Brahmamudi October 10 Episode: బ్రహ్మముడి.. పెళ్లిపీటలపై ఐశ్వర్య ట్విస్ట్.. బావ దగ్గరికి సిరి.. రాజు, ఇందు పెళ్లి ముచ్చట
Brahmamudi Serial October 10th Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 10 ఎపిసోడ్ లో లక్కీ, ఐశ్వర్య పెళ్లికి ముహూర్తం ఖరారవుతుంది. మరోవైపు గతం గుర్తుకొచ్చిన సిరి తన బావను పెళ్లి చేసుకుంటానంటూ వెళ్లిపోతుంది.
Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో రాజు జీవితంలో నుంచి సిరి వెళ్లిపోతుంది. తన బావను పెళ్లి చేసుకుంటానని చెబుతుంది. ఆ తర్వాత రాజు, ఇందు తమ పెళ్లిళ్ల గురించి మాట్లాడుకుంటారు. మరోవైపు లక్కీ, ఐశ్వర్య పెళ్లికి అన్నీ సిద్ధంగా కాగా.. పీటలపై ఐషూ ఆగండి అంటూ పెద్ద ట్విస్ట్ ఇస్తుంది.

ఇందుకి థ్యాంక్స్ చెప్పిన సిరి
రాజుకు సిరి థ్యాంక్స్ చెప్పే సీన్ తో సీరియల్ శనివారం (అక్టోబర్ 10) ఎపిసోడ్ మొదలైంది. నీ విషయంలో ఇందు కూడా ఎంతో చేసిందని రాజు చెప్పడంతో సిరి ఆమెకు కూడా థ్యాంక్స్ చెబుతుంది. నువ్వో దేవతలా కనిపిస్తున్నావని అంటుంది. ఇందులాంటి భార్య దొరికినందుకు నువ్వో అదృష్టవంతుడివి అని రాజుకి.. రాజులాంటి భర్త దొరికినందుకు నువ్వూ ఈ అదృష్టవంతురాలివి అని ఇందుతో అంటుంది.
ఇక తాను వెళ్తానని సిరి అంటే.. తమతోపాటే ఉండిపోవచ్చు కదా అని రాజు, ఇందు అడుగుతారు. కానీ తనకు ఓ బావ ఉన్నాడని,అతన్నే పెళ్లి చేసుకుంటానని చెబుతుంది. పెళ్లికి మమ్మల్ని పిలుస్తావా అని అడిగితే.. మీరే నా పెళ్లి పెద్దలు అని చెప్పి సిరి వెళ్లిపోతుంది.
చలపతిని భయపెట్టిన నందు
మరోవైపు తొలిసారి ఎస్సై యూనిఫాంలో వెంకీ ఇంటికి వెళ్తుంది నందు. అక్కడ బయట కూర్చొని టిఫిన్ చేస్తున్న చలపతిని భయపెడుతుంది. తన ముఖం సరిగా కనిపించకుండా టోపీ అడ్డుగా పెట్టుకొని గన్ను తీసి చలపతిని హ్యాండ్సప్ అంటూ భయపెడుతుంది. ఆమెను చూసి లక్ష్మీ కూడా వణుకుతుంది. మీ కొడుకు ఇడ్లీ స్మగ్లింగ్ చేస్తున్నాడని అంటుంది. ఏ కొడుకు అంటే.. ఎంత మంది కొడుకులు ఉన్నారని అడుగుతుంది.
ఇద్దరు కొడుకులు అని, పెద్దోడు దొంగనా కొడుకు.. చిన్నోడు చాలా మంచోడని అనడంతో నందు మురిసిపోతుంది. ఆ తర్వాత తన క్యాప్ తీయడంతో చలపతి, లక్ష్మీ ఆశ్చర్యపోతారు. తర్వాత వెంకీ కూడా వస్తాడు. నందుని చూసి షాకవుతాడు. ఇక్కడే ఎస్సైగా పోస్టింగ్ వచ్చిందని చెప్పడంతో కంగ్రాట్స్ చెబుతాడు. చలపతి ఆశీర్వాదం తీసుకొని ఆమె వెళ్లిపోతుంది.
ఇందుని మెచ్చుకున్న రాజు.. పెళ్లి గురించి అడిగి..
అటు ఇంట్లో సిరి వెళ్లిపోవడంతో బొమ్మలన్నీ తీసి పెడుతూ ఉంటుంది ఇందు. అప్పుడే రాజు వచ్చి ఇందుని పొగుడుతాడు. అందరినీ వరుసగా సెట్ చేస్తున్నావ్.. ఐశ్వర్యకు పెళ్లి చేయబోతున్నావ్.. నందుకు ఉద్యోగం ఇప్పించావ్.. కంపెనీ బాధ్యతలు తీసుకున్నావ్.. మరి పెళ్లెప్పుడు చేసుకోబోతున్నావ్ అని రాజు అడగడంతో ఇందు షాకవుతుంది. నిన్ను పెళ్లి చేసుకున్నాను కదా అని అంటే.. మనది ఉత్తిత్తి పెళ్లి కదా అని రాజు అంటాడు.
నీతో ఇలాగే కలిసి ఉండాలని ఉంది బావా అని మనసులో అనుకుంటుంది. తన గురించి ఏమీ ఆలోచించలేదని, నువ్వేం చేస్తావ్.. పెళ్లి చేసుకుంటావా అని రాజుని అడుగుతుంది. నీలాంటి అమ్మాయి దొరికితే చేసుకుంటానని రాజు అంటాడు. ఆ రేఖ పిన్ని, భ్రమరాంబకు తప్ప నువ్వు నచ్చని వాళ్లు ఎవరూ ఉండరని మెచ్చుకుంటాడు.
నాలాంటి అమ్మాయి ఎందుకు నన్నే చేసుకుంటానని అనొచ్చు కదా బావ అని మళ్లీ మనసులో అనుకుంటుంది. నీకు కూడా మంచి అమ్మాయి దొరుకుతుంది లే అని అంటుంది. ఏమోలే.. నీలాంటి అమ్మాయి ఎక్కడా ఉండదు.. అయినా మనకు అంత అదృష్టం ఎక్కుడుంది అంటూ గొణుక్కుంటాడు వెళ్లిపోతాడు రాజు. ఏదో ఒక రోజు నీకు నువ్వుగా నాతో ఐ లవ్యూ అని చెబుతావు చూడు అని ఇందులో అనుకుంటుంది.
ఇంటర్వ్యూకి స్వాతి.. ఉద్యోగం సంపాదించేసి..
మరోవైపు స్వాతి ఇంటర్వ్యూకి వెళ్తుంది. అయితే ఆమె డిగ్రీ సర్టిఫికెట్ లేకపోవడంతో ఉద్యోగం ఇవ్వడం కుదరదని ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి చెబుతాడు. తాను మరో ఆరు నెలల్లో పూర్తి చేస్తానని, అప్పుడు తన సర్టిఫికెట్ తెచ్చిస్తానని, తనకు ఇంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయని, ఉద్యోగం ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తుంది.
కావాలంటే తన గురించి బేగంపేట డిగ్రీ కాలేజీలో ఎవరిని అడిగినా చెబుతారు అని స్వాతి అనడంతో తనదీ అదే కాలేజీ అని, నువ్వు నాకు సూపర్ జూనియర్ వి కావచ్చు అని ఆ వ్యక్తి అంటాడు. తర్వాత ఇద్దరూ కాలేజీ ముచ్చట్లు చెప్పుకుంటారు. స్వాతిని ఉద్యోగంలోకి తీసుకుంటాడు. కచ్చితంగా ఈ ఏడాదే డిగ్రీ పూర్తి చేయాలని కండిషన్ పెడతాడు. ఆమె సరే అంటుంది.
లక్కీ, ఐశ్వర్య పెళ్లికి ముహూర్తం
ఇక దుగ్గిరాల ఇంట్లో మరో పెళ్లి సందడి మొదలవుతుంది. లక్కీ, ఐశ్వర్య పెళ్లికి ముహూర్తం పెట్టడానికి పంతులుని పిలిపిస్తారు. మంచి ముహూర్తం కోసం అతడు చూస్తుంటే.. అంత అవసరం లేదు.. ఏదో ఒకటి చూసేయండి అని ఐశ్వర్య అంటుంది. అటు లక్కీ మాత్రం తొందరపడుతుంటాడు. రేపు ఉదయమే మంచి ముహూర్తం ఉందని పంతులు అనడంతో అంత త్వరగా అంటే కష్టం.. ఏర్పాట్లు చేసుకోవాలి.. బంధువులను పిలవాలి.. భోజనాలు ఏర్పాటు చేయాలి అని ఇందు అంటుంది.
అటు అపర్ణ కూడా తమ ఇంట్లో చాలా రోజుల తర్వాత శుభకార్యం జరుగుతోందని, చాలా గ్రాండ్ గా చేయాలనుకుంటున్నట్లు చెబుతుంది. మరో ముహూర్తం అంటే మూడు నెలల వరకు లేదని పంతులు చెప్పడంతో లక్కీ తొందరపడుతూ ఇదే ఖాయం చేయాలని అంటాడు. అటు ఐశ్వర్య కూడా ఇది త్వరగా పూర్తయితే తనకు కంపెనీ వస్తుందంటూ ఇదే ఖాయం చేయాలని అడుగుతుంది.
పెళ్లి పీటలపై ట్విస్ట్
లక్కీ, ఐశ్వర్య పెళ్లికి ఏర్పాట్లు జరుగుతుంటాయి. అందరూ చాలా ఆనందంగా ఉంటారు. లక్కీ, ఐశ్వర్య పెళ్లికి ముస్తాబై వస్తారు. తీరా తాళి కట్టేవేళ పెళ్లి పీటలపై ఆగండి అంటూ ఐషూ ట్విస్ట్ ఇవ్వడంతో అందరూ షాకవుతారు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


