పుడు అభిమానుల కోసం మరింత వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది.

బ్రహ్మముడి సీరియల్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్..ఇక నుంచి సీరియల్ అరగంట కాదు 45 నిమిషాలు..ఎప్పుడంటే?
బ్రహ్మముడి సీరియల్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్..ఇక నుంచి సీరియల్ అరగంట కాదు 45 నిమిషాలు..ఎప్పుడంటే?

బ్రహ్మముడి సీరియల్ అప్డేట్

ఇప్పటివరకు సాధారణ సమయంతో 30 నిమిషాల పాటు అలరించిన ఈ బ్రహ్మముడి సీరియల్ ఇకపై 45 నిమిషాల పాటు ప్రసారం కానుంది. ఈ సీరియల్ సరికొత్త మలుపులతో, ఊహించని ట్విస్టులతో మిమ్మల్ని అలరించడానికి ఎక్స్ ట్రా టైమ్ రాబోతోంది. ప్రేక్షకుల నుంచి వస్తున్న విశేష ఆదరణను దృష్టిలో ఉంచుకుని మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఎక్స్‌ట్రా ఎంటర్‌టైన్‌మెంట్

ఈ ఎక్స్‌ట్రా టైమ్ ద్వారా బ్రహ్మముడి సీరియల్ కథలో మరిన్ని కీలక పరిణామాలు, ఆసక్తికరమైన డ్రామాను జోడించి ప్రేక్షకులకు ఎక్స్‌ట్రా ఎంటర్‌టైన్‌మెంట్ అందించనున్నారు. ముఖ్యంగా కావ్య, రాజు పాత్రల మధ్య వచ్చే సరికొత్త సీన్లు వీక్షకులను మరింతగా ఆకట్టుకోనున్నాయి.

ఎప్పుడంటే?

బ్రహ్మముడి సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12:45 గంటలకు స్టార్ మా సీరియల్ లో ప్రసారమవుతుంది. రేపటి (అక్టోబర్ 12) నుంచి ఈ సీరియల్ 45 నిమిషాల పాటు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయనుంది. సరికొత్త ట్విస్టులతో సాగబోయే ఈ సుదీర్ఘ వినోదాన్ని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి.

స్టోరీ ఏంటంటే?

కనకం అనే దిగువ మధ్యతరగతి గృహిణికి స్వప్న, కావ్య, అప్పు అనే ముగ్గురు కూతుళ్లు ఉంటారు. తన కుమార్తెలను ఎలాగైనా ఒకే ఒక పెద్ద శ్రీమంతుల కుటుంబానికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆమె ఆశపడుతుంది. ఆ క్రమంలో సంపన్న దుగ్గిరాల కుటుంబంలోని ముగ్గురు అబ్బాయిలు అయిన రాజ్, రాహుల్, కల్యాణ్ లతో వీరికి పరిచయం ఏర్పడుతుంది.

ఎలాంటి నాటకీయ పరిస్థితుల్లో వారి వివాహాలు జరిగాయన్నదే ఈ బ్రహ్మముడి సీరియల్ ప్రధాన స్టోరీ. ముఖ్యంగా రాజ్ పెద్దమ్మాయి స్వప్నను పెళ్లి చేసుకోవాలనుకోగా, ఆమె పారిపోవడంతో పరిస్థితుల ప్రభావం వల్ల కావ్యతో రాజ్‌కు వివాహం జరుగుతుంది. అయిష్టంగా పెళ్లైనా, దుగ్గిరాల ఇంటి కోడలిగా కావ్య తన వ్యక్తిత్వంతో అందరినీ ఎలా మెప్పించిందనేది సీరియల్ స్టోరీగా సాగుతుంది.

కథలోని ప్రధాన ట్విస్ట్‌లు

రాహుల్ చెప్పిన మోసపూరిత మాటలు నమ్మి స్వప్న పెళ్లి మండపం నుంచి పారిపోవడం, ఆ స్థానంలో కావ్య పెళ్లి పీటలపై కూర్చోవడం ఈ సీరియల్లో తొలి పెద్ద ట్విస్ట్. ఆ తర్వాత మోసపోయానని గ్రహించిన స్వప్న తిరిగి వచ్చి పోరాడి రాహుల్‌నే పెళ్లి చేసుకోవడం కుటుంబంలో సరికొత్త చిచ్చులు రేపుతుంది.

మరోవైపు అనామికతో కల్యాణ్ పెళ్లి సమస్యల్లో పడటం, పరిస్థితుల ప్రభావంతో ముక్కుసూటిగా ఉండే అప్పుతో కల్యాణ్ ఒక్కటవ్వడం కథను మలుపు తిప్పింది. దుగ్గిరాల ఆస్తిని కాజేయడానికి రుద్రాణి వేసే ఎత్తులకు కావ్య ఎప్పటికప్పుడు చెక్ పెడుతూ ఇల్లాలుగా పోరాడటం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

ప్రస్తుతం ఏం జరుగుతోంది?

ప్రస్తుతం ఈ బ్రహ్మముడి సీరియల్ స్టోరీ కథ అనేక కొత్త భావోద్వేగాలు, గందరగోళాలతో ఉత్కంఠభరితంగా సాగుతోంది. అపర్ణ, కుటుంబ పెద్దల నమ్మకాన్ని కాపాడే క్రమంలో కావ్య, రాజ్ మళ్లీ అనేక ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నారు.

మరోవైపు ఆస్తుల చుట్టూ రుద్రాణి, రాహుల్ పన్నుతున్న కుట్రలు, సరికొత్త పాత్రల ఎంట్రీతో కథలో తీవ్రమైన ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఇల్లరికం సమస్యలు, కుటుంబ పరువు కోసం కావ్య చేస్తున్న ప్రయత్నాలు కథను రసవత్తరంగా మార్చాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More