Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మదన్‌తో గొడవ తర్వాత రాజు వస్తాడు. మదన్ వెళ్లిపోతాడు. రేఖ పిన్ని కూడా నీలాంటి పరిస్థితినే ఎదుర్కొంటుంది. తప్పకుండా నీ సమస్యకు సొల్యూషన్ తీసుకొస్తుందని రాజు అంటాడు. ఆ నమ్మకంతోనే ఉన్నానని లక్కీ వెళ్లిపోతాడు.
రెండు రోజులే టైమ్

నీకు ఇంకా రెండు రోజులే టైమ్ ఉంది. ఇప్పటివరకు నీ గురించే ఆలోచించాను. ఎందుకంటే ఇది చెబితే నీ కుటుంబంలో కూడా సమస్యలు వస్తాయి కాబట్టి. లక్కీని నీ కొడుకుగా ఎలా ఒప్పుకుంటావో నువ్వే ప్లాన్ చేసుకో. నేను చెబితే మాత్రం నీ లైఫ్‌లో చాలా డ్యామేజ్ జరుగుతుంది. నీ భర్త, నీ కొడుకు నిన్ను వదిలేయొచ్చు. అలాంటి పరిస్థితి తెచ్చుకోకు అని సాఫ్ట్‌గా చెప్పేసి వెళ్లిపోతాడు రాజు.
మరోవైపు వెంకీ, నందు రెస్టారెంట్‌లో కలుస్తారు. ఎందుకు కలవాలన్నావ్ అని నందు అడుగుతుంది. నా లైఫ్‌లో ముఖ్యమైన విషయం ఏంటంటే అది ప్రేమ. నిప్పులాంటి ప్రేమ దొరకాలనుకున్నా. దానికి నువ్వు చాలా హెల్ప్ చేశావ్. కానీ, నాకు ఎవరు సెట్ అవ్వలేదుగా అని వెంకీ అంటాడు. ఇదంతా ఎందుకు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పురా అని మనసులో అనుకుంటుంది నందు.
నేను అడిగింది నువ్వు కాదనకూడదు అని వెంకీ అంటే.. సరేనంటుంది నందు. నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని ఫోన్‌లో నందు ఫొటోనే చూపిస్తాడు వెంకీ. దానికి తెగ సంబరపడిపోతుంది నందు. షాక్ అవుతుందనుకుంటే సంతోషిస్తుందేంటని వెంకీ అనుకుని ఫోన్ చూస్తాడు. సారీ, నందు అనుకోకుండా నీ ఫొటో వచ్చింది. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఈ అమ్మాయిని అని మరో ఫొటో చూపిస్తాడు వెంకీ.
నందు గుండె ముక్కలు
అప్పుడు నందు గుండె ముక్కలు అవుతుంది. ఎవరీ అమ్మాయని నందు అడుగుతుంది. మా అమ్మనాన్న పెళ్లి చూపులు చూస్తున్నారు. అందులో ఒక అమ్మాయి అని వెంకీ అంటాడు. ఇప్పుడు నువ్వు ఎవరిని ప్రేమించట్లేదా. నీ మనసులో ఎవరు లేరా అని కన్నీళ్లతో అడుగుతుంది నందు. లేరు. ఏదైనా ఉంటే నీకేగా చెబుతాను. ఈ అమ్మాయి నాకు సెట్ అవుతుందా అని వెంకీ అడుగుతాడు.
{{/usCountry}}అప్పుడు నందు గుండె ముక్కలు అవుతుంది. ఎవరీ అమ్మాయని నందు అడుగుతుంది. మా అమ్మనాన్న పెళ్లి చూపులు చూస్తున్నారు. అందులో ఒక అమ్మాయి అని వెంకీ అంటాడు. ఇప్పుడు నువ్వు ఎవరిని ప్రేమించట్లేదా. నీ మనసులో ఎవరు లేరా అని కన్నీళ్లతో అడుగుతుంది నందు. లేరు. ఏదైనా ఉంటే నీకేగా చెబుతాను. ఈ అమ్మాయి నాకు సెట్ అవుతుందా అని వెంకీ అడుగుతాడు.
{{/usCountry}}దీనికోసమేనా రమ్మన్నావ్ అని నందు అంటే.. అవును, నువ్వు దేనికనుకున్నావ్ అని వెంకీ అంటాడు. దానికి నందు చెప్పబోతుంటే.. వెంకీ ఆపేసి ఈ అమ్మాయి ఓకేనా. నువ్వు ఓకే అంటే మా అమ్మనాన్నకు చెబుతాను అని వెంకీ అంటాడు. నాకు అర్జంట్ పని ఉందని నందు ఏడుస్తూ వెళ్లిపోతుంది. నందు బారంగా వెళ్లిపోతుంది. అది చూసి వెంకీ కూడా బాధపడుతాడు. కానీ, తను అనుకున్న ప్లాన్ సక్సెస్ అయిందనుకుంటాడు.
మరోవైపు ఇంట్లో అందరిని పిలిచి రాజు స్వీట్స్ పంచుతాడు. ఐశ్వర్యకు నోట్లో బలవంతంగా కుక్కుతాడు. శేషుతో కలిసి డ్యాన్స్ చేస్తాడు రాజు. భ్రమరాంబ కూడా డ్యాన్స్ చేస్తూ వస్తుంది. రేఖ వస్తే స్వీట్స్ పెట్టబోతాడు రాజు. కానీ, రేఖ తినదు. ఏమైందని భ్రమారంబ అడిగితే శేషు తెలియదంటాడు. దీన్నే ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అని భ్రమరాంబ అంటుంది.
ప్రాజెక్ట్‌కి వచ్చిన లాభాలు
హా.. మన పెళ్లే అని రాజు అంటాడు. ఏంటీ మళ్లీ పెళ్లా అని భ్రమరాంబ షాక్ అవుతుంది. నువ్వు అడిగినదానికి రివర్స్‌లో చెప్పానని రాజు అంటాడు. అంత గుడ్ న్యూస్ ఏంటని అపర్ణ అడుగుతుంది. సోఫాపై ఉన్న రెడ్ క్లాస్ తీస్తాడు రాజు. దాంతో సోఫాపై ఉన్న డబ్బంతా చూసి అంతా షాక్ అవుతారు. అందులోనుంచి భ్రమరాంబ డబ్బు కొట్టేస్తుంటే రాజు పట్టుకుని చెబుతాడు.
ఇంత డబ్బు ఎక్కడిదని రేఖ అడుగుతుంది. నేను ఇందు చేసిన మొదటి ప్రాజెక్ట్‌కు వచ్చిన లాభాలు అని రాజు చెబుతాడు. ఇన్నేళ్లలో మన కంపెనీ లాభాలు చూసిందని అపర్ణతో అంటాడు. ఇందు వస్తుంది. రాజు ఎత్తుకుని తిప్పుతాడు. దీనంతటికి కారణం ఇందు అని రాజు, బావ సహాయం లేకుండా చేయలేనని ఇందు అంటారు.
ఎప్పుడు చూడు నష్టాలు చూపించావే కానీ ఇలా లాభాలు తెచ్చావా అని రేఖపై సెటైర్లు వేస్తాడు రాజు. నువ్వు, ఇందు గ్రేట్ అని శేషు అంటాడు. రేఖ కోపంగా చూస్తుంది. అపర్ణ, సుభాష్ సంతోషంగా ఉందంటారు. తన అదృష్టం బాగుండి లాభాలు వచ్చాయని ఐశ్వర్య అంటుంది. ఇందు కష్టం గురించి రాజు చెబుతాడు. అల్లుడితో అలాగేనా మాట్లాడేదని ఐశ్వర్యను వారిస్తుంది భ్రమరాంబ.
లాభాల నుంచి ఖర్చులు
రేఖను పిలిచి ఇంతా డబ్బు రావడానికి కారణం మీరు నన్ను సీఈఓ చేయడమే అని అంటుంది ఇందు. ఆ డబ్బులోనుంచి కట్టాల్సిన బిల్స్ కట్టే మిగతాది తీసుకోవాలని ఇందు అంటుంది. పెండింగ్ బిల్ 7 లక్షలు అని ఇందు చెబితే రాజు తీస్తాడు. ఇంటి ప్రాపర్టీ ట్యాక్స్ ఏడేళ్లుగా కట్టలేదట అని, అది 4 లక్షలు అని ఇందు చెబుతుది. ఈ ప్రాజెక్ట్‌కి ఎంప్లాయిస్ కాకుండా వేరేవాళ్లు కూడా వర్క్ చేశారు. వాళ్లకివ్వాలని ఇందు అంటుంది.
అలా ఎవరు చేశారని భూషణ్ అడిగితే.. బామ్మర్ది అలాంటివి ఉంటాయి. ఎప్పుడైనా లాభాలు తెచ్చిన మొహాలు అయితే కదా తెలిసేదని శేషు అంటాడు. రేఖ కోపంగా చూస్తుంది. టంగ్ స్లిప్ అయిందని శేషు అంటాడు. ఎంప్లాయిస్‌కు 5 లక్షలు అని, ఫ్యూచర్ ప్రాజెక్ట్ అడ్వాన్స్ 2 లక్షలు, కంపెనీ మెయింటేన్స్ అంటూ అన్ని లెక్కలు చెబుతుంది ఇందు.
ఆ డబ్బంతా రాజు పక్కకు పెడతాడు. ఏనాడైనా రేఖ పిన్ని అన్ని సమర్థవంతంగా చేసిందా అని రాజు అంటే.. లేదల్లుడు అయినా మా చెల్లెమ్మకి లాక్కోవడం తప్పా సంపాదించడం తెలియదు కదా అని శేషు రేఖపై వరుసగా సెటైర్లు వేస్తాడు. అందులో కొంత డబ్బు తీసి అది తాతయ్యకు ఆపరేషన్ చేయించడానికి అని ఇందు చెబుతుంది.
చివరికి మిగిలింది లక్ష
అంతా షాక్ అవుతారు. భ్రమరాంబ ఒప్పుకోను అంటే ఈవిడెవరు అని రాజు అంటాడు. రేఖకు కంప్లైంట్ ఇస్తుంది భ్రమరాంబ. కంప్లైంట్ ఇస్తే ఆవిడేం పీకలేదులే అని రాజు అంటాడు. రేఖ సైలెంట్‌గా ఉంటుంది. సుభాష్ వద్దంటే నీకు ఇది చేయాల్సిందే అని రాజు, ఇందు అంటారు. డాక్టర్ అపాయింట్‌మెంట్ చూడమని అపర్ణకు డబ్బుచ్చి చెబుతుంది ఇందు.
అన్ని పోను మిగిలింది లక్ష అని రాజు అంటాడు. ఆ మిగిలిన లక్షను రాజుకు ఇస్తుంది ఇందు. ఆ లక్షను తీసుకెళ్లి తండ్రి చలపతికి ఇస్తాడు రాజు. అది చూసి ఎక్కడి నుంచి కొట్టుకొచ్చావురా అని చలపతి తిడతాడు. అది మీ అబ్బాయి కష్టపడి సంపాదించిన డబ్బు అని ఇందు చెబుతుంది. దాంతో చలపతి సంతోషిస్తాడు.
రాజు నెలజీతం 5 లక్షలు
తనను, తన కొడుకుని దెప్పిపొడిచినవాళ్లను పిలిచి నా కొడుకు ప్రయోజకుడు అయ్యాడని గర్వంగా, గొప్పగా చెప్పుకుంటాడు చలపతి. నా కొడుకు నెల జీతం ఎంతో తెలుసా ఐదు లక్షలు అని గొప్పగా కాలర్ ఎగరేసినట్లు చూపిస్తాడు చలపతి. అది చూసి రాజు ఎమోషనల్ అవుతాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.