Brahmamudi April 24th Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో రేఖకు ఊహించని షాక్ తగులుతుంది. తీసుకున్న బంగారానికి డబ్బులు ఇవ్వనని చక్రి తేల్చి చెబుతాడు. దీంతో అటు ఇందు పర్మనెంట్ గా రాజు ఇంట్లోనే సెటిలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
బీరు తాగి రోడ్డుపై ఇందు హంగామా

బ్రహ్మముడి సీరియల్ శుక్రవారం (ఏప్రిల్ 24) ఎపిసోడ్ బీరు తాగి రోడ్డుపై ఇందు చేసే హంగామాతో మొదలవుతుంది. ఆమెను కంట్రోల్ చేయడానికి రాజు నానా తంటాలు పడతాడు. తన జీవితంలో లేని స్వేచ్ఛను తొలిసారి అనుభవించిన ఇందు.. దానిని బాగా ఎంజాయ్ చేస్తుంది. ఆమెను చూసి రాజు షాక్ తింటాడు. ఇద్దరూ ఆ తర్వాత ఓ పార్కులోకి వెళ్లి కింద కూర్చొంటారు.
ఒకరి గురించి ఒకరు తెలుసుకున్న రాజు, ఇందు
మెల్లగా ఒకరి గురించి ఒకరు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. రాజు తన ఫ్యామిలీ గురించి చెబుతాడు. కిడ్నాప్ కాకుండా ఇంకేం చేస్తావని అడిగితే.. ఏం చేయాలా అని ఆలోచిస్తాను.. ఈ రోజుల్లో చదివితే ఉద్యోగాలు ఎక్కడ వస్తున్నాయి అని అంటాడు. అటు ఇందు మాత్రం అసలు తాను చదువుకోవడానికి బయటకే వెళ్లలేదని, తన నాన్నమ్మే ఇంట్లో అన్నీ నేర్పించిందని చెబుతుంది.
ఇందు కోసం పాట పాడిన రాజు
ఆ తర్వాత తనకు నిద్ర వస్తోందని, ఓ పాట పాడమని ఇందు అంటుంది. మొదట్లో ఒఫ్పుకోని రాజు తర్వాత వెన్నెల అంటూ పాట పాడతాడు. ఇందు మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది. రాజు ఒడిలోనే ఆమె నిద్రపోతుంది. ఇద్దరూ అలా పార్కులోనే ఆ రాత్రంతా గడిపేస్తారు.
రేఖకు షాకిచ్చిన చక్రి
మరోవైపు తన దగ్గర తీసుకున్న బంగారానికి డబ్బులు అడగటానికి చక్రి దగ్గరికి వెళ్తారు రేఖ, భూషణ్. కానీ అతడు ఎక్కడి డబ్బు అంటూ షాక్ ఇస్తాడు. నేను డబ్బిస్తానంటే ఎలా నమ్మారు.. అది మీ పాత బాకీ కింద జమ చేసుకున్నాను.. ఇన్నాళ్లూ నా దగ్గర డబ్బు అవసరం అయినప్పుడల్లా నా ఇంటికి వచ్చి బతిమాలారు.. ఆ తర్వాత మీ చుట్టూ తిప్పించుకున్నారు.. మరో వారం గడువు ఇస్తున్నాను.. మిగిలిన మొత్తం అప్పు కూడా తీర్చాల్సిందేనని రేఖ, భూషణ్ లకు చక్రి స్పష్టం చేస్తాడు. ఆ రూ.కోటి కిడ్నాపర్లకు ఇస్తేనే ఇందు వస్తుందని, ఆ తర్వాతే ఆస్తి తమ పేరిట అవుతుందని రేఖ చెప్పినా వినడు. దీంతో చేసేది లేక ఇద్దరూ వెనక్కి వెళ్లిపోతారు.
రాజు ఇంటికి ఇందు.. ఈవెంట్ ప్లానర్‌గా అమ్మానాన్నల పెళ్లి రోజు
{{/usCountry}}మరోవైపు తన దగ్గర తీసుకున్న బంగారానికి డబ్బులు అడగటానికి చక్రి దగ్గరికి వెళ్తారు రేఖ, భూషణ్. కానీ అతడు ఎక్కడి డబ్బు అంటూ షాక్ ఇస్తాడు. నేను డబ్బిస్తానంటే ఎలా నమ్మారు.. అది మీ పాత బాకీ కింద జమ చేసుకున్నాను.. ఇన్నాళ్లూ నా దగ్గర డబ్బు అవసరం అయినప్పుడల్లా నా ఇంటికి వచ్చి బతిమాలారు.. ఆ తర్వాత మీ చుట్టూ తిప్పించుకున్నారు.. మరో వారం గడువు ఇస్తున్నాను.. మిగిలిన మొత్తం అప్పు కూడా తీర్చాల్సిందేనని రేఖ, భూషణ్ లకు చక్రి స్పష్టం చేస్తాడు. ఆ రూ.కోటి కిడ్నాపర్లకు ఇస్తేనే ఇందు వస్తుందని, ఆ తర్వాతే ఆస్తి తమ పేరిట అవుతుందని రేఖ చెప్పినా వినడు. దీంతో చేసేది లేక ఇద్దరూ వెనక్కి వెళ్లిపోతారు.
రాజు ఇంటికి ఇందు.. ఈవెంట్ ప్లానర్‌గా అమ్మానాన్నల పెళ్లి రోజు
{{/usCountry}}అటు ఉదయాన్నే రాజుకి ఫోన్ చేస్తాడు వెంకీ. ఈరోజు అమ్మానాన్నల పెళ్లి రోజు అని అంటాడు. అర్థమైంది.. చికెన్ కావాలి అంతే కదా.. తెస్తాను అని పెట్టేస్తాడు. సింపుల్ గా చికెన్ తో సరిపెట్టేస్తావా.. అమ్మానాన్నల పెళ్లి రోజును డెకరేషన్ చేసి గ్రాండ్ గా చేయవా అని ఇందు అంటుంది. అంత సీన్ లేదని రాజు అంటాడు. తనను ఇంటికి తీసుకెళ్తే చేస్తానని ఇందు చెబుతుంది. డబ్బులు లేవని అనడంతో జీరో బడ్జెట్ తో తాను చేస్తానని హామీ ఇస్తుంది.
ఆ తర్వాత ఇందు.. రాజు ఇంటికి వెళ్తుంది. అక్కడ పరిస్థితి చూసి షాక్ తింటుంది. ఇందుని చూసి వాళ్లు కూడా షాక్ తింటారు. అయితే తాను చెప్పినట్లే రాజు అమ్మానాన్నల పెళ్లిరోజును తక్కువ బడ్జెట్ లో చాలా గ్రాండ్ గా చేస్తుంది ఇందు. దీంతో అందరూ చాలా సంతోషిస్తారు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.