Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాత్రిపూట రాజ్‌ను బయటకు తీసుకువెళ్లమన్న ఇందు దొంగతనం చేసి ఐస్‌క్రీమ్ తినాలంటుంది. అందుకు ముందు రాజ్ ఒప్పుకోడు. డల్లాస్ కాంతారావు దగ్గర తేల్చుకుందామని ఇందు అనడంతో రాజ్ ఒప్పుకుంటాడు. తనే దొంగతనం చేసి ఐస్‌క్రీమ్ తినాలని చెబుతుంది ఇందు.
చిన్నప్పటి డ్రీమ్ నెరవేరిందిగా

కాసేపు వాదించిన రాజ్ తర్వాత ఒప్పుకుంటాడు. ఇందు, రాజ్ ఐస్‌క్రీమ్ బండి వాడి దగ్గరికి వెళ్లి ఐస్‌క్రీమ్ కొట్టేస్తుంది ఇందు. దాంతో ఇందు సంతోషిస్తుంది. నీ చిన్నప్పటి డ్రీమ్ నెరవేరిందిగా అని రాజ్ అంటాడు. ఇద్దరు చెరో ఐస్‍క్రీమ్ తింటారు. రాజ్ ఐస్‌క్రీమ్ వెంటనే తినేస్తాడు. అదేంటీ కక్కుర్తిలా వెంటనే తినేసావ్, నీకు ఇంకోటి తినాలని ఉందిగా. పదా ఇంకోటి కొట్టేద్దాం అని ఇందు అంటుంది.
మళ్లీ వాడి దగ్గరికి వెళ్తే దొరుకుతాం అని రాజ్ అంటాడు. ఇరికించాలనే కదా అని మనసులో అనుకుంటుంది ఇందు. ఏంటీ అని రాజ్ అనడంతో నేను మ్యానేజ్ చేస్తానని ఇందు అంటుంది. కొట్టేసిన ఐస్ క్రీమ్ వాడి దగ్గరికి రాజ్, ఇందు వెళ్తారు. ఇందు చేతిలో ఉన్న ఐస్‌క్రీమ్ చూసి ఇదెక్కడి, నా దగ్గర కొనలేదుగా అని ఐస్ క్రీమ్ బండివాడు అంటాడు. పక్క బండి దగ్గర కొన్నామని రాజ్ అంటాడు. లేదు నీ దగ్గరే ఈ ఐస్ క్రీమ్స్ కొట్టేశాం. డబ్బులు ఇచ్చేందుకు వచ్చామని ఇందు అంటుంది.
ఐస్ క్రీమ్ వాడి దగ్గర రాజ్ దొంగతనం చేసినట్లు ఇరికిస్తుంది ఇందు. దాంతో అతను రాజ్‌ను తిడతాడు. చూస్తుంటేనే అర్థమవుతోంది దొంగ అని అంటాడు. తర్వాత అతనికి రాజ్ డబ్బులు ఇస్తాడు. మాములు ధరకన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చేలా చేస్తుంది ఇందు. రాజ్ డబ్బు ఇస్తాడు. ఎందుకు అలా నన్ను ఇరికించావని రాజ్ అడుగుతాడు. నువ్వు అస్సలు ఊహించలేదు కదా. పాపం అతను కష్టపడి సంపాదిస్తున్నాడు. నాకు దొంగతనం సరదానే. కానీ, దానికి అతన్ని మోసం చేయడం ఇష్టం లేదని ఇందు చెబుతుంది.
ఇందు కోరికల లిస్ట్
సరే ఇంకేం ఉన్నాయి నీ కోరికలు అని రాజ్ అడుగుతాడు. బెలూన్స్‌తో ఆడుకోవాలి, స్ట్రీట్ ఫుడ్ తినాలి అని చాలా పెద్ద లిస్ట్ చెబుతుంది. చిన్నప్పటి నుంచి ఏది చేయలేదు. మళ్లీ ఈ అవకాశం రాదు. ఈ రాత్రికి అన్ని కోరికలు తీర్చుకోవాలి అని ఇందు అంటుంది. ముందు కాసేపు వాదించిన రాజ్ తర్వాత ఒప్పుకుంటాడు. పక్కకు వెళ్లి రీఛార్జ్ చేసుకుని వస్తానని రాజ్ వెళ్తాడు. ఓ బీర్ బాటిల్ కొని తను కొంచెం తాగి మిగతాది ఓ టిన్‌లో పోస్తాడు.
{{/usCountry}}సరే ఇంకేం ఉన్నాయి నీ కోరికలు అని రాజ్ అడుగుతాడు. బెలూన్స్‌తో ఆడుకోవాలి, స్ట్రీట్ ఫుడ్ తినాలి అని చాలా పెద్ద లిస్ట్ చెబుతుంది. చిన్నప్పటి నుంచి ఏది చేయలేదు. మళ్లీ ఈ అవకాశం రాదు. ఈ రాత్రికి అన్ని కోరికలు తీర్చుకోవాలి అని ఇందు అంటుంది. ముందు కాసేపు వాదించిన రాజ్ తర్వాత ఒప్పుకుంటాడు. పక్కకు వెళ్లి రీఛార్జ్ చేసుకుని వస్తానని రాజ్ వెళ్తాడు. ఓ బీర్ బాటిల్ కొని తను కొంచెం తాగి మిగతాది ఓ టిన్‌లో పోస్తాడు.
{{/usCountry}}ఇది తాగితే మైకం వచ్చి ఇంటికి వెళ్దామంటుంది అని ఇందుతో బీర్ తాగించే ప్లాన్ వేస్తాడు రాజ్. ఇదిగో కూల్ డ్రింక్ తీసుకో అని ఇందుకు చెబుతాడు రాజ్. ఇప్పుడే ఐస్ క్రీమ్ తిన్నా. అన్ని కలిస్తే వాంతి అవుతుందని ఇందు అంటుంది. స్ట్రీట్ ఫుడ్ లేదు అందుకే స్ట్రీట్ పానియం తీసుకొచ్చా. దీనికే స్పెషాలిటీ ఉందని రాజ్ అంటే.. ఇది తాగితే మత్తు ఎక్కుతుందా అని ఇందు అంటుంది. దాంతో రాజ్ షాక్ అవుతాడు.
జోక్ చేశానని ఇందు అంటుంది. నీ పిచ్చి కోరికలు, అదే నీ కోరికలు మంచివి కదా అన్ని నెరవేరేందుకు ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ డ్రింక్ ఇది. నా మాట కూడా లెక్కచేయవని రాజ్ అంటాడు. అయితే నాకు అదే కావాలని రాజ్ ఇచ్చిన బీర్ తాగుతుంది ఇందు. కొంచెం చేదుగా ఉందని చెబుతుంది. బీర్ తాగిన ఇందు మత్తెక్కి చాలా సంతోషంగా ఉన్న అమ్మాయిలా బిహేవ్ చేస్తుంది. చందమామను చూసి అది చూడు ఎంత బాగుందో అంటుంది.
రాజ్‌ను హత్తుకున్న ఇందు
ఇంత మంచి వాతావరణంలో చందమామను చూస్తే ఎంత బాగుందో తెలుసా. థ్యాంక్యూ రాజు అని కౌగిలించుకుంటుంది ఇందు. దాంతో రాజ్ కూడా ప్రేమగా ఫీల్ అవుతాడు. హగ్ చేసుకునేందుకు చేతులు వేయబోతాడు. తర్వాత నక్షత్రాలను చూసిన ఇందు వాటికి పేరు పెడతారటా తెలుసా. నీ సాక్షిగా ఆ స్టార్‌కు నేను పేరు పెడతాను. ఆ స్టార్ ఇందు స్టార్ అని పేరు పెట్టి గోల చేస్తుంది ఇందు. తర్వాత ఒకతని దగ్గర ఉన్న బెలూన్స్ కొట్టేసి పరుగెత్తుతుంది ఇందు.
అతనికి రాజ్ డబ్బులు ఇస్తాడు. మత్తెక్కి పడిపోతందనుకుంటే పిచ్చిదానిలా పరుగెత్తుతుందని రాజ్ అనుకుంటాడు. బెలూన్స్‌తో ఇందు ఆడుకుని వదేలిస్తుంది. అవి పైకి వెళ్తుంటే మురిసిపోతుంది. మరుసటి రోజు అమ్మనాన్నల పెళ్లి రోజు అని రాజుకు వెంకీ చెబుతాడు. చికెన్ కదా తీసుకొస్తా అని రాజ్ అంటాడు. అదే విషయం ఇందు అడిగితే.. తల్లిదండ్రుల పెళ్లిరోజు గురించి చెబుతాడు.
మంచిగా డెకరేట్ చేసి స్వీట్స్ పంచి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలి అని ఇందు అంటుంది. డబ్బులు నువ్వు ఇస్తావా అని రాజ్ అంటాడు. జీరో బడ్జెట్‌తో నేను సెలబ్రేట్ చేస్తానని ఇందు అంటుంది. రాజ్ తన ఇంటికి ఇందును తీసుకెళ్తాడు.
రాజ్ అమ్మనాన్నల పెళ్లి రోజు
ఈ అమ్మాయి ఎందుకు వచ్చిందని తండ్రి అడిగితే.. ఈరోజు పెళ్లి అని రాజ్ అంటాడు. దాంతో రాజ్, ఇందు పెళ్లి చేసుకుని వచ్చారని గగ్గోలు పెడతాడు రాజ్ తండ్రి. తర్వాత రాజ్ తల్లిదండ్రుల పెళ్లి రోజును జీరో బడ్జెట్‌తో ఘనంగా సెలబ్రేట్ చేస్తుంది ఇందు. అంటే తన అత్తమామల పెళ్లి రోజును తనకు తెలియకుండా సెలబ్రేట్ చేస్తుంది ఇందు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.