Brahmamudi October 8 Episode: బ్రహ్మముడి.. సిరి కోసం దుబాయ్ మనిషి.. రేఖ ప్లాన్‌కు నందు,రాజు బలి.. ఐషూని రెచ్చగొట్టిన రేఖ
Brahmamudi Serial October 8th Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 8 ఎపిసోడ్ లో రేఖ వేసిన ప్లాన్ కు రాజు, నందు బలవుతారు. అటు సిరి తనదంటూ దుబాయ్ నుంచి ఓ మనిషి రావడం కథను మలుపు తిప్పునుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో ఐశ్వర్యను అడ్డం పెట్టుకొని ఆస్తిని సొంతం చేసుకోవాలనుకున్న రేఖ.. రాజు అడ్డు తొలగించుకోవానికి ఓ ప్లాన్ వేస్తుంది. అందులో భాగంగా దుబాయ్ నుంచి వచ్చాడంటూ ఓ మనిషిని రంగంలోకి దింపుతుంది.

ఎలాగైనా మనకు లాభమే అనుకున్న రేఖ.. శేషు వార్నింగ్
ఐశ్వర్యకు కంపెనీ పెట్టిస్తామని హామీ ఇవ్వడంపై అపర్ణ, సుభాష్ ఆందోళన చెందే సీన్ తో సీరియల్ గురువారం (అక్టోబర్ 8) ఎపిసోడ్ మొదలైంది. అయితే వాళ్లకు రాజు, ఇందు హామీ ఇస్తారు. ఇటు రేఖ మాత్రం ఐశ్వర్య ద్వారా ఆస్తి తన సొంతమైనట్లే అని సంతోషిస్తుంది. ఆమె ఆపరేషన్ చేయించుకున్నా.. లక్కీని పెళ్లి చేసుకున్నా.. ఎలాగైనా తమకు లాభమే అని భ్రమరాంబ, భూషణ్, శేషులతో అంటుంది.
దీంతో శేషు ఆమెకు వార్నింగ్ ఇస్తాడు. ఐషూకి కంపెనీ పెట్టిస్తే ఆస్తి ఎలా వస్తుంది.. అయినా ఐశ్వర్యను తక్కువ అంచనా వేయొద్దు.. ఆమె ఏం చేయాలనుకుంటే అది చేస్తుంది.. ఎవరినీ పట్టించుకోదు.. రేపు పెళ్లి తర్వాత కంపెనీ పెట్టిస్తే ఆమె నీ మాట కూడా వినదు అని శేషు అంటాడు. భూషణ్ కూడా అదే అంటాడు. ఇందు విషయంలోనూ ఇలాగే అన్నావు.. ఇప్పుడామె ఎదురు తిరిగినట్లే ఐషూ కూడా చేస్తే ఎలా అంటాడు. కానీ రేఖ మాత్రం వాళ్ల మాట వినదు. ఐషూ తాను చెప్పినట్లే వింటుందని అంటుంది.
బిజినెస్ ప్లాన్స్ వేసుకున్న ఐశ్వర్య.. లక్కీకి క్లాస్
మరోవైపు కంపెనీ తన సొంతమైనట్లే అనుకున్న ఐశ్వర్య.. అప్పుడే బిజినెస్ ప్లాన్స్ కూడా వేస్తుంది. తన కడుపులో బిడ్డ తన జీవితాన్ని ఇలా మారుస్తాడని అనుకోలేదని అంటుంది. ఇక కంపెనీకి ఏం పేరు పెట్టాలి.. పెద్ద ఆంత్రప్రెన్యూర్ కావాలంటే ఏం చేయాలనే రీసెర్చ్ మొదలుపెడుతుంది. అప్పుడే లక్కీ తన గదిలోకి రావడంతో అతనికి క్లాస్ పీకుతుంది. అతడు సరసాలు ఆడటానికి ట్రై చేస్తాడు.
నా పెళ్లాంవే కదా అంటాడు. మనకు ఇంకా పెళ్లి కాలేదు.. అయినా కూడా నిన్ను కేవలం కంపెనీ కోసమే పెళ్లి చేసుకుంటున్నాను.. అంతే తప్ప నీలాంటి వాడిని నేను పెళ్లి చేసుకోవడమేంటని అంటుంది. అయినా లక్కీ మాత్రం పెళ్లి తర్వాత నువ్వే మారిపోతావు.. నాతోనే ఉంటావని చెప్పి వెళ్లిపోతాడు.
లక్కీ గురించి రాజు ఆందోళన.. హామీ ఇచ్చిన ఇందు
ఇటు లక్కీ గురించి రాజు ఆందోళన చెందుతుంటాడు. కంపెనీ కోసం ఐశ్వర్య ఈ పెళ్లికి ఒప్పుకుంది.. బిడ్డను కంటానంది.. కానీ ఆ తర్వాత లక్కీతో కలిసి ఉంటుందా.. అసలే తన స్టేటస్ ఏంటి అన్నట్లుగా మాట్లాడింది.. తర్వాత లక్కీకి విడాకులు ఇస్తే ఎలా అని ఇందుతో రాజు అంటాడు. కానీ ఇందు మాత్రం అతనికి హామీ ఇస్తుంది. పెళ్లి తర్వాత, బిడ్డను కన్న తర్వాత ఆ బిడ్డను చూసుకుంటూ ఐశ్వర్య మారిపోతుందని, లక్కీతోనే కలిసి ఉంటుందని అతనికి నచ్చజెప్తుంది.
ఐశ్వర్యను రెచ్చగొట్టిన రేఖ
ఇటు రేఖ దగ్గరికి వెళ్లిన ఐశ్వర్య.. మీపై తేలు పాకుతోందని అనడంతో ఆమె కంగారు పడుతూ లబోదిబోమంటుంది. అదేమీ లేదు.. మీకు తేలు పాకుతుందంటేనే అంతగా చీదరించుకున్నారు కదా.. అలాంటిది నాకు ఆ లక్కీగాడితో పెళ్లంటే ఎలా ఉంటుందో ఊహించారా అని అడుగుతుంది.
దీంతో నీకు కంగ్రాట్స్ చెప్పింది వాడితో పెళ్లి అని కాదు.. సొంత కంపెనీ వస్తుంది అని.. లక్కీ నా కడుపు పుట్టాడన్నది తప్ప వాడితో నాకు ఎలాంటి అటాచ్‌మెంట్ లేదు.. నిన్నే నేను ప్రేమగా పెంచాను.. ఇప్పుడు కంపెనీ పెడుతుంటే సంతోషంగా ఉంది అని రేఖ అంటుంది. ఆ రాజుగాడు ఉండగా ఆస్తి వస్తుందా అని ఐషూ అంటే.. వాడిని పంపించేసే సమయం వచ్చిందని రేఖ చెబుతుంది. అప్పుడే తన వ్యక్తికి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ కు వెళ్లమని చెబుతుంది.
ఫ్యామిలీ మిస్సింగ్ అంటూ పోలీస్ స్టేషన్‌కు రేఖ మనిషి.. నందు చేతికి కేసు
ఆ తర్వాత దుబాయ్ నుంచి వచ్చానంటూ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ కు వెళ్తాడు. తన ఫ్యామిలీ మిస్సింగ్ అని సీఐతో చెబుతాడు. ఆరోజే ఎస్సైగా జాయిన నందుకి ఈ కేసు అప్పగిస్తాడు సీఐ. తాను మూడేళ్లుగా దుబాయ్ లో ఉండి వస్తే.. ఇక్కడ తన మామయ్య, మరదలు కనిపించడం లేదని చెబుతాడు. ఆరా తీస్తే రాజు అనే వ్యక్తి మామయ్యను చంపి, తన మరదలు సిరిని కోమాలోకి పంపించాడని తెలిసిందని అంటాడు.
సిరిని పెళ్లి చేసుకోవడంతోపాటు ఆ తర్వాత దుగ్గిరాల కుటుంబం నుంచి ఇందు అనే అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడని తెలిసిందని చెబుతాడు. దీంతో నందు షాకవుతుంది. రాజుపై ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్ట్ చేయడానికి నందు వెళ్తుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


